News November 5, 2024

Wikiకి కేంద్రం నోటీసులు

image

అసత్య, పక్షపాత సమాచార అభియోగాలపై వికీపీడియాకు కేంద్రం నోటీసులు జారీ చేసింది. వికీని పబ్లిషర్‌గా ఎందుకు గుర్తించకూడదో చెప్పాలని ఆదేశించింది. కాగా ఎవరైనా ఈ ప్లాట్‌ఫాంలో సమాచారం చేర్చే అవకాశం ఉండటంతో తాము పబ్లిషర్ కాదు అని వికీ గతంలో పేర్కొంది. పరిమిత ఎడిటోరియల్ టీమ్‌తో డేటాను మానిటర్ చేస్తున్నామని చెప్పింది. ANI బీజేపీ అనుకూల మీడియా అని పేర్కొనగా, సదరు సంస్థ కోర్టుకెక్కడంతో దీనిపై వివాదం మొదలైంది.

News November 5, 2024

దాడిశెట్టి రాజా ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత

image

AP: ఓ విలేకరి హత్య కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత దాడిశెట్టి రాజా దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. తుని నియోజకవర్గం తొండంగికి చెందిన విలేకరి సత్యనారాయణ 2019 అక్టోబర్‌లో హత్యకు గురయ్యారు. దీనికి సూత్రధారి దాడిశెట్టి రాజా అని మృతుని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. వారి ఫిర్యాదుతో ఆయనపై కేసు నమోదైంది. దీంతో రాజా ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా చుక్కెదురైంది.

News November 5, 2024

STOCK GAMESతో ఆటలొద్దు: సెబీ వార్నింగ్

image

లిస్టెడ్ కంపెనీల స్టాక్ ప్రైసెస్ ఆధారంగా వర్చువల్ ట్రేడింగ్ సర్వీసెస్, పేపర్ ట్రేడింగ్, ఫాంటసీ గేమ్స్ అందించే యాప్స్, వెబ్ అప్లికేషన్ల జోలికి పోవొద్దని సెబీ వార్నింగ్ ఇచ్చింది. అవి చట్టవిరుద్ధమని సూచించింది. తమ వద్ద రిజిస్టరైన అడ్వైజరీలను మాత్రమే ఫాలో అవ్వాలని తెలిపింది. వారి రిజిస్ట్రేషన్ సరైందో కాదో చెక్ చేసుకోవాలంది. స్టాక్ లీగ్స్, స్కీమ్స్, పోటీల జోలికెళ్లి బాధితులుగా మారొద్దని పేర్కొంది.

News November 5, 2024

మస్క్ రాసిన ఫిజిక్స్ నోట్ వైరల్

image

అమెరికా ఎన్నికల్లో ట్రంప్‌కు మద్దతునిస్తూ ప్రచారంలో హోరెత్తించిన కుబేరుడు ఎలాన్ మస్క్ కాలేజీ టైమ్‌లో రాసిన నోట్ బుక్ పేజీలు వైరలవుతున్నాయి. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో ఆయన ఫిజిక్స్ హోమ్‌వర్క్ ఎలా చేశారో చూపుతూ ఓ వ్యక్తి సదరు ఫొటోలను Xలో పంచుకున్నారు. దీనికి మస్క్ స్పందిస్తూ మూమెంట్స్ ఆఫ్ ఇనర్షియా డెరివేషన్‌లోని కొన్ని పేజీలు లేవని రిప్లై ఇవ్వడంతో వాటినీ అతను పంచుకున్నారు.

News November 5, 2024

నిత్య వివాదాల్లో ‘గృహలక్ష్మి’?

image

నటి కస్తూరి నిత్యం వివాదాల్లో మునిగి తేలుతున్నారు. తాజాగా ఓ తమిళ సభలో తెలుగుజాతిపై ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో దుమారం చెలరేగింది. ‘300 ఏళ్ల క్రితం ఓ రాజు వద్ద అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకే తెలుగు వారు తమిళనాడుకు వచ్చారు. తెలుగువారు తమిళుల బానిసలు’ అని ఆమె వ్యాఖ్యానించారు. గతంలో కూడా నయనతారకు లేడీ సూపర్ స్టార్ బిరుదు వద్దని, రజినీకాంత్‌ అమెరికా పర్యటనల మిస్టరీ ఏమిటని అనుచిత వ్యాఖ్యలు చేశారు.

News November 5, 2024

కన్వీనియెన్స్‌తో కష్టం గురూ!

image

అతి సర్వత్ర వర్జయేత్! టెక్నాలజీతో మానవ జీవితం మారిపోయింది. శ్రమ తగ్గింది. కన్వీనియెన్స్ పెరిగింది. మరీ ఎక్కువ కన్వీనియెన్స్ మంచిది కాదంటున్నారు శాస్త్రవేత్తలు. ఇది మన బేసిక్ ఇన్‌స్టింక్ట్స్‌ను మార్చేస్తుందని వార్నింగ్ ఇస్తున్నారు. EX. పిక్నిక్ వెళ్లినప్పుడు పులి ఎదురైతే అక్కడ్నుంచి పారిపోవడం మానవ నైజం. లేదు అదే వెళ్లిపోతుందిలే అని సెల్ఫీ దిగడం లేజీనెస్. కన్వీనియెన్స్‌తో వచ్చే ప్రమాదాలు ఇలాంటివే.

News November 5, 2024

డైరెక్టర్ క్రిష్ మళ్లీ పెళ్లి?

image

డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి మరోసారి పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్‌కు చెందిన ఓ డాక్టర్‌ను ఆయన వివాహం చేసుకుంటారని తెలుస్తోంది. ఆమెకు ఇప్పటికే పెళ్లై భర్తతో విడాకులు తీసుకున్నారని, 11 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నట్లు సమాచారం. కాగా క్రిష్ గతంలో రమ్య అనే వైద్యురాలిని వివాహం చేసుకుని విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన అనుష్క శెట్టితో ‘ఘాటీ’ మూవీ తెరకెక్కిస్తున్నారు.

News November 5, 2024

ఆస్ట్రేలియాలో కోహ్లీని బీస్ట్ మోడ్‌లో చూస్తాం: మాజీ క్రికెటర్

image

రన్ మెషీన్ విరాట్ కోహ్లీ తిరిగి ఫామ్‌లోకి వస్తారని మాజీ క్రికెటర్ ఆర్ శ్రీధర్ ధీమా వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియా టూర్‌లో ఆయన కమ్‌బ్యాక్ ఇస్తారన్నారు. ‘ఆస్ట్రేలియాలో కోహ్లీని బీస్ట్ మోడ్‌లో చూడబోతున్నాం. ఆయనకు ఆస్ట్రేలియా అంటే ఇష్టం. అక్కడి ప్రతికూల పరిస్థితుల్లో అడేందుకు కోహ్లీ ఎంతగానో ఇష్టపడతారు. మీరు ఆస్ట్రేలియాలో విరాట్ కోహ్లీ బెస్ట్‌ను చూడబోతున్నారు’ అని చెప్పి భారీ ఎక్స్‌పెక్టేషన్స్ పెంచారు.

News November 5, 2024

NRIలు ఇకపై UPIలో రోజుకు ₹లక్ష పంపొచ్చు!

image

NRE/NRO ఖాతాలు ఉన్న NRIలు UPI ద్వారా రోజుకు ₹లక్ష వరకూ ట్రాన్స్‌ఫర్ చేసుకునే అవకాశాన్ని NPCI కల్పించింది. ఇందుకోసం యూజర్లు తమ బ్యాంకు అకౌంట్‌కు లింకై ఉన్న ఇంటర్నేషన్ ఫోన్ నంబర్‌తో ఏదైనా యూపీఐ ఎనేబుల్డ్ యాప్‌లో లాగిన్ చేసుకోవాలి. US, కెనడా, UK, UAE, సింగపూర్, AUS వంటి దేశాల్లో ఉన్న వారికి ఇది అందుబాటులో ఉంది. HDFC, ICICI, IDFC, AXIS, DBS వంటి బ్యాంకుల్లో ఖాతాలున్న వారు ఈ సేవలను వాడుకోవచ్చు.

News November 5, 2024

‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ సీన్ రిపీట్

image

తమిళనాడులోని మింజూర్ రైల్వేస్టేషన్లో ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ మూవీ సీన్ రిపీటైంది. నెల్లూరుకు చెందిన తండ్రీ కూతురు.. సుబ్రహ్మణ్యం, దివ్యశ్రీ ఓ మహిళను చంపి సూట్‌కేసులో కుక్కి రైల్వేస్టేషన్‌లో విసిరేశారు. దీనిని ఓ కానిస్టేబుల్ గుర్తించారు. నిందితులు పోలీసుల అదుపులో ఉన్నారు. కాగా ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ మూవీలో కూడా ఇలాగే కొంతమందిని హత్య చేసి సూట్‌కేసుల్లో కుక్కి పట్టాల పక్కన పడేసేవారు.