India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

సినీ ఇండస్ట్రీపై బోల్డ్‌గా మాట్లాడే హీరోయిన్ తాప్సీ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఒక సినిమాలో అప్పటికే పెద్ద హీరో ఉన్నాడంటే ఎక్కువ డబ్బు పెట్టి హీరోయిన్‌ను తీసుకోరని చెప్పారు. పైగా ఎవర్ని తీసుకోవాలనేది కూడా హీరోలే డిసైడ్ చేస్తారని అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు సక్సెస్‌ఫుల్ డైరెక్టర్లు మాత్రమే హీరో మాటను కాదని కథకు తగ్గట్లు హీరోయిన్లను ఎంపిక చేసుకుంటారని ఓ ఇంటర్వ్యూలో తాప్సీ చెప్పారు.

పాక్‌లోని లాహోర్‌లో ఎయిర్ క్వాలిటీ దారుణంగా పడిపోయింది. అక్కడ AQI రికార్డ్ స్థాయిలో 1900 దాటింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అధికారులు స్థానిక స్కూళ్లకు వారం సెలవులు ప్రకటించారు. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇచ్చారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని, తప్పనిసరిగా మాస్కులు ధరించాలని హెచ్చరించారు. మనదేశంలో AQI అత్యధికంగా ఢిల్లీలో 300పైన నమోదవుతుంటుంది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు యూపీఐ లావాదేవీలకు ఈ నెల 5, 23 తేదీల్లో అంతరాయం కలగనుంది. 5వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుంచి 2 గంటల వరకు, 23వ తేదీ 12 గంటల నుంచి 3గంటల వరకు సిస్టమ్స్ నిర్వహణ కారణంగా యూపీఐ చెల్లింపులు చేయలేరని ఆ బ్యాంకు తెలిపింది. అలాగే దుకాణదారులు సైతం యూపీఐ సేవలు పొందలేరని పేర్కొంది.

మెక్సికోలోని యుకాటన్ ద్వీపకల్పంలో వందల ఏళ్ల పాటు కనిపించకుండా పోయిన మాయా నాగరికతకు చెందిన నగరాన్ని సైంటిస్టులు గుర్తించారు. దీనికి వలేరియానా అని పేరు పెట్టారు. రాజధాని తరహాలో ఉన్న ఈ సిటీలో 6,674 రకాల కట్టడాలను గుర్తించారు. పిరమిడ్లు, కాజ్‌వేలు, డ్యామ్‌లు, బాల్ కోర్ట్, కొండలపై ఇళ్లు ఉన్నాయి. 50 వేల మంది నివసించి ఉండొచ్చని అంటున్నారు. లిడార్ అనే లేసర్ సర్వే ద్వారా దీనిని వెలుగులోకి తీసుకొచ్చారు.

అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప-2’ కోసం దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ మూవీ ట్రైలర్‌ను నవంబర్ మధ్యలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ట్రైలర్‌కు సంబంధించి డబ్బింగ్ పనులు దాదాపుగా పూర్తయినట్లు సమాచారం. పుష్ప-2 డిసెంబర్ 5న థియేటర్లలోకి రానున్న సంగతి తెలిసిందే.

* 1888: పారిశ్రామికవేత్త, స్వాతంత్ర్య సమరయోధుడు జమ్నాలాల్ బజాజ్ జననం
* 1929: ప్రపంచ గణిత, ఖగోళ, జ్యోతిష శాస్త్రవేత్త శకుంతలా దేవి జననం
* 1944: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో తొలి మహిళా ఎయిర్ మార్షల్ పద్మావతి బందోపాధ్యాయ పుట్టినరోజు
* 1964: దర్శకుడు, నిర్మాత జొన్నలగడ్డ శ్రీనివాస రావు పుట్టినరోజు
* 1971: సినీనటి టబు పుట్టినరోజు(ఫొటోలో)

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

NZతో టెస్ట్ సిరీస్‌లో ప్రాక్టీస్ లభించని ఆటగాళ్లను ఇండియా-A తరఫున ఆడించాలని BCCI నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో భాగంగా KL రాహుల్, ధృవ్ జురెల్‌ను రేపు ఆస్ట్రేలియాకు పంపనున్నట్లు క్రీడా వర్గాలు తెలిపాయి. AUS-A, IND-A మధ్య జరిగే మ్యాచుల్లో వీరు ఆడనున్నట్లు పేర్కొన్నాయి. రాహుల్‌కు NZ సిరీస్‌లో తొలి టెస్ట్ మాత్రమే ఆడే అవకాశం రాగా, జురెల్ వికెట్ కీపింగ్ మాత్రమే చేసిన సంగతి తెలిసిందే.

ఇంట్లో చేతికి దొరికిన బ్యాటరీలు, చైన్‌లు మింగేయడంతో UPలోని హథ్రాస్‌కు చెందిన 14 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ఆదిత్య గత కొన్ని రోజులుగా శ్వాస, ఉదర సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. అల్ట్రాసౌండ్ చేయగా కడుపులో 65 వస్తువులను గుర్తించారు. ఢిల్లీ సఫ్దార్‌జంగ్ ఆస్పత్రి వైద్యులు వీటిని తొలగించిన కొన్ని గంటలకే బాలుడు మృతి చెందాడు. ఇంట్లో పిల్లలు వస్తువుల్ని మింగకుండా జాగ్రత్తలు తీసుకోండి. SHARE IT.

✒ తేది: నవంబర్ 4, సోమవారం
✒ తదియ: రాత్రి 11.24 గంటలకు
✒ అనూరాధ ఉ.8.03 గంటలకు
✒ వర్జ్యం: మ. 2.03-3.46 గంటల వరకు
✒ దుర్ముహూర్తం: ఉ.12.13-12.59 గంటల వరకు
✒ తిరిగి మ.2.31-3.17 గంటల వరకు
Sorry, no posts matched your criteria.