India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP అసెంబ్లీ సమావేశాలకు వెళ్లబోమన్న YCP నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 11 సీట్లే గెలవడాన్ని అవమానంగా భావించి దూరంగా ఉండడం సరికాదని ప్రజాస్వామ్యవాదులు చెబుతున్నారు. ప్రజలు ఏ పదవిలో కూర్చోబెట్టినా దానికి న్యాయం చేయాలంటున్నారు. అయితే ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకపోవడంతో ఇక సభలో ఎదురయ్యే అవమానాల దృష్ట్యా ఆత్మగౌరవం దెబ్బతినొద్దనే ఇలా చేస్తున్నట్లు YCP శ్రేణులు చెబుతున్నాయి. మీరేమంటారు?

50వ CJIగా జస్టిస్ DY చంద్రచూడ్ రెండేళ్ల పదవీకాలంలో ఎన్నో కీలక తీర్పులిచ్చారు. *అయోధ్య రామ మందిరం కేసులో తీర్పు ఇచ్చిన న్యాయమూర్తుల్లో ఒకరు *JKలో ఆర్టికల్ 370 రద్దు సమర్థన *వ్యక్తిగత గోప్యత అనేది ప్రాథమిక హక్కు *శబరిమల ఆలయంలో మహిళలకు ఎంట్రీ *ఏకాభిప్రాయ స్వలింగ సంపర్కానికి చట్టబద్ధత *వివాహంలో భార్యకు లైంగిక హక్కు ఉందని, బలవంతపు సంబంధాన్ని నేరంగా పరిగణిస్తూ తీర్పు ఇచ్చారు.

తన పదవీకాలంలో అనుకోకుండా ఎవరినైనా బాధపెట్టుంటే క్షమించాలని సుప్రీంకోర్టు CJI జస్టిస్ DY చంద్రచూడ్ కోరారు. శుక్రవారం ఆయన సీజేఐగా పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా సహచర న్యాయమూర్తులు, న్యాయవాదులు ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. తదుపరి CJIగా జస్టిస్ సంజీవ్ ఖన్నా లాంటి సమర్థులు బాధ్యతలు చేపట్టబోతున్నందున తాను ఈ కోర్టును వదిలివెళ్లినా తేడా ఉండబోదన్నారు.

ప్రభుత్వ పథకాల నుంచి బ్యాంకు ఖాతా తెరవడం వరకు ఆధార్ కార్డు కీలకం. అయితే ఎంతో మంది పదేళ్లు దాటినా వాటిని అప్‌డేట్ చేసుకోవడం లేదు. చిరునామా, ఫొటోలను అప్‌డేట్ చేయడం వల్ల మోసాలను నిరోధించవచ్చు. ఈ నేపథ్యంలో పదేళ్లు దాటిన ఆధార్‌లో సమాచారాన్ని ఫ్రీగా అప్‌డేట్ చేసుకునేందుకు DEC 14 వరకు కేంద్రం గడువునిచ్చింది. ఇదే చివరి గడువు కావొచ్చని ప్రచారం సాగుతోంది. MyAadhaar పోర్టల్‌లో లాగిన్ అయి అప్‌డేట్ చేసుకోండి.

ఆత్మరక్షణ కోసం ఆ గ్రామాల ప్రజలు తుపాకీ చేతపట్టారు. 1990లో JKలోని దేశ సరిహద్దు గ్రామాల్లోని స్థానికులు, హిందువులు, దుర్భర పరిస్థితుల్లో ఉన్న ముస్లింలు తీవ్రవాదం నుంచి రక్షణ పొందేందుకు విలేజ్ డిఫెన్స్ గార్డుల వ్యవస్థ ఏర్పాటైంది. VDGలు స్థానిక పోలీసులు, బలగాలతో కలిసి పనిచేస్తారు. పాక్ సరిహద్దుల నుంచి చొరబడే ఉగ్రవాదులను ఎదుర్కోవడానికి వీరికి ప్రత్యేకంగా ఆయుధాల వినియోగం, గూఢచర్యంపై శిక్షణ ఇస్తారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటర్లు విద్యార్హతల ఆధారంగా విడిపోయినట్టు యాక్సియోస్ నివేదిక అంచనా వేసింది. కాలేజీ గ్రాడ్యుయేట్లు అత్యధికంగా ఉన్న రాష్ట్రాలు కమల వైపు నిలిస్తే, డిగ్రీ లేని వారు అత్యధికంగా ఉన్న రాష్ట్రాలు ట్రంప్‌నకు జైకొట్టాయి. మొత్తం గ్రాడ్యుయేట్ ఓటర్లలో 55% మంది కమలకు, గ్రాడ్యుయేషన్ లేనివారిలో 55% మంది ట్రంప్‌నకు ఓటేసినట్టు నివేదిక వెల్లడించింది.

పుష్ప-2 సినిమా విడుదల దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆ మూవీ టీమ్ ప్రమోషన్స్ జోరు పెంచింది. రిలీజ్ ట్రైలర్‌ను లాక్ చేసినట్లు ప్రకటించింది. ‘ఎదురుచూపులు ముగిశాయి. ది రూల్ టేక్స్ ఓవర్. త్వరలో ట్రైలర్ అనౌన్స్‌మెట్’ అని ట్వీట్ చేసింది. వచ్చే నెల 5న పుష్ప: ది రూల్ విడుదల కానున్న సంగతి తెలిసిందే. సుకుమార్ డైరెక్షన్లో అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది.

రంజీల్లో 6000 రన్స్, 400 వికెట్స్ తీసిన తొలి క్రికెటర్‌గా కేరళ ప్లేయర్ జలజ్ సక్సేనా చరిత్ర సృష్టించారు. అయితే దేశవాళీ టోర్నీల్లో అద్భుతంగా రాణిస్తున్నా అతడిని జాతీయ జట్టుకు ఎంపిక చేయట్లేదని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. దీనిపై స్పందించిన మాజీ క్రికెటర్ హర్భజన్ ‘అతడిని ఇండియా-Aకైనా ఎంపిక చేయాల్సింది. రంజీల్లో ఆడటం వృథానేనా? ప్లేయర్లు IPL నుంచే ఎంపికవుతున్నారు’ అని అసంతృప్తి వ్యక్తం చేశారు.

దశాబ్దాల పాటు స్మోకింగ్ చేసి లేటు వయసులో మానేయడం వల్ల ఉపయోగం లేదనే కొందరి వాదన తప్పు అని నిపుణులు చెబుతున్నారు. ఎంత పొగతాగేవారైనా, ఏ వయసులోనైనా దాన్ని వదిలేస్తే ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవచ్చంటున్నారు. ‘1-2ఏళ్లు మానేస్తే గుండె వ్యాధులు, 5-10ఏళ్ల తర్వాత క్యాన్సర్ ముప్పు సగానికి తగ్గుతుంది. రోగనిరోధక వ్యవస్థ, ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది. శ్వాసకోశ వ్యాధులు దూరమవుతాయి’ అని పేర్కొంటున్నారు.

AP: తిరుమలను <<14559672>>కేంద్ర పాలిత ప్రాంతం<<>> చేయాలంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు KA పాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. దీనిపై KA పాల్ స్పందించారు. ‘తిరుమల వ్యవహారంపై నా పోరాటం ఆపను. మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తా. తిరుమలలో గొడవలు ఆగాలంటే కేంద్రం పాలిత ప్రాంతం చేయాల్సిందే. నా పిటిషన్‌ను విచారించిన ధర్మాసనానికి కృతజ్ఞతలు’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Sorry, no posts matched your criteria.