India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: జనం గెలవాలంటే.. సీఎం జగన్ గద్దె దిగిపోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ‘రాష్ట్రంలో టీడీపీ పెట్టిన పథకాలన్నీ జగన్ తీసేశారు. ప్రజల బతుకుల్లో చీకట్లు నింపారు. ప్రాజెక్టులు కట్టకుండా రాయలసీమకు తీరని ద్రోహం చేశారు. పొలాలకు నీళ్లు ఇవ్వకుండా రైతులను ముంచేశారు. వైసీపీ పాలనలో మహిళలకు రక్షణ కరువైంది. అందుకే వైసీపీని గద్దె దించి.. కూటమిని ఆశీర్వదించండి’ అని ఆయన పేర్కొన్నారు.
బాంబే స్టాక్ ఎక్స్‌ఛేంజ్ ప్రతిపాదించిన టీ+0 సెటిల్‌మెంట్ సైకిల్ రేపటి నుంచి అమలులోకి రానుంది. 25 స్టాక్స్‌కు ఈ సదుపాయాన్ని కల్పించనుంది. ఇందులో అంబుజా సిమెంట్స్, బజాజ్ ఆటో, BPCL మొదలైన బడా స్టాక్స్ ఉన్నాయి. ఈ టీ+0లో లావాదేవీలు చేసిన రోజే సంబంధిత ఖాతాలకు క్యాష్/షేర్లు చేరతాయి. కాగా ప్రస్తుతం టీ+1 సైకిల్ అమలులో ఉంది. ఇందులో లావాదేవీలు చేసిన మరుసటి రోజు సంబంధిత అకౌంట్లకు క్యాష్/షేర్లు బదిలీ అవుతాయి.
AP: జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను పలువురు టీడీపీ, బీజేపీ నేతలు కలిశారు. ఇవాళ మంగళగిరిలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి ఆయనతో భేటీ అయ్యారు. వీరి వెంట ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షుడు షేక్ రియాజ్ కూడా ఉన్నారు. అలాగే తిరుపతి బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ కూడా పవన్‌ను కలిశారు. ఎన్నికల్లో తమకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని వీరు కోరినట్లు తెలుస్తోంది.
కేరళ సీఎం పినరయి విజయన్ కుమార్తె వీణపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. అక్రమ చెల్లింపులకు సంబంధించి వీణ సహా మరికొందరిపై ఈ కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. కాగా 2017-2020 మధ్య కొచ్చిన్ మినరల్స్ & రుటైల్ లిమిటెడ్ సంస్థ వీణకు రూ.1.72కోట్లు చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ డీల్‌లో CPI(M) సహా కాంగ్రెస్ ఆధ్వర్యంలోని UDF పక్షం నేతలు కూడా ఉన్నట్లు సమాచారం.
భారత్‌లోని నిరుద్యోగానికి సంబంధించి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్(ILO) షాకింగ్ విషయాలు వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.. దేశంలోని నిరుద్యోగుల్లో 83% యువతే ఉంది. టెన్త్ చదివిన నిరుద్యోగుల సంఖ్య భారీగా పెరిగింది. 2000లో 35.2%గా ఉండగా.. 2022లో 65.7%కి చేరింది. అంటే 12ఏళ్లలో నిరుద్యోగితశాతం రెట్టింపు అయ్యింది. SSC తర్వాత ఇక డ్రాపౌట్స్ రేటు కూడా భారీగా ఉంది. మరోవైపు యువతలో నిరుద్యోగం పెరుగుతోంది.
CUET(UG)-2024 ప్రవేశ పరీక్షకు దరఖాస్తుల గడువును నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) పొడిగించింది. నిన్నటితో గడువు ముగియగా ఈ నెల 31 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొంది. తప్పుల సవరణకు ఏప్రిల్ 3 వరకు అవకాశం కల్పించింది. మే 15 నుంచి 31 మధ్యలో పరీక్షలు నిర్వహించనుంది. పూర్తి వివరాలకు https://exams.nta.ac.in/CUET-UG/ వెబ్‌సైట్‌ను సంప్రదించండి.
AP: టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేశ్‌కు దమ్ముంటే తనపై గుడివాడలో పోటీ చేయాలని మాజీ మంత్రి కొడాలి నాని సవాల్ విసిరారు. ‘నాకు భయపడి గంటకో వ్యక్తిని పోటీకి దింపుతున్నారు. ఇప్పుడు అమెరికా నుంచి వచ్చిన వ్యక్తిని పోటీకి పెట్టారు. ఈసారి అంతరిక్షం నుంచి తీసుకొస్తారేమో? చంద్రబాబు తలకిందులుగా తపస్సు చేసినా నన్ను ఓడించలేరు. ఎంతమంది వచ్చినా గుడివాడలో ఐదోసారి గెలవబోతున్నా’ అని ఆయన తెలిపారు.
TG: నారాయణపేట జిల్లా గోపాల్‌పేటలో హృదయవిదారక ఘటన జరిగింది. స్థానికుడు రమేశ్ కూతురు లక్ష్మీప్రణీత(13) హోలీరోజు మినీ వాటర్ ట్యాంకు కూలి మరణించింది. అంత్యక్రియల అనంతరం ఇంటికి వచ్చిన రమేశ్ స్నానం చేసి బయటికి వెళ్లాడు. రాత్రయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు వెతుక్కుంటూ వెళ్లారు. రమేశ్ తన కూతురిని పూడ్చిపెట్టిన స్థలం పక్కనే నిద్రిస్తూ కనిపించాడు. ఈ ఘటన చూసి అక్కడున్నవాళ్లు కన్నీళ్లు పెట్టుకున్నారు.
TG: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఏప్రిల్ 13న చేవెళ్లలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగే ఈ సభకు పెద్ద సంఖ్యలో ప్రజలను తరలించి విజయవంతం చేయాలని ఆయన పార్టీ నేతలను ఆదేశించారు. కాగా చేవెళ్ల బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్‌లో చేరడంతో ఆ పార్టీ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ బరిలో నిలిచారు.
TG: హైదరాబాద్ మెట్రో రైళ్లు కాసేపు నిలిచిపోయాయి. సాంకేతిక లోపంతో జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ మెట్రో స్టేషన్లో ఆగాయి. దీంతో 15 నిమిషాల పాటు ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. సమాచారం అందుకొని రంగంలోకి దిగిన టెక్నికల్ సిబ్బంది సమస్యను పరిష్కరించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.