India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఢిల్లీలో ఓ ఫొటో జర్నలిస్టుపై ఒక పోలీస్ అధికారి అనుచితంగా ప్రవర్తించారు. సీఎం కేజ్రీవాల్ అరెస్టును నిరసిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఢిల్లీలోని పటేల్ చౌక్ వద్ద ధర్నా చేపట్టారు. ఆ కార్యక్రమాన్ని కవర్ చేస్తున్న ఓ ఫొటో జర్నలిస్టును ఒక పోలీస్ అధికారి గొంతు పట్టుకొని వెనక్కి నెట్టారు. దీనికి సంబంధించిన ఫొటో జర్నలిస్టు వర్గాల్లో వైరల్ అవుతోంది.
కోవిడ్ సోకి తగ్గినా వారి మెదడుపై ఆ వైరస్ ప్రభావం చూపిస్తున్నట్లు సైంటిస్టులు చెబుతున్నారు. ముఖ్యంగా SARS-CoV-2 బాధితుల్లో IQ పవర్, జ్ఞాపకశక్తి తగ్గిపోవడంతో పాటు వారి మెదడు కూడా ఏడేళ్ల వృద్ధాప్యం పొందినట్లు ఇంగ్లండ్ సైంటిస్టులు చేసిన పరిశోధనల్లో తేలింది. వారి మెదడు సైజు, ఆకారంలోనూ మార్పులు వస్తున్నాయన్నారు. బాధితుల మానసిక ఆరోగ్యంపై ‘కోవిడ్’ ఎప్పటికి ‘చెరగని గుర్తు’గా వాళ్లు అభివర్ణిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇటీవల డీఏ పెంచగా.. ఎరియర్స్ జమ కావడంపై స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. కొత్త డీఏ కలపడంతో పెరిగిన జీతాలు, HRA, రెండు నెలల ఎరియర్స్ మార్చి 30వ తేదీన జమ కానున్నట్లు సమాచారం. కాగా 4శాతం డీఏ పెంపుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మొత్తం డీఏ 50శాతానికి పెరిగింది. దీని ద్వారా 48.67 లక్షల మంది ఉద్యోగులు, 68 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది.
కెనడాకు చెందిన టెలికాం దిగ్గజం బెల్ 10 నిమిషాల వీడియో కాల్ మీటింగ్స్ నిర్వహించి 400 మందికిపైగా ఉద్యోగులను తొలగించింది. 4,800 ఉద్యోగాలను తొలగిస్తున్నట్లు గతనెల ప్రకటించిన నేపథ్యంలో ఈ కోత విధించడం గమనార్హం. కాగా ఈ చర్యను అక్కడి ప్రైవేట్ సెక్టార్ యూనియన్ యూనిఫర్ ఖండించింది. ముందస్తు సమాచారం లేకుండా కోత విధించడాన్ని తప్పుపట్టింది. అయితే ఉద్యోగులకు ముందే సమాచారం ఇచ్చినట్టు బెల్ పేర్కొంటోంది.
బెంగళూరు నగరం నీటి ఎద్దడికి విలవిలలాడుతున్న నేపథ్యంలో ఈ పరిస్థితిని క్యాష్ చేసుకునే దిశగా కేరళ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తమ రాష్ట్రంలో ఆఫీసులు ఏర్పాటు చేసుకోమని బెంగళూరులోని పలు ఐటీ కంపెనీలను ఆహ్వానించింది. కేరళలో 44 నదులు ఉన్నాయని కాబట్టీ నీటి కొరతకు అవకాశమే లేదని ఆ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి రాజీవ్ పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం బెంగళూరులో 500 మిలియన్ లీటర్ల నీటి కొరత ఏర్పడింది.
గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓటమి ఎదుర్కొన్న ముంబై ఇండియన్స్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌కు కూడా ఆ జట్టు విధ్వంసకర ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ దూరమయ్యారు. ఆయనకు ఇంకా NCA నుంచి NOC లభించలేదు. దీంతో ఈ మ్యాచ్‌కు కూడా సూర్య అందుబాటులో ఉండడం లేదు. కాగా ఇటీవలే SKY పలు సర్జరీలు చేయించుకున్నారు. అనంతరం NCAలో పునరావాసం పొందుతున్నారు. NCA అనుమతిస్తేనే సూర్య IPLలో ఆడతారు.
ఇండియా 2047లో అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందా? అనే ప్రశ్నపై RBI మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ స్పందించారు. దాని గురించి ఇప్పుడే మాట్లాడటం ‘నాన్‌సెన్స్’ అన్నారు. దేశంలో ఎన్నో సమస్యలను పరిష్కరించాల్సి ఉందని సూచించారు. కొందరు సృష్టిస్తున్న హైప్‌ను అందరూ నమ్మడమే దేశం చేస్తున్న పెద్ద తప్పు అని ఆయన అభిప్రాయపడ్డారు. దేశంలో చాలామంది పిల్లలకు చదువు అందడం లేదని, డ్రాపౌట్స్ పెరుగుతున్నాయని ఆయన అన్నారు.
TG: రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం హీటెక్కిస్తుండగా.. తన ఫోన్ కూడా గతంలో ట్యాప్ చేశారని మహబూబ్‌నగర్ MLA శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ‘దీనిపై DGPకి ఫిర్యాదు చేశా. గత ప్రభుత్వం ప్రశ్నించే వందల మంది ఫోన్లు ట్యాప్ చేసింది. మా కాల్ రికార్డులను గత ప్రభుత్వ పెద్దలకు పంపారు. ప్రతి ట్యాపింగ్ ఫిర్యాదుపై లోతుగా విచారించాలి. గత ప్రభుత్వ మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ వ్యవహారంలో ఉన్నారు’ అని ఆరోపించారు.
గ్లోబల్‌గా మూడేళ్లలో 30 మోడళ్లను (16 ఈవీ, 14 ఇంటర్నేషనల్ కంబషన్ ఇంజిన్) లాంచ్ చేయనున్నట్లు నిస్సాన్ ప్రకటించింది. వచ్చే ఏడాదిలోపు భారత్‌లో మూడు మోడల్స్ లాంచ్ చేస్తామని వెల్లడించింది. ఎగుమతుల్లో లక్ష యూనిట్ల మార్క్ అందుకుని భారత్‌ను ఎక్స్‌పోర్ట్ హబ్‌గా నిలుపుతామని పేర్కొంది. ఇక ఈ ఏడాది మొదలుకుని 2030 నాటికి 34 ఈవీలను లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలిపింది.
‘సందేశ్‌ఖాలీ’ బాధితురాలు, బీజేపీ ఎంపీ అభ్యర్థి రేఖా పాత్రతో ప్రధాని మోదీ మాట్లాడారు. ‘మీరు కచ్చితంగా ఎన్నికల్లో గెలుస్తారు. సందేశ్‌ఖాలీలో మీరెంతో గొప్ప పోరాటం చేశారు. ఎంతో మంది శక్తిమంతులను జైలుకు పంపించారు’ అని ప్రధాని కొనియాడారు. ఆమెను ‘శక్తి స్వరూపిణి’గా మోదీ అభివర్ణించారు. కాగా.. బసిరాత్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి రేఖా పోటీ చేయనున్నారు.
Sorry, no posts matched your criteria.