India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: హైడ్రా గురించి కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని కమిషనర్ రంగనాథ్ మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతి కూల్చివేతను హైడ్రాకు ఆపాదిస్తున్నారని అన్నారు. ‘మూసీ పరివాహక ప్రాంతంలో రేపు భారీ కూల్చివేతలకు హైడ్రా సిద్ధమైనట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మూసీకి సంబంధించి ఏ సర్వేలోనూ హైడ్రా భాగం కాలేదు. అక్కడ మేం ఎవరికీ నోటీసులు ఇవ్వలేదు. కూకట్‌పల్లిలో మహిళ ఆత్మహత్యకు హైడ్రాకు సంబంధం లేదు’ అని తెలిపారు.

✒ తేది: సెప్టెంబర్ 28, శనివారం
✒ ఫజర్: తెల్లవారుజామున 4:54 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6:06 గంటలకు
✒ జొహర్: మధ్యాహ్నం 12:07 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4:27 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 6:07 గంటలకు
✒ ఇష: రాత్రి 7.19 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

TG: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు ముగిశాయి. జూబ్లిహిల్స్, బంజారాహిల్స్‌తో పాలు పొంగులేటికి చెందిన పలు ఆఫీసుల్లోనూ ఈడీ సోదాలు చేసింది. క్రిప్టో, హవాలా ద్వారా లగ్జరీ వాచ్‌లు కొనగోలు చేసినట్లు గుర్తించిన ఈడీ ఈ మేరకు తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. గతంలోనూ ఇదే కేసులో పొంగులేటి నివాసంలో చెన్నై కస్టమ్స్ అధికారులు సోదాలు చేశారు.

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి

పాకిస్థాన్ అంపైర్ అలీమ్ దార్ అంపైరింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. పాక్‌లో ప్రస్తుత దేశవాళీ సీజన్ ముగిసిన అనంతరం తప్పుకొంటానని పేర్కొన్నారు. ఆయన దాదాపు 25 ఏళ్ల పాటు అంపైర్‌గా చేశారు. 2009-11 మధ్యకాలంలో మూడుసార్లు అంపైర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం అందుకున్నారు. మొత్తం 145 టెస్టులు, 231 ODIలు, 72 టీ20లు, 5 టీ20 కప్‌లు, 181 ఫస్ట్ క్లాస్ మ్యాచులు, 282 లిస్ట్-ఏ మ్యాచుల్లో దార్ అంపైర్‌గా నిల్చున్నారు.

✒ తేది: సెప్టెంబర్ 28, శనివారం
✒ఏకాదశి: మధ్యాహ్నం 02.50 గంటలకు
✒ అశ్లేష: రాత్రి 03.37 గంటలకు
✒ వర్జ్యం: మధ్యాహ్నం 03.21- 05.06 గంటల వరకు
✒ దుర్ముహూర్తం: ఉదయం 05.58 నుంచి 06.46 గంటల వరకు

* AP: అన్యమతస్థులు డిక్లరేషన్ ఇవ్వాల్సిందే: CBN
* జగన్ చట్టాన్ని ఉల్లంఘించారు: చంద్రబాబు
* నా మతం మానవత్వం.. డిక్లరేషన్‌లో రాసుకోండి: జగన్
* వైసీపీ పాలనలో అవినీతి పెరిగింది: పురందీశ్వరి
* TG: ఐదేళ్లలో మహిళలకు రూ.లక్ష కోట్లు ఖర్చు చేస్తాం: మంత్రి సీతక్క
* రేషన్ కార్డు లేకున్నా ఇందిరమ్మ ఇల్లు: మంత్రి పొంగులేటి
* ఎనుముల రేవంత్ ఎగవేతల రేవంత్‌గా మారారు: హరీశ్

ఎవరి పని వాళ్లను చేసుకోనిస్తే రిజల్ట్ ‘దేవర’లా ఉంటుందని తాను అన్న మాటకు విపరీతార్థాలు తీయొద్దని రామజోగయ్య శాస్త్రి ఫ్యాన్స్‌కు విజ్ఞప్తి చేశారు. ‘ఓరి నాయనో. ఇది ఎటో దారితీస్తున్నట్లుంది. నా ఉద్దేశం శివ తన టెక్నీషియన్స్‌కి స్వేచ్ఛనిస్తారనే తప్ప మరొకటి కాదు. విపరీతార్థాలు తీయవద్దని మనవి’ అని ట్వీట్ చేశారు. ఎవరి పని వాళ్లను చేసుకోనివ్వాలంటూ కొరటాల శివ ఓ ఇంటర్వ్యూలో అన్న సంగతి తెలిసిందే.

ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ‘దేవర’. ఇవాళ థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద సక్సెస్‌ఫుల్ టాక్‌తో దూసుకెళ్తోంది. కాగా ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్(OTT)లో రానున్నట్లు తెలుస్తోంది. థియేటర్లలో రిలీజైన 50 రోజులకు ఓటీటీలోకి వచ్చేలా ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం.

TG: ఎస్సీ వర్గీకరణపై ఉత్తమ్ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సబ్ కమిటీ భేటీలో కీలక నిర్ణయం తీసుకున్నారు. వర్గీకరణపై ఈ నెల 30వ తేదీ నుంచి సంఘాలు, వ్యక్తుల అభిప్రాయాలు సేకరించనున్నారు. HYD మాసబ్‌ట్యాంక్ కార్యాలయంలో అభిప్రాయాలు తెలియజేయాలని ఎస్సీ అభివృద్ధి శాఖ తెలిపింది. commr.scsubclassification@gmail.comకు కూడా అభిప్రాయాలు పంపవచ్చని సూచించింది.
Sorry, no posts matched your criteria.