India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

‘దేవర’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందని నిర్మాత, హీరో కళ్యాణ్ రామ్ అన్నారు. ఎన్టీఆర్ నటనను వర్ణించేందుకు మాటలు రావట్లేదని చెప్పారు. దేవర మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో ఆయన మాట్లాడారు. డే-1 టాప్-2 గ్రాసర్‌గా దేవర నిలిచే అవకాశముందని దిల్ రాజు చెప్పారు. ఈ చిత్రం ఇంత పెద్ద సక్సెస్‌కు ఎన్టీఆర్ కారణమన్నారు. తెలుగు సినిమాకు విదేశాల నుంచి వస్తున్న స్పందన అద్భుతమని పేర్కొన్నారు.

ఎంత సంపాదించినా అందులో సగం ఇంటి రెంట్‌కే పోతోందని చాలా మంది ఆవేదన చెందుతుంటారు. అంతలా పెరిగిపోయాయ్ మరి అద్దె ధరలు. ఈ నేపథ్యంలో ముంబైలోని పాలి హిల్‌లో 2BHK ఫ్లాట్‌లో ఉండాలంటే రూ.1.35 లక్షలు చెల్లించాలనే ఓ ప్రకటన వైరలవుతోంది. బాత్రూమ్‌లో టాయిలెట్ సింకు పైనే వాషింగ్ మెషీన్ అమర్చడం, రూ.4 లక్షలు అడ్వాన్స్ చెల్లించాలని చెప్పారు. ఆ డబ్బులతో కొత్త ఫ్లాట్ కొనుక్కోవచ్చంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

అసిస్టెంట్ డాన్సర్‌పై అత్యాచార కేసులో అరెస్టైన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పోలీసుల విచారణలో కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. యువతి చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని, మైనర్‌గా ఉన్న సమయంలో వేధింపులకు గురి చేశాననడమూ అవాస్తవమని పేర్కొన్నట్లు సమాచారం. యువతి తీరుతో తానే బాధపడ్డానని, పెళ్లి చేసుకోమని వేధించిందని, తనపై కావాలనే కుట్ర చేశారని జానీ తెలిపినట్లు పలు కథనాలు పేర్కొన్నాయి.

TG: ఓ ప్రైవేట్ కాలేజీలో ఎంబీఏ చదువుతున్న తన కుమారుడు వైష్ణవ్‌ను సీనియర్లు ర్యాగింగ్ చేస్తున్నారంటూ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్యామ్ బస్ అనే సీనియర్ తన కొడుకుతో గొడవపడి చెవి కొరికేశాడని పేర్కొన్నారు. దీంతో కేసు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

TG: అమీన్‌పూర్‌లో ఓ బిల్డింగ్ కూల్చివేతపై హైడ్రాకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కోర్టులో పెండింగ్‌లో ఉన్న భవనాన్ని ఎలా కూలుస్తారని కమిషనర్ రంగనాథ్‌ను ప్రశ్నించింది. ఈ నెల 30న ఉదయం 10:30 గంటలకు వర్చువల్‌గా లేదా వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.

కేరళలోని త్రిసూర్‌లో 3 ATMలను లూటీ చేసి ₹60 లక్షలతో ఉడాయిస్తున్న హరియాణా ముఠాను తమిళనాడు పోలీసులు పట్టుకున్నారు. ఒక ట్రక్కులో TNలోకి ప్రవేశించిన ఈ ఏడుగురు సభ్యుల మూఠాను నమక్కల్ పోలీసులు 12KM ఛేజింగ్ చేశారు. వారు పోలీసులపై దాడి చేసి ఇద్దర్ని గాయపర్చారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో ముఠా సభ్యుడొకరు మృతి చెందగా మరొకరు గాయపడ్డారు. ట్రక్కు, అందులోని కారు, నగదును స్వాధీనం చేసుకున్నారు.

సినిమాల కలెక్షన్లలో రికార్డులు సృష్టించే బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్‌కు వ్యక్తిగత జీవితంలో ఓ రికార్డుంది. ఆయనకు ఏకంగా 5 గౌరవ డాక్టరేట్లు దక్కాయి. 2009లో బెడ్‌ఫోర్డ్‌షైర్ యూనివర్సిటీ(యూకే), 2015లో యూనివర్సిటీ ఆఫ్ ఎడింబరో(యూకే), 2016లో మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ(Hyd), 2019లో యూనివర్సిటీ ఆఫ్ లా(లండన్), ఈ ఏడాది లా ట్రోబ్ యూనివర్సిటీ(ఆస్ట్రేలియా) SRKకి డాక్టరేట్లు ప్రదానం చేశాయి.

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మరోసారి పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి రేటు రూ.430 పెరిగి రూ.77,450కి చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.400 పెరిగి రూ.71,000 పలుకుతోంది. ఇక వెండి రేటు కేజీ రూ.1,000 పెరిగి రూ.1,02,000కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

ఇండియా- బంగ్లాదేశ్ రెండో టెస్టును చూసేందుకు వచ్చిన ప్రేక్షకులను కోతుల నుంచి రక్షించేందుకు గ్రీన్ పార్క్ స్టేడియం నిర్వాహకులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు. కోతులు ప్రేక్షకుల మొబైల్స్, ఆహారం, ఇతర వస్తువులను దొంగిలిస్తుండేవి. ఈ క్రమంలో కోతులను తరిమేలా కొండముచ్చులను బరిలోకి దింపేందుకు ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (UPCA) పర్మిషన్ ఇచ్చింది. ప్రస్తుతం స్టేడియంలో కొండముచ్చులు భద్రతనిస్తున్నాయి.

AP: తిరుమల లడ్డూ, హిందూ మతంపై చర్చల వేళ హీరోయిన్ పూనమ్ కౌర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘హిందూయిజాన్ని స్వలాభం కోసం వాడుకోవడం, హిందూ మతాన్ని నమ్మే వ్యక్తిగా ఉండటం వేరు’ అని రాసుకొచ్చారు. దీంతో ఆమె ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ చేశారనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది.
Sorry, no posts matched your criteria.