News September 26, 2024

రేపు ఏం జరగబోతోంది..

image

AP: జగన్ రేపు, ఎల్లుండి తిరుమలలో పర్యటించనున్నారు. రేపు సా.4 గం.కు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరి రేణిగుంట చేరుకుంటారు. రాత్రి 7 గం.కు తిరుమల చేరుకుని అక్కడే బస చేస్తారు. శనివారం ఉ.10.30 గం.కు శ్రీవారిని దర్శించుకుంటారు. అయితే జగన్ డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సిందేనని కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో తిరుమలలో ఏం జరగబోతోందనే టెన్షన్ నెలకొంది.

News September 26, 2024

‘దేవర’ క్రేజ్ మామూలుగా లేదుగా.. ఒక్క టికెట్ రూ.2వేలు!

image

ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘దేవర’ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అనేక చోట్ల రాత్రి ఒంటి గంటకే షోలు ప్రదర్శించనున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో టికెట్ ధర రూ.2వేలు పలుకుతున్నట్లు పలువురు సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు. ఈ షోలకు ఎక్కువగా అభిమానులే వెళ్లే అవకాశం ఉండటంతో క్యాష్ చేసుకుంటున్నారని చర్చ జరుగుతోంది.

News September 26, 2024

రామాయణం పాఠ్యపుస్తకాల్లో ఉండాలి: వెంకయ్య నాయుడు

image

AP: రామాయణ స్ఫూర్తిని భావితరాలకు అందించడం సంతోషంగా ఉందని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. విజయనగరంలో వాల్మీకి రీసెర్చ్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. ఈ కేంద్రాన్ని జాతికి అంకితం చేయాల్సిన అవసరముందని చెప్పారు. పాఠ్యపుస్తకాల్లో రామాయణం ఉండాల్సిన అవసరం ఉందన్నారు. మరోవైపు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం కొందరు సెక్యులర్ పేరు చెబుతున్నారని విమర్శించారు.

News September 26, 2024

ప్రజాభవన్‌లో ప్రవాసీ ప్రజావాణి కౌంటర్

image

TG: రేపు ప్రజాభవన్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవాసీ ప్రజావాణి ప్రత్యేక కౌంటర్‌ను ప్రారంభించనున్నారు. గల్ఫ్ కార్మికులు, ఎన్నారైల సమస్యల పరిష్కారానికి దీనిని ఏర్పాటు చేయనున్నారు. ప్రతి బుధ, శుక్రవారాల్లో కౌంటర్ తెరిచి ఉంటుందని అధికారులు తెలిపారు.

News September 26, 2024

టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ఆల్‌రౌండర్

image

బంగ్లాదేశ్ క్రికెటర్ షకీబల్ హసన్ అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించారు. 2026 టీ20 WC దృష్ట్యా యంగ్ ప్లేయర్లకు అవకాశం ఇవ్వడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తన టెస్టు కెరీర్‌ను స్వదేశంలోని మీర్పూర్‌లో SAతో జరిగే టెస్టుతో ముగించాలని అనుకుంటున్నట్లు తెలిపారు. ఒకవేళ బోర్డు ఒప్పుకోకపోతే INDతో ఆడే రెండో టెస్టే తనకు చివరిదని పేర్కొన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ODIల నుంచి తప్పుకోనున్నారు.

News September 26, 2024

బీటెక్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు.. రెండు రోజులే ఛాన్స్!

image

నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(NTPC)లో 250 డిప్యూటీ మేనేజర్ ఉద్యోగాలకు దరఖాస్తు గడువు ఈనెల 28తో ముగియనుంది. B.E/ B.Techలో (ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, మెకానికల్) 60% మార్కులు సాధించిన వారు అర్హులు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. శాలరీ రూ.60వేల నుంచి రూ.1.8లక్షల వరకు చెల్లిస్తారు. పూర్తి వివరాల కోసం, దరఖాస్తు చేసుకునేందుకు ఈ <>వెబ్‌సైట్‌ను<<>> సందర్శించండి.

News September 26, 2024

రేపే రెండో టెస్టు.. చెమటోడ్చిన భారత క్రికెటర్లు

image

భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ రేపు ప్రారంభం కానుంది. కాన్పూర్‌ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈనేపథ్యంలోనే టీమ్ ఇండియా క్రికెటర్లు నెట్స్‌లో తీవ్రంగా సాధన చేశారు. తొలి టెస్టులో ఘన విజయం సాధించిన రోహిత్ సేన చివరిదైన రెండో టెస్టులోనూ గెలిచి సిరీస్ క్లీన్ స్వీప్ చేయాలని చూస్తోంది. మరోవైపు ఈ టెస్టులో ఎలాగైనా గెలిచి సిరీస్ సమం చేయాలని బంగ్లా పట్టుదలతో ఉంది.

News September 26, 2024

కేజ్రీవాల్‌తో హర్భజన్ సింగ్ భేటీ

image

ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో ఆప్ ఎంపీ హర్భజన్ సింగ్ సమావేశమయ్యారు. ఆయన విజనరీ నాయకత్వం, ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకురావాలనే నిబద్ధతతో స్ఫూర్తి పొందినట్లు భజ్జీ ట్వీట్ చేశారు. ఆయనతో భేటీ ఎల్లప్పుడూ ప్రజలకు సరికొత్తగా సేవ చేయాలనే పాజిటివ్ ఎనర్జీని ఇస్తుందని రాసుకొచ్చారు.

News September 26, 2024

OTTలోకి వచ్చేసిన బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘స్త్రీ-2’

image

ఈ ఏడాది బిగ్గెస్ట్ బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ‘స్త్రీ-2’ సినిమా భారీ వసూళ్లను రాబట్టిన విషయం తెలిసిందే. ఆగస్టు 15న రిలీజై రూ.600 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా ఇప్పటికీ థియేటర్లలో అదరగొడుతోంది. తాజాగా ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ చిత్రం చూడాలంటే ప్రైమ్ మెంబర్షిప్ ఉన్నా రూ.349 రెంట్ చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ తెలిపింది. కొన్నిరోజుల తర్వాత ఈ అద్దెను తొలగించే అవకాశం ఉంది.

News September 26, 2024

తిరుమల ప్రసాదంపై అపోహలు అవసరంలేదు: రఘురామ

image

AP: ఈరోజు తాను శ్రీవారి ప్రసాదాన్ని స్వీకరించానని ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ట్విటర్‌లో తెలిపారు. ‘పెద అమిరంలోని నా స్వగృహంలో ఈరోజు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని స్వీకరించాను. చంద్రబాబుగారు సీఎం అయ్యాక లడ్డూను స్వచ్ఛమైన ఆవు నెయ్యితో అద్భుతంగా తయారు చేయిస్తున్నారు. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇస్తున్న ప్రసాదంపై భక్తులు ఎటువంటి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు’ అని హామీ ఇచ్చారు.