News April 4, 2024

కవిత బెయిల్ పిటిషన్‌పై మొదలైన వాదనలు

image

లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ మొదలైంది. ఆమె తరఫున సీనియర్ లాయర్ అభిషేక్ మను సింఘ్వీ, ఈడీ తరఫున జోహెబ్ హొస్సేన్ వాదనలు వినిపిస్తున్నారు. తన చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్నందున బెయిల్ ఇవ్వాలని కవిత కోర్టును కోరారు.

News April 4, 2024

ఉద్యోగాల భర్తీపై గుడ్‌న్యూస్!

image

TG: జాబ్ నోటిఫికేషన్లలో ఇచ్చిన పోస్టులను పూర్తి స్థాయిలో భర్తీ చేసేందుకు TSPSC చర్యలు తీసుకుంటోంది. జిల్లా స్థాయి ఉద్యోగాలను 1:3 నిష్పత్తిలో భర్తీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. గ్రూప్-4 ఉద్యోగాలకూ ఇదే ఫార్ములాను అనుసరించనుందట. ఎక్కువ మంది అభ్యర్థులను ఎంపిక చేస్తే అన్ని పోస్టులను భర్తీ చేయవచ్చని భావిస్తోందట. జోనల్, మల్టీజోనల్ స్థాయి పోస్టులను మాత్రం 1:2 నిష్పత్తిలోనే భర్తీ చేస్తారని సమాచారం.

News April 4, 2024

‘నేను విస్కీకి అభిమానిని’.. అడ్వకేట్, CJI మధ్య సరదా సంభాషణ

image

ఇండస్ట్రియల్ ఆల్కహాల్ కేసు విచారణ సందర్భంగా CJI చంద్రచూడ్, సీనియర్ అడ్వకేట్ దినేశ్ ద్వివేది మధ్య సరదా సంభాషణ జరిగింది. తన జుట్టుకు రంగులు ఉన్నందుకు క్షమించమని దినేశ్ CJIని కోరారు. హోలీ పండగ, ఇంట్లో మనమళ్లు ఉండటంతో తప్పలేదన్నారు. ఆల్కహాల్‌తో సంబంధం లేదా? అని CJI అడగగా ‘ఉంది.. హోలీ అంటే సగం ఆల్కహాలే. నేను విస్కీకి అభిమానిని’ అని దినేశ్ బదులు ఇవ్వడంతో కోర్టు రూమ్‌లో నవ్వులుపూశాయి.

News April 4, 2024

మా జట్టు ఆట చూసి సిగ్గేసింది: రికీ పాంటింగ్

image

నిన్న KKRతో మ్యాచ్‌లో ఢిల్లీ ఓటమిపై ఆ జట్టు కోచ్ రికీ పాంటింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘మా జట్టు తొలి అర్ధభాగం ఆట చూసి సిగ్గుపడ్డాను. బౌలర్లు భారీగా పరుగులు ఇచ్చుకున్నారు. 20 ఓవర్లు వేయడానికి 2 గంటల టైమ్ పట్టింది. 2 ఓవర్లు వెనుకబడటంతో చివరి రెండు ఓవర్లను సర్కిల్ బయట నలుగురు ఫీల్డర్లతోనే బౌలింగ్ చేయాల్సి వచ్చింది. మేం చాలా పొరపాట్లు చేశాం. ఇవి ఆమోదయోగ్యం కాదు’ అని పేర్కొన్నారు.

News April 4, 2024

ఎల్లుండి ఛలో తుక్కుగూడ: సీఎం రేవంత్

image

TG: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఈనెల 6న తుక్కుగూడలో ‘తెలంగాణ జన జాతర’ పేరుతో సభ నిర్వహించనుంది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ సీఎం రేవంత్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టర్‌ను షేర్ చేశారు. ‘తెలంగాణ గడ్డపై ప్రకటించే మేనిఫెస్టో.. భారతావని దశ-దిశ మార్చుతుందని చాటే సభ ఇది. ఛలో తుక్కుగూడ’ అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.

News April 4, 2024

వడగాలుల హెచ్చరిక.. ఆ జిల్లాలకు అలర్ట్

image

AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ్టి నుంచి 3 రోజులపాటు తీవ్రమైన వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. సత్యసాయి, కడప, నెల్లూరు, అనంతపురం, నంద్యాల, కర్నూలు, ప్రకాశం, పల్నాడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని, బయటకు వెళ్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

News April 4, 2024

‘కావలి’ ప్రజలకు ఎవరు కావాలో?

image

AP: నెల్లూరు జిల్లాలోని కావలి నియోజకవర్గంలో 1952 నుంచి 15సార్లు ఎన్నికలు జరిగాయి. 6సార్లు INC, 3సార్లు TDP, YCP 2సార్లు, కిసాన్ మజ్దూర్, ప్రజా పార్టీ, స్వతంత్ర పార్టీ ఒక్కోసారి, ఇండిపెండెంట్ ఓసారి గెలిచారు. 2014, 19లో YCP నుంచి గెలిచిన ప్రతాప్ కుమార్ హ్యాట్రిక్ సాధిస్తానని ధీమాగా ఉండగా, TDP నుంచి కావ్య కృష్ణారెడ్డి తనదే గెలుపంటున్నారు. ఇద్దరికీ ఆర్థిక, అంగబలం ఉండటంతో పోటీ రసవత్తరంగా ఉండనుంది.
<<-se>>#ELECTIONS2024<<>>

News April 4, 2024

ఘోరం.. భుజం తగిలిందని చంపేశారు

image

HYDలోని బేగంపేటలో ఘోరం జరిగింది. తరుణ్(18) మంగళవారం 10pmకు పాన్ షాప్‌కి వెళ్లాడు. అక్కడున్న సాయికిరణ్(21) భుజం తరుణ్‌కు తగిలి వాగ్వాదం మొదలైంది. సాయికిరణ్ ముగ్గురు రూమ్‌మేట్స్ శివశంకర్(24), ఎ.తరుణ్(21), పండు(22)లను తీసుకొచ్చాడు. దీంతో గొడవ ఘర్షణగా మారింది. ఆ నలుగురూ రూమ్‌లో కత్తి తీసుకొచ్చి.. తరుణ్‌ను పొడిచి పరారయ్యారు. తరుణ్ తల్లి అతడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. కేసు నమోదైంది.

News April 4, 2024

10 గ్రాముల బంగారం రూ.70,470

image

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర ఆల్‌టైమ్ గరిష్ఠానికి చేరింది. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేట్ రూ.600 పెరిగి రూ.70,470కి చేరింది. 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.500 పెరిగి రూ.64,600గా నమోదైంది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం కొనాలంటే వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. అటు కేజీ వెండి ధర కూడా రూ.1300 పెరిగి రూ.85,300కు చేరింది.

News April 4, 2024

సీఎం జగన్‌ను, నన్ను ఎవరూ ఓడించలేరు: కొడాలి నాని

image

AP: అభిమానులు తన కాళ్లకు <<12975332>>పాలాభిషేకం<<>> చేయడంపై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మాజీ మంత్రి కొడాలి నాని ఫైరయ్యారు. చంద్రబాబు, పవన్, లోకేశ్ మాదిరి వాళ్ల డప్పులు వాళ్లే కొట్టుకుంటూ, వాళ్ల దండలు వాళ్లే తెచ్చుకుంటున్నట్లు తాను చేయడం లేదని సెటైర్లు వేశారు. రాష్ట్రంలో సీఎం జగన్‌ను, గుడివాడలో తనను ఎవరూ ఓడించలేరన్నారు. తాను 23వేల మందికి ఇళ్ల పట్టాలు ఇప్పించానని తెలిపారు.