India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ‘కల్కి’ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. తాజాగా మూవీ షూటింగ్‌కు సంబంధించిన ఫొటోలను హీరోయిన్ దిశా పటానీ ట్విటర్‌లో పంచుకున్నారు. ఇటలీలో జరిగిన సాంగ్ షూట్‌లో ప్రభాస్, నాగ్ అశ్విన్‌తో సరదాగా గడిపిన సన్నివేశాలను ఫొటోల్లో చూపారు. అయితే, సినిమా విడుదల వాయిదా పడనున్నట్లు వార్తలొస్తుండటంతో సాంగ్ అయినా రిలీజ్ చేయాలని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

TG: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హామీలు నమ్మి ఓట్లేసిన ప్రజలు మోసపోయారని మాజీ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. 4 నెలల పాలనలోనే నానా తిప్పలు పడ్డారన్నారు. ‘రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పారు. ఆ లబ్ధి పొందినవాళ్లు కాంగ్రెస్‌కు, లేదంటే BRSకు ఓటేయండి. వరి పండిస్తే రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి పట్టించుకోలేదు. ఈ ఎన్నికల్లో చురక పెడితేనే పనులు జరుగుతాయి’ అని పేర్కొన్నారు.

AP: రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరగడంతో వడగాలులు తీవ్రమయ్యాయి. రాయలసీమలో ఉష్ణోగ్రతలు ఏకంగా 43 డిగ్రీలు దాటాయి. దీంతో వాతావరణ శాఖ రాయలసీమ, దక్షిణ కోస్తా, నెల్లూరు, ప్రకాశం, పల్నాడుకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సాధారణం కంటే రెండు, మూడు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది.

సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET-2024) రిజిస్ట్రేషన్ గడువు నేటితో ముగియనుంది. ముందస్తు షెడ్యూల్ ప్రకారం ఈనెల 2తో గడువు ముగియాల్సి ఉండగా, ఏప్రిల్ 5 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. జులై 7న రెండు షిఫ్టుల్లో పరీక్ష జరగనుంది. ఉ.9:30 నుంచి మ.12 వరకు మొదటి షిఫ్ట్, మ.2 నుంచి సా.4:30 వరకు రెండో షిఫ్ట్ నిర్వహించనున్నారు.

‘న్యాయ్ పత్ర-2024’పేరిట రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో కాంగ్రెస్ కీలక హామీలను పొందుపరిచింది.
* ఉపాధిహామీ కూలీ రోజుకు రూ.400కు పెంపు
* వైద్యసిబ్బంది దాడులకు పాల్పడితే కఠిన చర్యలకు చట్టం
* వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ మినహాయింపు
* ప్రతి జిల్లాలో లైబ్రరీలతో పాటు అంబేడ్కర్ భవనాలు
* సామాజిక న్యాయం కింద కనీస పింఛన్ రూ.1000కి పెంపు.

IIT బాంబేలో ఉత్తీర్ణులైన విద్యార్థుల్లో 36శాతం మందికి ప్లేస్‌మెంట్స్‌లో ఉద్యోగం రాలేదనే వార్త నెట్టింట వైరలైంది. దీనిపై IIT బాంబే క్లారిటీ ఇచ్చింది. ‘30% పైగా IITB విద్యార్థులకు ఉద్యోగాలు లభించడం లేదని వస్తోన్న వార్తలు అవాస్తవం. 2022-23 సర్వే ప్రకారం కేవలం 6.1% గ్రాడ్యుయేట్లు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు’ అని తెలుపుతూ సర్వే ఫలితాలు పోస్ట్ చేసింది.

AP: వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి ఫైరయ్యారు. ‘ప్రస్తుతం ప్రతి వ్యక్తిపై రూ.2 లక్షల భారం ఉంది. సచివాలయం, గనులను తాకట్టు పెట్టేందుకు జగన్ సిద్ధమయ్యారు. నాణ్యతలేని మద్యం అమ్ముతున్నారు. అది తాగి వందలాది మంది అనారోగ్యానికి గురవుతున్నారు. కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. మే 13 తర్వాత రాష్ట్రంలో మార్పు మొదలవుతుంది’ అని పేర్కొన్నారు.

ఉప్పల్ స్టేడియంలోని సమస్యలపై HCA మాజీ ప్రెసిడెంట్ మహమ్మద్ అజారుద్దీన్ ట్వీట్ చేశారు. ‘స్టేడియంలో నెలకొన్న సమస్యల నడుమ IPL 2024 మ్యాచ్‌లు కొనసాగుతున్నాయి. మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయి. నీటి సౌకర్యం సరిగ్గా లేదు. అనుమతి లేకుండా లోనికి ప్రవేశిస్తున్నారు. ఇవన్నీ విమర్శకులకు కనిపించట్లేదా? బ్లాక్ మార్కెట్ పెరిగింది. CSK మేనేజ్మెంట్‌కి కూడా పాస్‌లు దొరకలేదు. మార్పు ఎక్కడుంది’ అని ప్రశ్నించారు.

TG: ఉమ్మడి కరీంనగర్ పర్యటనలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ ముగ్దంపూర్‌లో ఎండిన పొలాలను పరిశీలించారు. స్థానిక రైతులతో ఆయన మాట్లాడారు. నీటి సమస్యపై వారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అన్నదాతలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని చెప్పారు. అనంతరం బోయినపల్లిలో పంట పొలాల పరిశీలనకు పయనమయ్యారు. ఆ తర్వాత మధ్య మానేరు ప్రాజెక్టును సందర్శించనున్నారు.

IPL 2024లో రికార్డుల మీద రికార్డులు నమోదవుతున్నాయి. ఇప్పటికే అత్యధిక టీమ్ స్కోరు రికార్డు బ్రేక్ అవ్వగా.. అత్యంత వేగంగా 300 సిక్సర్లు పూర్తి చేసుకున్న సీజన్‌గా నిలిచింది. కేవలం 17 మ్యాచుల్లోనే ప్లేయర్లు 300కు పైగా సిక్సర్లు బాదడం గమనార్హం. ఇప్పటివరకు ఏ సీజన్‌లోనూ ఇంత తక్కువ మ్యాచుల్లో ఈ సంఖ్యలో సిక్సర్లు నమోదుకాలేదు. కాగా గత సీజన్‌లో ప్లేయర్లు 1,124 సిక్సర్లు బాదారు.
Sorry, no posts matched your criteria.