India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

2024-25 విద్యాసంవత్సరం నుంచి NET స్కోరుతో PhD ప్రవేశాలు కల్పించవచ్చని యూనివర్సిటీలకు యూజీసీ సూచించింది. PhD ప్రవేశ పరీక్షల స్థానంలో నెట్ స్కోరును పరిగణించవచ్చని పేర్కొంది. జూన్ 2024 సెషన్‌కు సంబంధించిన NET దరఖాస్తు ప్రక్రియను వచ్చే వారంలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు యూజీసీ ఛైర్మన్ మామిడాల జగదీశ్ కుమార్ వెల్లడించారు.

క్లాసెన్.. ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ఫేవరెట్ ప్లేయర్. IPLలో చాలా సీజన్ల పాటు అలరించిన వార్నర్‌ను SRH వదులుకోవడంతో అలాంటి ఆటగాడి కోసం అభిమానులు ఎదురుచూశారు. వారి ఆశలను నెరవేరుస్తూ తాను ఉన్నానంటూ క్లాసెన్ ముందుకొచ్చారు. ఎవరు ఆడినా, ఆడకున్నా తాను మాత్రం అద్భుతమైన షాట్లతో భారీ స్కోర్లు చేస్తున్నారు. గత సీజన్లోనూ ఒంటరి పోరాటం చేశారు. ప్రస్తుతం టీ20ల్లో తానే బెస్ట్ ప్లేయర్‌నని నిరూపించుకుంటున్నారు.

AP: గత ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న కామినేని శ్రీనివాస్ BJP తరఫున మళ్లీ బరిలోకి దిగుతున్నారు. 2014లో TDP-BJP పొత్తులో ఈయన కృష్ణా(D) కైకలూరు నుంచి పోటీ చేసి గెలుపొందారు. చంద్రబాబు కేబినెట్‌లో కీలకమైన వైద్యారోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తర్వాత TDPతో పొత్తు ముగియడంతో మంత్రి పదవికి రాజీనామా చేసి పాలిటిక్స్‌లో సైలెంట్ అయ్యారు. ఈ ఎన్నికల్లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

మహిళల్లో ఎక్కువగా వచ్చే రొమ్ము క్యానర్స్ ‘ఈస్ట్రోజన్ రిసెప్టర్ పాజిటివ్’. అయితే చికిత్స తర్వాత కూడా కొందరిలో మళ్లీ ఈ క్యాన్సర్ తిరగబెడుతోంది. చికిత్స సమయంలో క్యాన్సర్ కణాలు స్లీపింగ్ మోడ్‌లోకి వెళ్లి కొన్నాళ్లకు తిరిగి క్రియాశీలం అవ్వడమే దీనికి కారణమని తాజా పరిశోధనల్లో వెల్లడైంది. G9a అనే ఎంజైమ్ వల్లే ఇలా జరుగుతోందని.. దీనిని నియంత్రించడంపై దృష్టి సారిస్తున్నామని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

AP: వివేకా హత్యకు ముందు జరిగిన విషయాలను మరుగున పడేశారని.. హత్య వెనుక చంద్రబాబు, ఆదినారాయణ రెడ్డి, బీటెక్ రవి హస్తం ఉందంటూ కమలాపురం MLA రవీంద్రనాథ్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. వివేకా హత్యపై సీఎం జగన్ ఇచ్చిన <<12937346>>వివరణ <<>>టీడీపీకి చెంపపెట్టులాంటిదని మండిపడ్డారు. కడప జిల్లా ప్రజలకు వాస్తవాలు ఏంటో తెలుసని అన్నారు. జగన్ వ్యాఖ్యలను రాష్ట్ర ప్రజలంతా అర్థం చేసుకున్నారని పేర్కొన్నారు.

AP: బీజేపీకి కేటాయించిన అసెంబ్లీ స్థానాలపై ఆ పార్టీ నేత, మాజీ సీఎస్ IYR కృష్ణారావు అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘BJPకి పట్టణ ప్రాంతాల్లో అంతో ఇంతో పట్టు ఉంది. ఇచ్చిన 10 స్థానాల్లో విశాఖ, విజయవాడ, ఆదోని మాత్రమే పట్టణ ప్రాంతాలు. మిగిలిన 7 స్థానాలు ఏ ప్రాతిపదికన ఇచ్చారో అర్థం కావట్లేదు. BJP తరఫున ఎవరు పోటీ చేయాలనేది TDP నిర్ణయించిన తర్వాతే సీట్లు కేటాయించారా? అనే అనుమానం కలుగుతోంది’ అని ట్వీట్ చేశారు.

2013-2023 మధ్య ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల్లో 4.62 లక్షల మోసాలు జరిగినట్లు RBI వెల్లడించింది. పదేళ్లలో ₹5.3 లక్షల కోట్ల స్కామ్‌లు జరిగాయని RTI దరఖాస్తుకు ఇచ్చిన సమాధానంలో తెలిపింది. ‘రుణాలు, కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ పద్ధతిలోనే ఎక్కువ మోసాలు జరిగాయి. మహారాష్ట్రలో అత్యధిక స్కామ్‌లు బయటపడగా, ఆ తర్వాతి స్థానాల్లో ఢిల్లీ, హరియాణా, తమిళనాడు, UP, కర్ణాటక, గుజరాత్, తెలంగాణ ఉన్నాయి’ అని పేర్కొంది.

అమెరికాలోని టెక్సస్, కాన్సాస్‌తో పాటు పలు రాష్ట్రాల్లోని ఆవుల పాలల్లో బర్డ్ ఫ్లూ ఉందన్న విషయం బయటపడింది. ఇది పశువుల నుంచి మనుషులకు సోకే ప్రమాదం ఉందని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వేల సంఖ్యలో ఆవులు H5N1 టైప్-A బారిన పడ్డాయని, జంతువుల్లో ఈ స్థాయిలో వైరస్ వ్యాప్తి చెందడం ఇదే తొలిసారి అని వైద్య వర్గాలు తెలిపాయి. వైరస్ సోకిన ఆవుల్లో బద్ధకం, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని పేర్కొన్నాయి.

తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. కాలిబాట సమీపంలో అటవీశాఖ సిబ్బంది చిరుతను గుర్తించారు. నిన్న రాత్రి చిరుత కెమెరాలకు చిక్కడంతో అధికారులు భక్తులను, భద్రతా సిబ్బందిని అలర్ట్ చేశారు. నడకదారిలో భక్తులను గుంపులుగా పంపిస్తున్నారు.

తమిళనాడు ఈరోడ్ ఎంపీ గణేశమూర్తి (77) గుండెపోటుతో మరణించారు. మూడు రోజుల క్రితం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన ఆయనకు ఈ ఉదయం గుండెపోటు వచ్చింది. కొయంబత్తూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు. 2019లో డీఎండీకే తరఫున ఈరోడ్ నుంచి పోటీ చేసి గెలిచిన గణేశమూర్తికి ఈసారి ఆ పార్టీ టికెట్ ఇవ్వలేదు. దీంతో మనస్తాపానికి గురైన ఆయన మార్చి 24న పురుగు మందు తాగారు.
Sorry, no posts matched your criteria.