India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: బీసీ గురుకులాల పరిధిలో ఉన్న 255 జూనియర్ కాలేజీల్లో 2024-25 ప్రవేశాలకు ఏప్రిల్ 28న రాతపరీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్ 12వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మొత్తం 21,920 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. పూర్తి వివరాలకు https://mjptbcwreis.telangana.gov.in/ వెబ్‌సైట్‌ను చూడాలని సూచించారు.

టైటానిక్ సినిమా క్లైమాక్స్ సీన్‌ను చాలామంది మర్చిపోరు. షిప్ సముద్రంలో మునిగిపోగా హీరోయిన్‌ను రక్షించడం కోసం హీరో జాక్ పాత్రధారి ఒక తలుపు చెక్కపై ఆమెను ఉంచి తాను ప్రాణాలు వదులుతాడు. కాగా ఇటీవల ఆ డోర్‌ని వేలం వేయగా రూ.6 కోట్ల రికార్డు ధర పలికింది. అయితే వాస్తవానికి అది తలుపు చెక్క కాదట. షిప్ ఫస్ట్ క్లాస్ లాంజ్ ప్రవేశద్వారంపై పైన ఉన్న డోర్ ఫ్రేమ్‌లోని భాగాన్ని అలా చూపించామని నిర్మాతలు తెలిపారు.

మళ్లీ పుంజుకుని ఐపీఎల్‌లో రాణిస్తామని ముంబై ఇండియన్స్ ప్లేయర్, తెలుగు తేజం తిలక్ వర్మ తెలిపారు. ‘ఇది మేము కోరుకున్న రిజల్ట్ కాదు. మేము బలంగా తిరిగొస్తాం. నా వెంట ఉంటూ ఎల్లప్పుడూ నన్ను ప్రోత్సహిస్తున్న కుటుంబ సభ్యులు, కోచ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు’ అని తిలక్ ట్వీట్ చేశారు. దీనికి ఉప్పల్ స్టేడియంలో తల్లిదండ్రులతో దిగిన ఫొటోను జతచేశారు. కాగా నిన్నటి మ్యాచ్‌లో తిలక్ 34 బంతుల్లోనే 64 రన్స్ చేశారు.

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై హైదరాబాద్ సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న కడప ఎంపీ అవినాశ్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, ఉదయ్ శంకర్‌రెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరి కోర్టుకు హాజరయ్యారు. వాదనలు విన్న జడ్జి.. తదుపరి విచారణను ఏప్రిల్ 12కు వాయిదా వేశారు.

ఆమ్ ఆద్మీ పార్టీని లేకుండా చేయడమే ఈడీ ఉద్దేశంలా కనిపిస్తోందని రౌస్ అవెన్యూ కోర్టులో వాదనల సందర్భంగా సీఎం కేజ్రీవాల్ చెప్పారు. ‘ఈడీ విచారణ తర్వాత అసలు మద్యం కుంభకోణం ప్రారంభమైంది. అప్రూవర్‌గా మారి బెయిల్‌పై విడుదలైన శరత్ చంద్రా రెడ్డి బీజేపీకి రూ.55 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఇందుకు సంబంధించి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి’ అని వాదించారు. దీనిపై ASG రాజు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

తాజ్‌మహల్‌ను శివాలయంగా ప్రకటించాలని మరో పిటిషన్ దాఖలైంది. యోగేశ్వర్ శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంఘ్ ట్రస్ట్ అధ్యక్షుడు అజయ్ ప్రతాప్ UPలోని ఆగ్రా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాజ్‌మహల్‌లో నిర్వహిస్తున్న ఇస్లామిక్ కార్యకలాపాలను నిలిపివేయాలని కోరారు. దీనిపై APR 9న విచారణ జరగనుంది. మహల్‌ను శివాలయంగా ప్రకటించాలని కోరుతూ ఇప్పటికే దాఖలైన పలు పిటిషన్లను కోర్టు కొట్టివేయగా, మరికొన్ని పెండింగ్‌లో ఉన్నాయి.

TG: బీఆర్ఎస్ అగ్రనేత కే.కేశవరావు ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌజ్‌కు వెళ్లారు. అక్కడ పార్టీ అధినేత కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఆయన పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరతారనే ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో ఈ భేటీ ఆసక్తికరంగా మారింది.

దేశంలోనే సంపన్న మహిళ, హరియాణా మాజీ మంత్రి సావిత్రీ జిందాల్ కాంగ్రెస్‌కు వీడ్కోలు పలికారు. కుటుంబసభ్యులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు. కాగా ఆమె కుమారుడు, పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్ ఇటీవల కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. ఆ పార్టీ ఆయనకు కురుక్షేత్ర సీటును ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో సావిత్రీ కూడా బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

AP: పోలవరం YCP ఎమ్మెల్యే అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. తప్పుడు కుల ధ్రువీకరణ పత్రంతో ఆమె ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని పిటిషనర్ మడకం వెంకటేశ్వరరావు తరఫు లాయర్ వాదించారు. కలెక్టర్ జారీ చేయాల్సిన ఎస్టీ సర్టిఫికెట్‌ను బుట్టాయిగూడెం తహసీల్దార్ జారీ చేశారని కోర్టు దృష్టికి తెచ్చారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని అధికారులను ధర్మాసనం ఆదేశించింది.

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్టులు కొనసాగుతున్నాయి. తాజాగా టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్, సీఐ గట్టు మల్లుపై ఆరోపణలు రావడంతో వారిని అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పీఎస్‌లో విచారిస్తున్నారు. వెస్ట్‌జోన్ డీసీపీ సమక్షంలో స్టేట్‌మెంట్‌ను రికార్డు చేస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ కేసులో మాజీ పోలీస్ ఉన్నతాధికారులు తిరుపతన్న, భుజంగరావు, ప్రణీత్ రావులకు రిమాండ్ విధించారు.
Sorry, no posts matched your criteria.