India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: హనుమకొండ జిల్లా కాజీపేట వద్ద పద్మావతి ఎక్స్‌ప్రెస్(సికింద్రాబాద్-తిరుపతి)లో పొగలు వచ్చాయి. బ్యాటరీ క్యాప్ లీక్ కావడంతోనే ఈ పొగలు వచ్చినట్టు సిబ్బంది గుర్తించారు. దీంతో కాజీపేట స్టేషన్‌లో రైలును సుమారు గంటన్నర పాటు నిలిపివేసి మరమ్మతులు చేశారు. తర్వాత రైలు యథావిధిగా వెళ్లిపోయింది.

TG: ఈ నెల 31న మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు. రాష్ట్రంలోని జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆయా జిల్లాల్లో ఎండిన పంటలను పరిశీలించనున్నారు. రైతులను కలిసి వారి సమస్యలు తెలుసుకోనున్నారు. అనంతరం సూర్యాపేటలో ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు.

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో కేంద్రంపై విమర్శలు చేస్తున్న ఆయన భార్య సునీత కేజ్రీవాల్‌పై కేంద్రమంత్రులు కౌంటర్ ఇస్తున్నారు. ‘మేడం సీఎం అయ్యేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో బిహార్ సీఎం లాలూ ప్రసాద్ అరెస్టైనప్పుడు రబ్రీదేవి కూడా ఇలాగే చేశారు’ అని హర్దీప్ సింగ్ పురి ఎద్దేవా చేశారు. లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన కేజ్రీవాల్ ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. రానున్న రోజుల్లో భానుడి భగభగలు తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణ, ఏపీతో పాటు TN, KA, రాజస్థాన్, GT, మహారాష్ట్ర, కేరళలో వేడి గాలులు వీస్తున్నాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటికి వెళ్లొద్దని సూచిస్తున్నారు. డీహైడ్రేషన్ వల్ల వడదెబ్బ తగిలే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

TG: మాజీ మంత్రి కేటీఆర్‌పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. ‘రాజకీయ అవసరాల కోసం ఫోన్ ట్యాపింగ్ చేసి, తిరిగి మమ్మల్ని తిడుతున్నారు. కేటీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి’ అని హెచ్చరించారు. బీఆర్ఎస్‌లా తాము పాలనను గాలికి వదిలేసి, సోషల్ మీడియాకే పరిమితం కాలేదని భట్టి విమర్శించారు. ఇక ఏప్రిల్ 6న తుక్కుగూడ సభలో కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు.

AP: తన కుటుంబానికి ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన టీడీపీకి కృతజ్ఞతలని హీరో నిఖిల్ ట్వీట్ చేశారు. ‘చీరాల టికెట్ దక్కించుకున్న మా మామయ్య ఎం.ఎం. కొండయ్యకు శుభాకాంక్షలు’ అని రాసుకొచ్చారు. కాగా కాసేపటి క్రితమే నారా లోకేశ్ సమక్షంలో సిద్ధార్థ్ టీడీపీలో చేరారు.

TG: తాను బీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని సినీనటుడు, ప్రజాశాంతి పార్టీ నేత బాబూమోహన్ స్పష్టం చేశారు. ‘ప్రజాశాంతి పార్టీ తరఫునే వరంగల్ నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నా. నాకు కేసీఆర్ ఫోన్ చేయలేదు. నేను కేసీఆర్‌తో మాట్లాడి దాదాపు ఆరేళ్లు అవుతోంది. ఇదంతా ఎవరు సృష్టించారో తెలియటం లేదు. నన్ను ఎవరూ కొనలేరు. నన్ను కొనేవారు ఈ భూమి మీద పుట్టలేదు’ అని ఆయన పేర్కొన్నారు.

IPL చరిత్రలో మిచెల్ స్టార్క్ అత్యధిక ధర దక్కించుకున్న ఆటగాడిగా నిలిచారు. మినీ వేలంలో అతడిని KKR రూ.24.75 కోట్లకు దక్కించుకుంది. అయితే ఈ ఐపీఎల్‌లో ఇప్పటివరకు 2 మ్యాచులాడిన అతడు.. ఒక్క వికెట్ కూడా తీయకపోవడం గమనార్హం. మొత్తం 8 ఓవర్లు వేసిన స్టార్క్.. ఏకంగా 100 రన్స్ ఇచ్చారు. దీంతో అతడి ప్రదర్శనపై నెట్టింట చర్చ జరుగుతోంది.

AP: టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ టీడీపీలో చేరారు. ఆయనకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కండువా కప్పి ఆహ్వానించారు. దీంతో ఈ ఎన్నికల్లో నిఖిల్ టీడీపీ తరఫున ప్రచారం చేయనున్నారు.

AP: రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ముస్లింల హవా నడుస్తోంది. 1983 నుంచి ఇక్కడ వరుసగా ముస్లిం అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతున్నారు. చివరిసారిగా 1978లో ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి లింగంశెట్టి ఈశ్వరరావు గెలిచారు. ఆ తర్వాత మరే హిందూ అభ్యర్థి విజయం సాధించలేదు. ఇక్కడి నుంచి ఉమర్ ఖాన్ పఠాన్, మహ్మద్ జానీ, జియావుద్దీన్, సుబానీ, మస్తాన్ వలీ, ముస్తఫా MLAలుగా ఎన్నికయ్యారు.
Sorry, no posts matched your criteria.