News August 4, 2024

YCP నేతలు జైలుకు పోవడం ఖాయం: BJP MLA

image

AP: గత ప్రభుత్వ హయాంలో అక్రమాలకు పాల్పడిన YCP నేతలందరూ జైలుకెళ్లడం ఖాయమని జమ్మలమడుగు BJP MLA ఆదినారాయణరెడ్డి అన్నారు. ఐదేళ్లలో రూ.5 లక్షల కోట్లు దోచేశారని ఆరోపించారు. ‘వచ్చే ఎన్నికల్లో పులివెందులలో జగన్‌ను ఓడిస్తాం. 200 సీట్లు గెలుచుకుని ఎన్డీఏ కూటమి క్లీన్ స్వీప్ చేస్తుంది. సీఎం చంద్రబాబు పరిపాలన బాగా చేస్తున్నారు. మోదీ సహకారంతో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోంది’ అని ఆయన వ్యాఖ్యానించారు.

News August 4, 2024

చైనాలో ‘పెళ్లి’పై ఓ డిగ్రీ కోర్సు!

image

చైనాలో జననాల శాతం పడిపోతుండటంతో పెళ్లిపై ఓ డిగ్రీ కోర్సును ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనికి ‘మ్యారేజ్ సర్వీసెస్ అండ్ మేనేజ్‌మెంట్’గా పేరు పెట్టింది. పౌర వ్యవహారాల విశ్వవిద్యాలయంలో వచ్చే నెల నుంచి ఈ కోర్సు మొదలుకానుంది. 12 ప్రావిన్సుల నుంచి 70మంది అండర్‌గ్రాడ్యుయేట్లకు తొలి ఏడాది అడ్మిషన్ ఇవ్వనున్నట్లు వర్సిటీ ప్రకటించింది. ఇది చదివిన వారికి వివాహ సంబంధిత రంగాల్లో ఉద్యోగావకాశాలుంటాయని పేర్కొంది.

News August 4, 2024

ఆలయం గోడ కూలి 9 మంది చిన్నారులు మృతి

image

భారీ వర్షాలకు ఆలయం గోడ కూలి 9 మంది పిల్లలు మరణించిన విషాద ఘటన మధ్యప్రదేశ్‌లోని షాపూర్‌లో జరిగింది. స్థానిక హర్దౌల్ బాబా ఆలయంలో జరుగుతున్న సావన్ వేడుకలను తిలకించేందుకు భారీగా భక్తులు వెళ్లారు. ఈక్రమంలోనే వర్షాలకు తడిసిన టెంపుల్ గోడ అక్కడ కూర్చున్న పిల్లలపై పడింది. దీంతో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరంతా 14 ఏళ్లలోపు వారే. గాయపడ్డ మరికొందరిని ఆసుపత్రికి తరలించారు.

News August 4, 2024

9 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్‌.. 965 కి.మీ మైలేజీ!

image

విద్యుత్ వాహనాలకు బ్యాటరీ ఛార్జింగ్, మైలేజీ అతి పెద్ద అడ్డంకులుగా ఉన్నాయి. వీటి వలన ప్రజలు ఈవీలవైపు మొగ్గుచూపడం లేదు. సాంసంగ్ సంస్థ 2027 కల్లా దీనికి పరిష్కారాన్ని తీసుకొచ్చేందుకు చూస్తోంది. కేవలం 9 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అయి 965 కిలోమీటర్ల మైలేజీ ఇచ్చే బ్యాటరీని సంస్థ తయారుచేసింది. ఏ వాహనంలోనైనా దీన్ని వాడుకోవచ్చని 20 ఏళ్ల వరకు పనిచేస్తుందని చెబుతోంది. అయితే, ఎక్కువ ధర ఉండనుందని సమాచారం.

News August 4, 2024

OLYMPICS: గ్రేట్ బ్రిటన్‌తో భారత్ ఢీ

image

పారిస్ ఒలింపిక్స్‌లో దూసుకెళ్తున్న భారత హాకీ జట్టు గ్రేట్ బ్రిటన్‌తో క్వార్టర్‌ఫైనల్‌లో తలపడుతోంది. ఈ గేమ్‌లో గెలిస్తే భారత్ సెమీస్‌లో అడుగుపెడుతుంది. గ్రూప్ దశలో కేవలం ఒక గేమ్ మాత్రమే ఓడిన హర్మన్‌ప్రీత్ సింగ్ సేన జోరును కొనసాగించాలని, బ్రిటన్‌ను చిత్తు చేయాలని భారత ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. స్పోర్ట్స్ 18 నెట్‌వర్క్‌, జియోసినిమా వెబ్‌సైట్, యాప్‌లో మ్యాచ్ లైవ్ టెలికాస్ట్ అవుతోంది.

News August 4, 2024

సెయింట్ లూసియాకు తొలి ఒలింపిక్ మెడల్

image

ఒలింపిక్స్ చరిత్రలోనే సెయింట్ లూసియా తొలి పతకం దక్కించుకుంది. పారిస్ ఒలింపిక్స్‌లో ఆ దేశ రన్నర్ జూలియన్ ఆల్ఫ్రెడ్ 100 మీ. పరుగు పందెంలో పతకం సాధించారు. 10.72 సెకన్లలో రేస్ పూర్తి చేసి ఆమె గోల్డ్ మెడల్ కొల్లగొట్టారు. దీంతో ఆ దేశ ప్రజల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దేశవ్యాప్తంగా ప్రజలు సంబరాలు చేసుకున్నారు.
<<-se>>#Olympics2024<<>>

News August 4, 2024

హృద్యం: ఆర్మీకి చిన్నారి లేఖ

image

భారత సైన్యం ప్రాణాలకు తెగించి వయనాడ్‌ విధ్వంసంలో చిక్కుకున్నవారిని రక్షించింది. దీంతో రాయన్ అనే బాలుడు వారికి థాంక్స్ చెబుతూ లేఖ రాశాడు. ‘బ్రిడ్జిని కట్టే సమయంలో మీరు కేవలం బిస్కెట్లతో కడుపు నింపుకోవడం నన్ను కదిలించింది. నేనూ ఆర్మీలో చేరతా. దేశాన్ని కాపాడతా’ అని పేర్కొన్నాడు. వైరల్ అవుతున్న ఆ లేఖ అందర్నీ ఆకట్టుకుంటోంది. తమతో చేరే రోజుకోసం ఎదురుచూస్తుంటామని రాయన్‌కు ఆర్మీ జవాబివ్వడం విశేషం.

News August 4, 2024

రేవంత్‌కు ‘ఆల్ ది బెస్ట్’ చెప్పిన కేటీఆర్

image

TG: పెట్టుబడులే లక్ష్యంగా US, S.కొరియా పర్యటనకు వెళ్లిన CM రేవంత్, మంత్రి శ్రీధర్‌బాబుకు KTR ఆల్ ది బెస్ట్ చెప్పారు. గతంలో తాము KCR నాయకత్వంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు TS-IPASS వంటి వినూత్న విధానాలను తీసుకొచ్చామన్నారు. పదేళ్లలో రూ.4లక్షల కోట్లకు పైగా ఇన్వెస్ట్‌మెంట్లు, 24L ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వమూ పెట్టుబడుల సాధనలో విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు ట్వీట్ చేశారు.

News August 4, 2024

ఇమానే ఖెలీఫ్ అమ్మాయే: ఆమె తండ్రి

image

అల్జీరియా బాక్సర్ ఇమానే ఖెలీఫ్ అమ్మాయేనని ఆమె తండ్రి ఒమర్ ఖెలీఫ్ తెలిపారు. ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లను ఆయన వీడియోలో ప్రదర్శించారు. ‘నా బిడ్డ ఆడపిల్లగానే పెరిగింది. కష్టపడటం, ధైర్యంగా ఉండటం నేర్పా. ఒలింపిక్స్ వరకు రావడానికి ఆమె చాలా శ్రమించింది. ఇటలీ బాక్సర్ కంటే నా కూతురు బలంగా ఉంది కాబట్టే సులువుగా గెలిచింది’ అని ఆయన వివరించారు. కాగా <<13756877>>ఇమానే<<>> సెమీస్‌కు చేరుకుని పతకం ఖాయం చేసుకున్నారు.

News August 4, 2024

కేరళకు రూ.25లక్షల సాయం ప్రకటించిన అల్లు అర్జున్

image

కేరళలోని వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి సంభవించిన విపత్తుపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఈ ఘటన చాలా బాధాకరం. కేరళ నాకు ఎంతో ప్రేమను పంచింది. ఈ విపత్కర పరిస్థితుల్లో కేరళ CM రిలీఫ్ ఫండ్‌కు రూ.25లక్షలు <<13769196>>విరాళంగా<<>> ఇస్తున్నా. కేరళ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా’ అని Xలో ట్వీట్ చేశారు.