News July 4, 2024

తొలిసారి 80వేల మార్క్‌తో ముగిసిన సెన్సెక్స్

image

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ట్రేడింగ్‌ను స్వల్ప లాభాలతో ముగించాయి. ఆరంభంలో ఉన్న జోరు చివరి దాకా కొనసాగకున్నా సెన్సెక్స్ ట్రేడింగ్ తొలిసారి 80వేల మార్క్‌లో ముగిసింది. 62 పాయింట్లు లాభపడిన సూచీ 80,049 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 15 పాయింట్లు పెరిగి 24,302 వద్ద స్థిరపడింది. టాటా మోటార్స్, హెచ్‌సీఎల్ టెక్, ఐసీఐసీఐ బ్యాంక్, సన్ ఫార్మా, టీసీఎస్ షేర్లు నిఫ్టీ టాప్ గెయినర్లుగా నిలిచాయి.

News July 4, 2024

వరల్డ్ కప్ విజేతలతో ప్రధానులు

image

టీ20 వరల్డ్ కప్‌-2024లో గెలిచి విశ్వవిజేతలుగా నిలిచిన భారత జట్టును ప్రధాని నరేంద్ర మోదీ అభినందించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత వరల్డ్ కప్‌ విజేతలతో అప్పటి ప్రధానులు దిగిన ఫొటోలు వైరలవుతున్నాయి. 1983లో తొలి ODI వరల్డ్ కప్ గెలిచిన జట్టుతో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఫొటో దిగారు. 2007లో T20 WC గెలిచిన ధోనీ సారథ్యంలోని భారత జట్టు గత ప్రధాని మన్మోహన్ సింగ్‌తో కలిసి కెమెరాకు పోజులిచ్చింది.

News July 4, 2024

హాథ్రస్ ఘటనలో ఆరుగురు అరెస్ట్

image

హాథ్రస్ ఘటనకు సంబంధించి పోలీసులు ఆరుగురు సత్సంగ్ నిర్వాహకులను అరెస్ట్ చేశారు. మరికొందరిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. హాథ్రస్ జిల్లాలోని రతిభాన్‌పూర్‌లో నిర్వహించిన సత్సంగ్ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగి 121 మంది మరణించిన సంగతి తెలిసిందే. 80 వేల మందికి అనుమతి తీసుకోగా 2.50 లక్షల మందికిపైగా భక్తులు వచ్చారు. ఈ క్రమంలో బాబా పాద ధూళి కోసం జనం ఒక్కసారిగా ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది.

News July 4, 2024

కోహ్లీ, రోహిత్‌కు BCCI స్పెషల్ ట్రీట్!

image

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి BCCI స్పెషల్ ట్రీట్ ఇచ్చింది. టీమ్ఇండియా ప్లేయర్లు ఢిల్లీ నుంచి ముంబై‌కి ప్రయాణించే విస్తారా విమానానికి వారి జెర్సీ నంబర్లు (కోహ్లీ 18, రోహిత్ 45) ఉండేలా ‘UK1845’ నంబర్ కేటాయించింది. ఇలా ఈ విమానాన్ని వారిద్దరికి అంకితం చేసింది. కాగా ముంబైకి చేరుకున్న తర్వాత టీమ్ఇండియా ప్లేయర్లు ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఓపెన్ బస్ పరేడ్‌లో పాల్గొననున్నారు.

News July 4, 2024

స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి ₹లక్షకు పెంపు?

image

త్వరలో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్‌లో వేతనజీవులకు ఊరట లభించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి ప్రస్తుతం సంవత్సరానికి ₹50వేలు ఉండగా ఆ మొత్తాన్ని ₹లక్షకు పెంచనున్నట్లు తెలుస్తోంది. దీనిని క్లెయిమ్ చేసుకునేందుకు ఉద్యోగులు ఎలాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. పెన్షన్ అందుకునే మాజీ ఉద్యోగులకు కూడా ఈ స్టాండర్డ్ డిడక్షన్ వర్తిస్తుంది.

News July 4, 2024

7న TTDP నేతలతో చంద్రబాబు భేటీ

image

తెలంగాణలో టీడీపీ బలోపేతం కోసం ఈ నెల 7న హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు ఏపీ సీఎం చంద్రబాబు రానున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆయన ఇక్కడికి వస్తున్నారు. టీటీడీపీ నేతలు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఈ సమావేశంలో టీటీడీపీ నూతన అధ్యక్షుడి నియామకం, పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ, సభ్యత్వ నమోదు తదితర అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

News July 4, 2024

ఓటమిలో.. గెలుపులో టీమ్ఇండియాతో మోదీ

image

టీ20 WC-2024 ట్రోఫీని గెలుపొంది స్వదేశానికి తిరిగివచ్చిన భారత జట్టును ప్రధాని మోదీ కలుసుకొని ప్రతి ఒక్కరినీ అభినందించారు. విశ్వవిజేతల కుటుంబాలను కలుసుకొని వారితో సందడిగా గడిపారు. ఈక్రమంలో CWC2023 ఫైనల్‌లో ఓడిపోయినప్పుడు మోదీ టీమ్ఇండియాను కలిసి ఆటగాళ్లలో స్థైర్యాన్ని నింపిన సన్నివేశాన్ని నెటిజన్లు గుర్తుచేసుకుంటున్నారు. ఓటమిలోనూ, గెలుపులోనూ మోదీ టీమ్‌కు తోడుగా ఉన్నారని ట్వీట్స్ చేస్తున్నారు.

News July 4, 2024

జులై 11న CA ఫలితాలు: ICAI

image

ఛార్టెర్డ్ అకౌంటెన్సీ (CA) ఫైనల్, ఇంటర్మీడియట్ ఫలితాల విడుదలపై ICAI అధికారిక ప్రకటన చేసింది. మేలో నిర్వహించిన పరీక్ష ఫలితాలను జులై 11న విడుదల చేయబోతున్నట్లు తెలిపింది. విద్యార్థులు తమ రిజిస్ట్రేషన్, రోల్ నెంబర్లు ఎంటర్ చేసి ఫలితాలు చెక్ చేసుకోవచ్చని పేర్కొంది.

News July 4, 2024

వాస్తవాధీన రేఖను చైనా గౌరవించాలి: జైశంకర్

image

వాస్తవాధీన రేఖ(LAC)ని చైనా గౌరవించాలని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ బీజింగ్‌కు స్పష్టం చేశారు. కజకిస్థాన్‌లో జరుగుతున్న షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సరిహద్దు సమస్యల్ని త్వరగా పరిష్కరించడంపై తాము చర్చించినట్లు ట్విటర్‌లో తెలిపారు. పరస్పర గౌరవం, ప్రయోజనాలు ఇరు దేశాల బంధాన్ని నిర్దేశిస్తాయని తేల్చిచెప్పినట్లు పేర్కొన్నారు.

News July 4, 2024

కాసేపట్లో సీఎంగా హేమంత్ ప్రమాణ స్వీకారం

image

ఝార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ సాయంత్రం 5 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నిన్న సీఎం చంపై సోరెన్ రాజీనామా చేయగా జేఎంఎం నేతృత్వంలోని కూటమి హేమంత్‌ను శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు హేమంత్‌ను గవర్నర్ రాధాకృష్ణన్ ఆహ్వానించారు. సాయంత్రం రాంచీలోని రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది.