India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: ఆరోగ్య శ్రీ నెట్‌వర్క్ ఆస్పత్రులు దిగివచ్చాయి. సీఎస్ జవహర్ రెడ్డితో జరిపిన చర్చలు సఫలం కావడంతో స్కీమ్ సేవల్ని యథాతథంగా కొనసాగించనున్నట్లు హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. మరో రూ.300 కోట్ల నిధుల విడుదలకు సీఎస్ హామీ ఇచ్చినట్లు పేర్కొంది. మొత్తంగా ఈ పథకం కింద సేవలు అందించిన ఆస్పత్రులకు ప్రభుత్వం రూ.1500 కోట్ల బకాయి పడింది. ఇటీవల రూ.203 కోట్లు విడుదల చేసింది.

భారత్‌లో టాటా మోటార్స్‌కు చెందిన రేంజ్ రోవర్, రేంజ్ రోవర్ స్పోర్ట్స్ కార్ల ధరలు త్వరలో తగ్గనున్నాయి. దేశంలో వీటి ఉత్పత్తిని ప్రారంభించడమే ఇందుకు కారణం. సంస్థ 54 ఏళ్ల చరిత్రలో బ్రిటన్ వెలుపల తొలిసారిగా వీటిని తయారు చేయడం విశేషం. స్థానికంగా ఉత్పత్తి చేయడంతో వీటి ధరలు 18-22% తగ్గనున్నాయి. రేంజ్ రోవర్ స్పోర్ట్ ధర రూ.1.9 కోట్ల నుంచి 1.4 కోట్లకు, రేంజ్ రోవర్ రూ.3.3కోట్ల నుంచి రూ.2.6 కోట్లకు తగ్గనుంది.

పరిమితికి మించి స్పీడ్‌తో రైళ్లను నడిపిన గతిమాన్, మాల్వా ఎక్స్‌ప్రెస్ లోకోపైలెట్లను రైల్వేశాఖ సస్పెండ్ చేసింది. ఆగ్రా కంటోన్మెంట్ సమీపంలోని జజువా, మనియా రైల్వే స్టేషన్ల మధ్య ఓ రైల్వే వంతెన పునరుద్ధరణ పనులు చేపట్టారు. దీంతో అక్కడ స్పీడ్‌ను 20 kmలకు తగ్గించారు. కానీ ఇటీవల గతిమాన్(ఢిల్లీ-యూపీ), మాల్వా ఎక్స్‌ప్రెక్స్(జమ్మూ-MP) 120kmల వేగంతో పరుగులు తీసినట్లు గుర్తించిన అధికారులు చర్యలు తీసుకున్నారు.

TG: మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని ఆ పార్టీ నేత బండి సంజయ్ అన్నారు. మరోసారి మోదీ ప్రధాని కావడం ఖాయమని చెప్పారు. తెలంగాణలో రైతులు, నిరుద్యోగుల కోసం బీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ పోరాడితే.. ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కట్టారని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ రెండవ స్థానం కోసమే ప్రయత్నిస్తోందని ఎద్దేవా చేశారు. 6గ్యారంటీలతో ప్రజల్ని మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు.

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 5 దశల పోలింగ్ ముగియగా నేడు ఆరో దశ పోలింగ్ జరగనుంది. ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. బిహార్‌లో 8, హరియాణాలో 10, జమ్ముకశ్మీర్‌లో 1, ఝార్ఖండ్‌లో 4, ఢిల్లీలో 7, ఒడిశాలో 6, UP 14, బెంగాల్‌లో 8 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. జూన్ 1న జరిగే ఆఖరి దశ పోలింగ్‌తో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. 4న ఫలితాలు వెల్లడవుతాయి.

ఐపీఎల్ చరిత్రలో అత్యధికులు సిక్సులు సమర్పించుకుని.. రాజస్థాన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ చెత్త రికార్డుని మూటగట్టుకున్నారు. సన్‌రైజర్స్‌తో నిన్న జరిగిన మ్యాచులో ఆయన రెండు సిక్సులిచ్చారు. ఓవరాల్‌గా ఐపీఎల్‌లో ఆయన 224 సిక్సులు ఇచ్చి.. మాజీ స్పిన్నర్ పీయూష్(224) పేరిట ఉన్న రికార్డును అధిగమించారు. కాగా క్వాలిఫైయర్-2 మ్యాచులో చాహల్ నిరాశపర్చారు. 4 ఓవర్లలో వికెట్ తీయకుండా 34 పరుగులు సమర్పించుకున్నారు.

Acrimony: Courtesy, Benevolence
Invective: Approval, acclamation
Jaded: Renewed, recreated
Masculine: Feminine, meek
Peevish: Suave, amiable
Outrage: Praise, favour
Tedious: Exhilarating, lively
Vilify: Cherish, Commend
Wicked: Virtuous, Noble

పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై పదేళ్లలో BJP ఏం చేసిందని కాంగ్రెస్ MP శశిథరూర్ ప్రశ్నించారు. ఎన్నికల కోసం పీవోకేపై బీజేపీ డ్రామాలు ఆడుతోందని దుయ్యబట్టారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇతర అంశాల నుంచి దృష్టి మరల్చేందుకే ఇలాంటివి తెరపైకి తెస్తున్నారని మండిపడ్డారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి సమస్యల్ని మోదీ విస్మరిస్తున్నారని అన్నారు. ఓట్ల కోసం భావోద్వేగపరమైన విషయాలను లేవనెత్తడం సరికాదని విమర్శించారు.

యూపీలో వివాహ ధ్రువీకరణ పత్రం (మ్యారేజ్ సర్టిఫికెట్) కోసం అక్కడి సర్కార్ కొత్త రూల్ తీసుకొచ్చింది. ఇక నుంచి వరకట్నం వివరాలు కూడా సమర్పిస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తామని తెలిపింది. యూపీలో మ్యారేజ్ సర్టిఫికెట్ కోసం ఇప్పటివరకు పెళ్లి కార్డు, ఆధార్ కార్డు, హైస్కూల్ మార్క్ షీట్ సమర్పించాల్సి ఉండేది. తాజాగా వరకట్నం అఫిడవిట్‌లో ఎంత కట్నం తీసుకున్నారో వెల్లడించాల్సి ఉంటుంది.

1977: తమిళ హీరో కార్తి జననం
1972: బాలీవుడ్ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహర్ జననం
1968: నటుడు రావు రమేశ్ జననం
1948: నటుడు మాదాల రంగారావు జననం
1964: తెలుగు సినిమా తొలి తరం సంగీత దర్శకుడు గాలి పెంచల రమణయ్య మరణం
2005: బాలీవుడ్ నటుడు సునీల్ దత్ మరణం
అంతర్జాతీయ తప్పిపోయిన పిల్లల దినోత్సవం
Sorry, no posts matched your criteria.