India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

నిన్న కోల్‌కతాలో కేకేఆర్, ముంబై మధ్య మ్యాచ్ వర్షం కారణంగా 16 ఓవర్లకు కుదించిన సంగతి తెలిసిందే. అసలు మొదలు కావడమే ఆలస్యమైన ఆ మ్యాచ్‌లో మళ్లీ స్ట్రాటజిక్ టైమ్ ఔట్‌లను పెట్టారు. దీంతో ఐపీఎల్ నిర్వాహకులపై ఫ్యాన్స్ నెట్టింట తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలస్యమైన మ్యాచ్‌కు మళ్లీ టైమ్ ఔట్‌లు పెట్టి ఇంకా లేట్ చేయడం ఏం సబబంటూ ప్రశ్నించారు. ఈరోజు తెల్లవారుఝాము 12.30 గంటల వరకు మ్యాచ్ సాగడం గమనార్హం.

పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆనంద్ బోస్‌కు ఆ రాష్ట్ర సీఎం మమత బెనర్జీ హెచ్చరికలు జారీ చేశారు. ‘రాష్ట్రంలో దీదీగిరి పనిచేయదని ఆయన అంటున్నారు. కానీ మీ దాదాగిరి కూడా పనిచేయదు గవర్నర్. మీరు ఉన్నంత వరకు నేను రాజ్‌భవన్‌లో అడుగు కూడా పెట్టను. మీ ప్రవర్తన సిగ్గు చేటు. లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తిన తర్వాత కూడా ఎందుకు రాజీనామా చేయట్లేదో చెప్పండి’ అని స్పష్టం చేశారు.

భారత సంస్కృతిని చూసి ఆశ్చర్యం కలిగిందని టెక్ జపాన్ వ్యవస్థాపకుడు నౌటకా నిషియామా తెలిపారు. భారత జీవనశైలిపై ఆసక్తితో గత నెలరోజులుగా ఆయన బెంగళూరులో ఉంటున్నారు. ఈక్రమంలో లింక్డ్ ఇన్‌లో తన అనుభవాలను పంచుకున్నారు. ‘భారత్‌లో వివిధ మతాలు, జాతులు ఉన్నా అందరూ కలిసి ఉండటం అద్భుతం. ప్రపంచానికి భారత నాయకత్వం అవసరం. ఇప్పటికే సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్ వంటివారు అగ్రసంస్థల్ని నడిపిస్తున్నారు’ అని పేర్కొన్నారు.

ఎన్నికల్లో ఓటు వేసిన వారికి పలు చోట్ల కొన్ని కంపెనీలు బంపరాఫర్లు ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఏపీలోని ఓ బైక్ షోరూం అలాంటి ప్రకటనే చేసింది. ఓటేసిన వారు తమ చేతికి ఉన్న సిరా చుక్కని చూపిస్తే ఫ్రీ ఆయిల్(పెట్రోల్/డీజిల్) టాప్-అప్ ఇవ్వనున్నట్లు తెలిపింది. అయితే ఎంత ఇస్తామనేది మాత్రం వెల్లడించలేదు. ఏపీలోని ఆరు చోట్ల ఈ నెల 15 వరకు ఆఫర్ అందుబాటులో ఉంటుందని పేర్కొంటూ చేసిన ఓ ప్రకటన వైరలవుతోంది.

కాబోయే భర్త తనతో నిజాయితీగా ఉండాలని బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ అన్నారు. తనతో ఎక్కువ టైమ్ గడుపుతూ.. బాగా చూసుకోవాలని చెప్పారు. ఏ విషయంలోనైనా ఆశలు పెట్టుకుంటే ఇబ్బంది పడతామన్నారు. అందుకే తాను ఎలాంటి ఆశలు పెట్టుకోనని.. ఏం జరిగినా తీసుకోవడానికి సిద్ధంగా ఉంటానని తెలిపారు. మరోవైపు ఈ అమ్మడు లండన్‌కు చెందిన వ్యాపారి కబీర్ బహియాతో వివాహానికి సిద్ధమైనట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్.

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన KKRvsMI మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై కోల్‌కతా 18 పరుగులతో విజయం సాధించింది. 16 ఓవర్లలో 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన MI 139 పరుగులకే పరిమితమైంది. ఇషాన్ కిషన్(40 రన్స్) ఒక్కరే రాణించారు. KKR బౌలర్లలో హర్షిత్ రాణా, రస్సెల్, వరుణ్ రెండేసి వికెట్లు దక్కించుకున్నారు. ఈ విజయంతో 18 పాయింట్లకు చేరిన కేకేఆర్, ఈ ఏడాది ప్లే ఆఫ్స్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది.

1895: తత్త్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి జననం
1922: ఆధ్యాత్మిక గురువు మాస్టర్ సి.వి.వి కన్నుమూత
1924: నాదస్వర విద్వాంసుడు షేక్ చిన మౌలానా జననం
1965: అంతర్జాతీయ నర్సుల దినోత్సవం మొదలు
1969: తెలుగు దర్శకుడు, నిర్మాత చంద్ర సిద్ధార్ధ జననం
1980: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ జననం
1985: భారతీయ శాస్త్రవేత్త బి. విజయలక్ష్మి మరణం
2012: ఇస్రో ‘క్రయోజెనిక్ ఇంజిన్’ ప్రయోగం విజయవంతం

తేది: మే 12, ఆదివారం
ఫజర్: తెల్లవారుజామున గం.4:27 గంటలకు
సూర్యోదయం: ఉదయం గం.5:45 గంటలకు
జొహర్: మధ్యాహ్నం గం.12:12 గంటలకు
అసర్: సాయంత్రం గం.4:41 గంటలకు
మఘ్రిబ్: రాత్రి గం.6:40 గంటలకు
ఇష: రాత్రి గం.07.58 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

తేది: మే 12, ఆదివారం
శు.పంచమి: తెల్లవారుజామున 02:04 గంటలకు
ఆరుద్ర: ఉదయం 10:26 గంటలకు
దుర్ముహూర్తం: మధ్యాహ్నం 04:44 నుంచి సాయంత్రం 05:35 వరకు
వర్జ్యం: రాత్రి 10:55 ల
Sorry, no posts matched your criteria.