India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఈడెన్ గార్డెన్స్‌లో KKRvsMI మధ్య జరగాల్సిన మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగిస్తోంది. జోరుగా వాన పడుతుండటంతో గ్రౌండ్‌ను కవర్లతో కప్పేశారు. దీంతో ఆలస్యంగా టాస్ వేయనున్నారు.

కేంద్రంలో మళ్లీ BJP ప్రభుత్వం వచ్చే అవకాశం లేదని AAP కన్వీనర్, ఢిల్లీ CM కేజ్రీవాల్ అన్నారు. BJPకి 220-230 సీట్లు వస్తాయని అంచనా వేశారు. ఈసారి INDIA కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, ఆ ప్రభుత్వంలో AAP భాగస్వామ్యమని ఆయన పేర్కొన్నారు. తాము కేంద్రంలో అధికారంలోకి వచ్చాక ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా కల్పిస్తామన్నారు. గుజరాత్‌కు చెందిన వ్యక్తి కాకుండా ఢిల్లీకి పీపుల్స్ గవర్నర్ ఉంటారని అన్నారు.

TG: ఎన్నికల ప్రచార పర్వం ముగియడంతో రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి వచ్చినట్లు డీజీపీ రవిగుప్తా వెల్లడించారు. పోలింగ్ కోసం భారీగా భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఎన్నికల విధుల్లో 73,414 మంది సివిల్ పోలీసులు, 500 స్పెషల్ పోలీసు విభాగాలు పాల్గొంటున్నాయని చెప్పారు. 164 కేంద్ర బృందాలతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. తమిళనాడు నుంచి 3 స్పెషల్ ఆర్మ్ డ్ బృందాలు వచ్చాయన్నారు.

సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటును కేంద్రం ప్రోత్సహిస్తున్నా క్షేత్రస్థాయిలో నిర్వహణ లోపం, జాప్యం, నైపుణ్య కొరత సవాళ్లుగా మారుతున్నాయి. 2022కి 40 గిగావాట్ల కెపాసిటీతో రూఫ్‌టాప్స్ ఏర్పాటు చేయాలని 2015లో కేంద్రం భావిస్తే, గత ఏడాదికి 11 గిగావాట్లే ఏర్పాటయ్యాయి. ఈ టార్గెట్ ఇప్పుడు 2026కి 100 GWకు పెంచింది. ఇక పలు ప్రాంతాల్లో మినిమమ్ ఛార్జ్ పేరుతో డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు నెలకు రూ.500 వసూలు చేస్తున్నాయట.

యాపిల్ ‘ఐప్యాడ్-ప్రొ’ యాడ్‌పై ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మ్యూజిక్ పరికరాలు, బుక్స్, పెయింటింగ్స్, స్పీకర్స్, గేమింగ్ డివైజ్‌లను క్రాష్ చేస్తూ ఉన్న ఆ ప్రకటనపై మండిపడుతున్నారు. ఇప్పటికే సెలబ్రెటీలు హ్యూ గ్రాంట్, జస్టిన్ బాట్‌మాన్, ఆసిఫ్ కపాడియా, ల్యూక్ బార్నెట్ యాపిల్‌పై విమర్శలు చేయగా, తాజాగా హృతిక్ రోషన్ ఆ జాబితాలో చేరారు. యాపిల్ ప్రకటన విచారకరం, అజ్ఞానమని ఇన్‌స్టాలో పోస్టు చేశారు.

‘సాధారణ కరెంట్ వాడినందుకు యూనిట్‌కు రూ.8 ఛార్జ్ చేస్తున్నారు. సౌర విద్యుత్ ఎక్కువ ఉత్పత్తి అయితే రూ.1.5నే చెల్లిస్తున్నారు’ అని ఓ వినియోగదారుడు తెలిపారు. సబ్సిడీలో సోలార్ రూఫ్‌టాప్స్‌కు బ్యాటరీ ఏర్పాటు చేసుకునే ఛాన్స్ లేదు. దీంతో కరెంటు కోతలు ఉన్న ప్రాంతాల్లో సోలార్ రూఫ్‌టాప్స్ ఎక్కువసేపు పనిచేయలేకపోతున్నాయట. వీటి తయారీ/ఏర్పాటుపై వర్కర్లకు తగిన ట్రైనింగ్ కూడా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

ప్రధాని మోదీ చాలామంది నేతల రాజకీయ జీవితాలకు ముగింపు పలికారని ఢిల్లీ CM కేజ్రీవాల్ ఆరోపించారు. LK.అడ్వాణీ, మురళీ మనోహర్ జోషీ, సుమిత్రా మహాజన్, శివరాజ్‌సింగ్ చౌహాన్ విషయాల్లో చేసినట్లే UP CM యోగి ఆదిత్యనాథ్ రాజకీయ జీవితానికీ మోదీ ముగింపు చెబుతారని జోస్యం చెప్పారు. మోదీ తర్వాతి టార్గెట్ యోగినే అని కేజ్రీవాల్ అన్నారు. ఈసారి BJP గెలిస్తే 2నెలల్లో యోగిని భర్తీ చేస్తారని తాను రాసిస్తానని సవాల్ చేశారు.

రిషబ్ పంత్‌పై ఒక మ్యాచ్ సస్పెన్షన్ పడటంతో తమ జట్టు కెప్టెన్‌గా అక్షర్ పటేల్‌ను ఎంపిక చేస్తున్నట్లు DC యాజమాన్యం ప్రకటించింది. రేపు RCBతో జరిగే మ్యాచ్‌లో జట్టును అక్షర్ నడిపిస్తారని వెల్లడించింది. కాగా స్లో ఓవర్ రేటు కారణంగా రిషబ్ పంత్‌పై ఒక్క మ్యాచ్ సస్పెన్షన్‌తో పాటు రూ.30లక్షల ఫైన్ విధిస్తూ ఐపీఎల్ గవర్నింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది.

TG: రాష్ట్రంలో ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా జరిపిన సోదాల్లో రూ.320 కోట్ల సొత్తు సీజ్ చేసినట్లు సీఈవో వికాస్ రాజ్ వెల్లడించారు. 48 గంటల్లో వచ్చే ఫిర్యాదులపై సత్వరమే చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోలింగ్ దగ్గర పడటంతో నిఘా మరింత పెరుగుతుందని తెలిపారు. ఎల్లుండి రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలకు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది.

దేశంలో నాలుగో విడత ఎన్నికల ప్రచారం ముగిసింది. దీంతో పోలింగ్ జరిగే రాష్ట్రాల్లో 144 సెక్షన్ అమలులోకి వచ్చింది. బల్క్ SMSలు సైతం పంపించవద్దని ఈసీ సూచించింది. నియోజకవర్గాల్లో స్థానికేతరులు ఉండవద్దని ఆదేశించింది. మే 13న పోలింగ్, జూన్ 4న ఫలితాలు రానుండగా.. జూన్ 1 సాయంత్రం 6.30గంటల వరకు ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం ఉంటుందని తెలిపింది. సెలవు ఇవ్వని సంస్థలపై చర్యలు ఉంటాయని పేర్కొంది.
Sorry, no posts matched your criteria.