India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

భారతీయుల పట్ల కాంగ్రెస్ నేతలు జాతి వివక్ష వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రధాని మోదీ మండిపడ్డారు. ‘కాంగ్రెస్ రాకుమారుడి గురువు మనల్ని ఆఫ్రికన్లు అని మాట్లాడారు. దేశాన్ని విభజించి పాలించాలనేది కాంగ్రెస్ కుట్ర. శ్రీరామనవమి జరుపుకోవడం కూడా తప్పే అన్నట్లు వారు మాట్లాడుతున్నారు. రాముడిని పూజించడం దేశద్రోహమా? బుద్ధం శరణం గచ్చామి ఇండియా సిద్ధాంతం. అహింసో పరమోధర్మో అనేది భారత్ సిద్ధాంతం’ అని స్పష్టం చేశారు.

పునరుత్పాదక శక్తికి పెరుగుతున్న డిమాండే ఈ సోలార్ స్టాక్స్ వృద్ధికి కారణమనేది నిపుణుల మాట. వారీ రెన్యూవబుల్ ఏడాదిలో 1318% రిటర్న్స్ ఇస్తే తర్వాతి స్థానాల్లో WAA సోలార్ (561%), జోడియాక్ ఎనర్జీ (393%), SJVN (236%), KP ఎనర్జీ (214%), అదానీ పవర్ (154%) ఉన్నాయి. 2030కి 340 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి సాధనకు కేంద్రం చర్యలు చేపడుతున్న నేపథ్యంలో ఈ ‘సోలార్’ డిమాండ్ కొనసాగుతుందంటున్నారు నిపుణులు.

దేశీయ స్టాక్ మార్కెట్లలో సోలార్ స్టాక్స్ దూసుకెళ్తున్నాయి. ఏడాది వ్యవధిలో వారీ రెన్యూవబుల్ అనే సంస్థ షేర్లు ఏకంగా 1,318% పెరిగాయి. గత నాలుగేళ్లలో అయితే 49,900% పెరిగింది. 2020లో కనిష్ఠంగా రూ.5కు పడిపోయిన షేర్ విలువ ఇప్పుడు రూ.2,600కు చేరింది. అప్పుడు రూ.100 కోట్లు ఉన్న మార్కెట్ క్యాప్ ఇప్పుడు రూ.27వేల కోట్లకు చేరింది. దేశీయ, విదేశీ సంస్థాగత పెట్టుబడుల ప్రమేయం లేకుండానే ఈ వృద్ధి సాధించడం విశేషం.

దేశాన్ని లూటీ చేయడమే కాంగ్రెస్ ట్రాక్ రికార్డు అని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. ‘కాంగ్రెస్ పాలనలో HYDలో ఎన్నో చోట్ల బాంబు పేలుళ్లు జరిగాయి. దిల్‌సుఖ్‌నగర్ సాయిబాబా గుడి వద్ద బాంబు పేలింది. వారి పాలనలో పార్కు, గుడికి వెళ్లాలన్నా, బస్సు ఎక్కాలన్నా భయపడాల్సిన పరిస్థితి ఉండేది. కానీ NDAలో ఇలాంటివి ఎప్పుడైనా వినిపించాయా? గత పదేళ్లలో ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపించాం’ అని HYD సభలో వెల్లడించారు.

ఎవరి ఊహకూ అందని విధంగా చంద్రుడిపై రైల్వే స్టేషన్‌ను నిర్మించేందుకు నాసా ప్లాన్ చేస్తోంది. చంద్రుడి ఉపరితలంపై సమర్థవంతమైన రవాణా అందించేలా పూర్తిస్థాయిలో పనిచేసే మొదటి రైల్వే స్టేషన్‌ను నిర్మించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈ రైలు భూమిపై నడిచే దానికంటే కొంచెం భిన్నంగా ఉంటుందని తెలిపింది. చంద్రుడిపైకి వెళ్లేందుకు వివిధ దేశాలు ఆసక్తి చూపుతుండటంతో నాసా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా సిబ్బంది కాల్పుల్లో పది మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా ఇటీవల పలు ఎన్‌కౌంటర్లలో పెద్ద సంఖ్యలో మావోలు మరణించిన విషయం తెలిసిందే.

‘హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, చేవెళ్ల, భువనగిరి నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం’ అంటూ HYD LB స్టేడియంలో ప్రధాని మోదీ తొలుత తెలుగులో ప్రసంగించారు. ‘కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం వద్దని తెలంగాణ అంటోంది. బీజేపీకి మాత్రమే ఓటు వేస్తామంటోంది. తెలంగాణకు ఉజ్వల భవిష్యత్ ఇచ్చేందుకు బీజేపీ కట్టుబడి ఉంది. జూన్ 4న దేశం గెలుస్తుంది. శత్రువులు ఓడిపోతారు’ అని ధీమా వ్యక్తం చేశారు.

3 నైట్ షిఫ్టులు చేసినా డయాబెటిస్ ముప్పు గణనీయంగా పెరుగుతుందని అమెరికాలోని వాషింగ్టన్ స్టేట్ వర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. ‘రాత్రుళ్లు పనిచేయడం వలన రక్తంలోని గ్లూకోజ్ స్థాయుల్ని నియంత్రించే ప్రొటీన్ల పనితీరు అస్తవ్యస్తమవుతుంది. శరీరం పనితీరు దెబ్బ తిని మధుమేహం తలెత్తుతుంది. మనలో ఉండే బయోలాజికల్ క్లాక్ నియంత్రణ కోల్పోయి దీర్ఘకాలిక అనారోగ్యాలకు దారి తీస్తుంది’ అని తమ నివేదికలో వారు తెలిపారు.

ఒక ఈవీఎంలో 16 బటన్లు ఉంటాయి. నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల సంఖ్యను బట్టి వీటిని ఉపయోగిస్తారు. ఉదాహరణకు ఒక నియోజకవర్గంలో కేవలం 10 మందే బరిలో ఉంటే వారికి ఒకటి నుంచి పది వరకు బటన్లు కేటాయిస్తారు. మిగిలిన బటన్లను పనిచేయకుండా అధికారులు లాక్ చేస్తారు. అలాగే బ్యాలెట్ యూనిట్‌లోని బటన్‌ను ఒకసారి నొక్కిన వెంటనే మీ ఓటు నమోదవుతుంది. ఆ వెంటనే ఈవీఎం లాక్ అవుతుంది. మళ్లీ ఎన్నిసార్లు నొక్కినా ఓటు తీసుకోదు.

తెలుగు సినిమాల్లో నటించడం తనకు కష్టమని హీరోయిన్ సంయుక్త మీనన్ తాజాగా పేర్కొన్నారు. మలయాళ సినిమాలు చేయడమే సులువన్నారు. ‘తెలుగు భాష రాకపోవడం ఒక కారణం కాగా.. మేకప్ భారీగా వేసుకోవాల్సి రావడం మరో ఇబ్బంది. మలయాళ సినిమాల్లో మేకప్ తక్కువ. కానీ తెలుగు సినిమాలకు చాలా మేకప్ వేస్తారు. అసౌకర్యంగా ఉంటుంది. ప్రతిసారీ చెక్ చేసుకుంటూ ఉండాలి. ముఖంపై ఏదో బరువు ఉన్నట్లు అనిపిస్తుంది’ అని పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.