News April 28, 2024

ఆరోపణలను కొట్టిపారేసిన MDH మసాలా

image

తమ ఉత్పత్తుల్లో పురుగుమందు ఆనవాళ్లు ఉన్నట్లు సింగపూర్, హాంకాంగ్ చేసిన ఆరోపణలను మసాలా దినుసుల కంపెనీ MDH ఖండించింది. అందులో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఆరోపణలకు రుజువు లేదని పేర్కొంది. మరోవైపు ఎవరెస్ట్ కంపెనీ మాత్రం తమ ఫుడ్ ప్రొడక్ట్స్ సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ పరిశీలనలో ఉన్నట్లు తెలిపింది.

News April 28, 2024

నేను తలచుకుంటే అందరూ జైలుకే: రేవంత్

image

TG: తాను తలచుకుంటే ఎవరూ బయట తిరగలేరని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘నేను పోలీస్ రాజ్యం నడపను. రేవంత్ అనే పదం కొందరికి లైఫ్ లైన్‌గా మారింది. టెలిఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరుగుతోంది. అది ఎక్కడికెళ్లి ఆగుతుందో తెలియదు. నివేదిక వచ్చిన తర్వాత పూర్తి వివరాలు చెబుతాం. BJP నేతల మాటల్లోనే భయం కనిపిస్తోంది. నేను పాలనపై దృష్టి పెడుతుంటే ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేస్తున్నారు’ అని ఆయన ఫైర్ అయ్యారు.

News April 28, 2024

బరాబర్ గుంపు మేస్త్రీనే: రేవంత్

image

TG: తాను బరాబర్ గుంపు మేస్త్రీనే అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘KCRలాగా చిల్లర పనులు చెయ్యను. నా కూతురు పెళ్లికి నన్ను కేసీఆర్ జైల్లో పెడితే.. ఆయన కూతురు కవిత ఇప్పుడు జైల్లో ఉంది. కేసీఆర్‌లాగా నేను పోలీసులను వాడను. ఆయన సలహాలిస్తానంటే ఇంటికెళ్లి కలుస్తా. పదేళ్లు సీఎం పదవి మాదే. ఏ ఎమ్మెల్యేను పార్టీలోకి రావాలని నేను కోరలేదు. వారే స్వయంగా పార్టీలోకి వచ్చారు’ అని ఆయన పేర్కొన్నారు.

News April 28, 2024

ఎల్లుండి మేనిఫెస్టో ప్రకటన: పవన్ కళ్యాణ్

image

AP: ఎన్డీఏ మేనిఫెస్టోను ఎల్లుండి ప్రకటించనున్నట్లు JSP అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. TDP-JSP-BJP కూటమికి ఓటు వేయకపోతే ప్రజలకే నష్టం అని అన్నారు. ‘PM మోదీ దగ్గర ఏదైనా మాట్లాడాలంటే జగన్‌కు భయం. ఆయన దగ్గరకు వెళ్లి కేసులు కొట్టేయాలని కోరుతారు. నాకు అవినీతి చేయాల్సిన అవసరం లేదు. మోదీతో నేను ధైర్యంగా మాట్లాడగలను. కష్టాల్లో ఉన్న రైతుల కన్నీరు తుడవడమే నాకు ఆనందం’ అని ఏలేశ్వరం సభలో వ్యాఖ్యానించారు.

News April 28, 2024

జాక్స్ కొడుతుంటే.. కోహ్లీ రియాక్షన్ ఇది!

image

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరోసారి తన మార్క్ ప్రదర్శన చేసింది. విల్ జాక్స్ సెంచరీతో వీరవిహారం చేయగా.. కోహ్లీ హాఫ్ సెంచరీతో తనదైన ఇన్నింగ్స్ ఆడారు. దీంతో 201పరుగుల లక్ష్యాన్ని కేవలం 96బంతుల్లోనే RCB చేరుకుంది. ఈ మ్యాచ్‌లో విల్ జాక్స్ కొట్టిన షాట్లను విరాట్ కోహ్లీ ఎంజాయ్ చేస్తూ కనిపించారు. ముఖ్యంగా టీ20 స్పెషలిస్టు రషీద్‌ఖాన్ బౌలింగ్‌లో కొట్టినప్పుడు కోహ్లీ ఫేస్‌లో హావభావాలు వైరల్ అవుతున్నాయి.

News April 28, 2024

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న SRH

image

CSKతో మ్యాచ్‌లో టాస్ గెలిచిన SRH బౌలింగ్ ఎంచుకుంది.
SRH: అభిషేక్‌శర్మ, హెడ్, మార్ర్కమ్, క్లాసెన్, నితీశ్, సమద్, షాబాజ్, కమిన్స్, ఉనద్కత్, భువనేశ్వర్, నటరాజన్. (IMP: ఉమ్రాన్, మార్కండే, సుందర్, ఫిలిప్స్, అన్మోల్‌ప్రీత్)
CSK: రుతురాజ్, రహానే, మిచెల్, మొయిన్ అలీ, దూబే, జడేజా, ధోనీ, దీపక్ చాహర్, తుషార్, ముస్తాఫిజుర్, పతిరన. (IMP: షేక్ రషీద్, సాంట్నర్, రచిన్ రవీంద్ర, శార్దూల్, సమీర్ రిజ్వీ)

News April 28, 2024

దుబాయ్‌లో అతిపెద్ద విమానాశ్రయం.. త్వరలో నిర్మాణం

image

దుబాయ్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్‌పోర్టు నిర్మాణం కానుంది. ఈ ప్రాజెక్టు కోసం ₹2.9లక్షల కోట్లు ఖర్చు చేయనున్నారు. దీనిని అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయంగా పిలవనున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. 5 సమాంతర రన్‌వేలు, 400 ఎయిర్‌క్రాఫ్ట్ గేట్‌లను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న దాని కంటే కొత్తది 5 రెట్లు పెద్దగా ఉండనుందట. ఏడాదికి 260M మంది ప్రయాణించేలా నిర్మిస్తున్నారట.

News April 28, 2024

జాక్స్ సెంచరీ.. RCB ఘన విజయం

image

గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. 201 పరుగుల లక్ష్యంతో చేధనకు దిగిన RCB 16 ఓవర్లలోనే కేవలం 1 వికెట్ నష్టానికి టార్గెట్‌ని చేరుకుంది. విల్ జాక్స్(100*), కోహ్లీ(70*) వీర విహారం చేశారు. ఈ మ్యాచ్‌లో జాక్స్ 10 సిక్సర్లు బాదారు. ఈ సీజన్‌లో 10 మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీకి ఇది 3వ విజయం. ఈ గెలుపుతో ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంచుకుంది.

News April 28, 2024

రేపు ఈ ప్రాంతాల్లో వడగాలులు: APSDMA

image

AP: రేపు 47 <>మండలాల్లో<<>> తీవ్ర వడగాలులు, 151 మండలాల్లో వడగాలులు వీస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఎల్లుండి 61 మండలాల్లో తీవ్ర వడగాలులు, 159 మండలాల్లో వడగాలులు వీస్తాయని తెలిపింది. ఇవాళ 68 మండలాల్లో తీవ్ర వడగాలులు,120 మండలాల్లో వడగాలులు వీచాయని పేర్కొంది. ప్రజలు ఉ.11 నుంచి సా.4 వరకు ఇంట్లోనే ఉండాలని, ఎండదెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలని సూచించింది.

News April 28, 2024

సీబీఎస్ఈ 10th, 12th రిజల్ట్స్ వచ్చేది అప్పుడేనా?

image

సీబీఎస్ఈ 10, 12వ తరగతి ఫలితాలు మే రెండో వారం నాటికి విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. గత ఏడాది మే 12న ఫలితాలను ప్రకటించారు. ఈ ఏడాది కూడా దాదాపు అదే సమయానికి రిజల్ట్స్ రావొచ్చని పలు జాతీయ మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. మే తొలి వారంలో టెన్త్, రెండో వారంలో 12th ఫలితాలు వస్తాయని అంచనా వేస్తున్నాయి. కాగా ఫలితాల విడుదలపై ఇప్పటివరకు బోర్డు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.