India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

క్రికెట్‌లో పసికూన నేపాల్ సంచలనం సృష్టించింది. జాన్సన్ ఛార్ల్స్, ఆండ్రే ఫ్లెచర్, రోస్టన్ ఛేజ్ వంటి ఆటగాళ్లున్న విండీస్ జట్టును ఓడించింది. వెస్టిండీస్-ఏ జట్టు ప్రస్తుతం 5 టీ20 మ్యాచుల సిరీస్ కోసం నేపాల్‌లో పర్యటిస్తోంది. ఈరోజు తొలి మ్యాచ్ జరగగా విండీస్ 204 పరుగులు(రోస్టన్-74 రన్స్) చేసింది. ఛేదనలో మరో 2 బంతులు మిగిలుండగానే నేపాల్ ఆ స్కోరును దాటేసింది. రోహిత్ పౌడెల్ 54 బంతుల్లో సెంచరీ చేశారు.

TG: ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల తేదీల్లో మార్పులు చేస్తూ ఇంటర్ బోర్డు ప్రకటన చేసింది. మే 24 జూన్ 1 వరకు ఉన్న పరీక్షల తేదీలను మే 24 నుంచి జూన్ 3వ తేదీ వరకు మార్చింది. మే 27న నల్గొండ-ఖమ్మం-వరంగల్ MLC ఉప ఎన్నిక నేపథ్యంలో షెడ్యూల్‌లో మార్పులు చేసింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఫస్టియర్.. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు సెకండియర్ పరీక్షలు నిర్వహిస్తారు.

☞ మే 24- సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1/పేపర్-2
☞ మే 25- ఇంగ్లిష్ పేపర్-1,2
☞ మే 28- మ్యాథ్స్ 1A,2A/బోటనీ/PS పేపర్-1, 2
☞ మే 29- మ్యాథ్స్ 1B,2B/జువాలజీ/హిస్టరీ పేపర్-1,2
☞ మే 30- ఫిజిక్స్, ఎకనామిక్స్ పేపర్-1,2
☞ మే 31- కెమిస్ట్రీ, కామర్స్ పేపర్-1,2
☞ జూన్ 1- పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేపర్-1,2
☞ జూన్ 3- మోడ్రన్ లాంగ్వేజ్, జియోగ్రఫీ పేపర్-1, 2

ఒకానొక సమయంలో సూసైడ్ చేసుకోవాలనుకున్నానని అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘1972లో ఓ కారు ప్రమాదంలో నా భార్య, కుమార్తె కన్నుమూశారు. దాంతో మద్యానికి పూర్తిగా బానిసైపోయాను. నదిలోకి దూకాలన్న పిచ్చి ఆలోచనలు వచ్చేవి. కానీ నా ఇద్దరు కుమారులు గుర్తొచ్చి ఆగిపోయేవాడిని’ అని వెల్లడించారు. 1977లో జిల్ బైడెన్‌ను పెళ్లి చేసుకున్న జో, అప్పటి నుంచి ఆమెతో వైవాహిక బంధంలో కొనసాగుతున్నారు.

BJP నేత, కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఓటు వేయకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఆయన కేరళలోని తిరువనంతపురం నుంచి MPగా పోటీ చేస్తున్నారు. ఆయనకు బెంగళూరులో ఓటు హక్కు ఉంది. ఈ రెండుచోట్లా నిన్న పోలింగ్ జరిగింది. కాగా తాను తిరువనంతపురంలో ఉండటానికే ప్రాధాన్యం ఇచ్చానని, ఓటు వేయలేదని చెప్పారు. దీంతో బాధ్యత గల పదవిలో ఉండి ఓటు వేయకపోవడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో 258 రన్స్ భారీ లక్ష్యంతో ఛేదనకు దిగిన ముంబై ఇండియన్స్‌కు ఓటమి ఎదురైంది. బ్యాటర్లు పెద్ద స్కోర్లు చేయలేదు. దీంతో 20ఓవర్లలో 247 రన్స్‌కే పరిమితమైంది. తిలక్‌వర్మ(63) పోరాడినా ప్రయోజనం లేకపోయింది. కెప్టెన్ హార్దిక్(46), టిమ్ డేవిడ్(37), సూర్యకుమార్(26), ఇషాన్(20) ఫరవాలేదనిపించారు. ఢిల్లీ బౌలర్లలో ముకేశ్ 3, ఖలీల్ 2, రసిక్ 3 వికెట్లు తీశారు. ఇది MIకి 6వ ఓటమి.

ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా ప్రధాని మోదీ విమర్శల వర్షం గుప్పించారు. ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏడాదికో వ్యక్తి ప్రధానిగా ఉంటారని మోదీ ఎద్దేవా చేశారు. దక్షిణ భారత్‌ను ప్రత్యేక దేశంగా చేయాలంటారని ఆరోపించారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ కూటమికి మూడంకెల సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు వ్యతిరేకమని అన్నారు.

కొంతమంది చికెన్ అంటే కడుపు నిండా లాగిస్తారు. కానీ సమ్మర్‌లో చికెన్‌ను అతిగా తినకూడదని నిపుణులు చెబుతున్నారు. చికెన్ తినడం వల్ల పలు రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని పేర్కొంటున్నారు. రోజూ చికెన్ తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఒంట్లో హీట్ ఎక్కువై తలనొప్పి, కళ్ల మంటలు, బీపీ, డీహైడ్రేషన్, కండరాల నొప్పులు వంటి సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది. వారానికి ఒక సారి తింటే ఫర్వాలేదని చెబుతున్నారు.

APలో సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తైంది. 25 MP స్థానాలకు 686 నామినేషన్లు దాఖలవగా.. 503 నామినేషన్లను ఆమోదించిన అధికారులు 183 తిరస్కరించారు. అటు 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు 3644 నామినేషన్లు దాఖలవగా.. 2705 నామినేషన్లకు ఆమోదం తెలిపి, 939 తిరస్కరించారు. ఎల్లుండి వరకు నామినేషన్లు ఉపసంహరించుకునే గడువు ఉండగా.. ఆ తర్వాత తుది అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు.

లక్నోలో LSGతో జరుగుతున్న మ్యాచ్‌లో RR టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
LSG జట్టు: డికాక్, రాహుల్, స్టొయినిస్, హుడా, పూరన్, బదోనీ, కృనాల్, హెన్రీ, బిష్ణోయ్, మోహ్సీన్, యశ్ థాకూర్
RR జట్టు: యశస్వి, బట్లర్, సంజూ, హెట్మయిర్, పావెల్, జురెల్, అశ్విన్, బౌల్ట్, ఆవేశ్, సందీప్, చాహల్
Sorry, no posts matched your criteria.