India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

AP: సీఎం జగన్ సిద్ధం బస్సు యాత్ర నిన్నటితో ముగిసింది. ఇవాళ నామినేషన్ వేసిన జగన్.. మలి విడత ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఈనెల 27 లేదా 28న ప్రచారం ప్రారంభం కానుంది. పోలింగ్ జరిగే నాటికి 15 రోజుల్లో 45 నియోజకవర్గాల్లో పర్యటించేలా వైసీపీ రోడ్ మ్యాప్ సిద్ధం చేసింది.

నేటి SRHvsRCB మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సీజన్‌లో ఇప్పటికే ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 287 రన్స్ చేసింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ నమోదు చేసింది. ఇదే సీజన్‌లో ముంబైపై 277, ఢిల్లీపై 266 రన్స్ చేయడంతో SRH బ్యాటింగ్ విధ్వంసం చూసి ప్రత్యర్థుల వెన్నులో వణుకు మొదలైంది. ఈరోజు RCBపై SRH ఎంత స్కోర్ చేస్తుందని మీరు భావిస్తున్నారు? కామెంట్ చేయండి.

కాంగ్రెస్ ప్రజల సొమ్మును లాక్కొంటుందని ఆ పార్టీ మేనిఫెస్టో సూచిస్తోందని ప్రధాని మోదీ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే స్పందించారు. ‘మీ సలహాదారులు మీకు తప్పుడు సమాచారం ఇస్తున్నారు. పూర్తిగా విషయం అర్థం చేసుకోకుండా కొన్ని పదాలు వాడి సమాజంలో విభేదాలు తేవడం మీకు అలవాటు అయిపోయింది. టైమ్ కేటాయిస్తే నేనే స్వయంగా మీకు మేనిఫెస్టో వివరిస్తాను’ అని మోదీకి లేఖ రాశారు.

TG: శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఆయన బీఆర్ఎస్‌కు గుడ్ బై చెప్పనున్నట్లు సమాచారం. తాజాగా నల్గొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి ఆయనను కలిశారు. ఎంపీ ఎన్నికల్లో తనకు మద్దతు తెలపాలని గుత్తాను కోరారు. కాగా తొలుత సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి.. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ గూటికి చేరుకోనున్నట్లు టాక్.

TG: రాష్ట్రంలో ఎక్కడ చూసినా ‘కాంగ్రెస్ హామీల అమలు’ గురించే చర్చ. నేతలైతే రాజీనామాల సవాళ్లు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేస్తే రాజీనామా చేస్తామని ఓవైపు BRS నేతలు సవాల్ విసురుతుంటే.. అమలు చేసి చూపిస్తామని కాంగ్రెస్ నేతలు సైతం ప్రతిసవాళ్లు చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే హామీల అమలు అంత కష్టమైందా? అసలు సాధ్యమేనా? అనే సందేహం చాలామందిలో నెలకొంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.

వేసవి మండిపోతోంది. బయటికెళ్తే చాలు కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే ఇక మే నెలలో పరిస్థితేంటోనన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది ఎండలు మండిపోతాయని ఐక్యరాజ్యసమతి వాతావరణ విభాగం ముందే చెప్పింది. గత ఏడాది మొదలైన ఎల్‌నినోయే దీనిక్కారణమని వివరించింది. ‘పసిఫిక్’పై ఉష్ణోగ్రతలు పెరగడమే ఎల్‌నినో. అయితే, మే చివరికల్లా వానలు వచ్చేస్తాయని నిపుణులు చెబుతుండటం కొంచెం ఊరటనిచ్చే అంశం.

AP: ప్రముఖ గీత రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆయన విజయవాడ సెంట్రల్ నుంచి ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశారు. సినిమాల్లో 600కు పైగా పాటలు రాసిన జొన్నవిత్తుల.. పేరడీ సాంగ్స్‌తో మరింత పాపులర్ అయ్యారు. గతంలో ఆయన బీజేపీలో చేరి, ఆ తర్వాత బయటికొచ్చారు.

బోర్న్‌విటా తర్వాత మరో మాల్టెడ్ మిల్క్ పౌడర్ ‘హెల్త్ డ్రింక్’ ట్యాగ్ కోల్పోయింది. హార్లిక్స్‌కు ‘హెల్త్’ ట్యాగ్‌ను తొలగిస్తున్నట్లు హిందుస్థాన్ యూనిలివర్ వెల్లడించింది. తమ ఉత్పత్తుల్లోని ‘హెల్త్ ఫుడ్ డ్రింక్స్’ కేటగిరీని ‘ఫంక్షనల్ న్యూట్రీషనల్ డ్రింక్స్’గా మారుస్తున్నట్లు తెలిపింది. డ్రింక్స్, బెవరేజెస్‌ను హెల్తీ డ్రింక్స్ కేటగిరీ నుంచి తొలగించాలన్న కేంద్రం ఆదేశాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించిన ‘టిల్లు స్క్వేర్’ రేపు ఓటీటీలోకి రానుంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ సూపర్ హిట్ టాక్‌తో రూ.100కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు విజయ్ దేవరకొండ నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ కూడా రేపటి నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది.

నెల్లూరు(D) ఆత్మకూరులో రాజకీయం రసవత్తరంగా మారింది. ఇక్కడ కాంగ్రెస్ 8సార్లు నెగ్గగా.. టీడీపీ గెలిచింది రెండు సార్లే. స్వతంత్రులు 3సార్లు గెలిచారు. 2014, 19, 2022(బైపోల్) ఎన్నికల్లో YCP గెలిచింది. నియోజకవర్గంపై పట్టు నిలుపుకోవాలని YCP అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి యత్నిస్తున్నారు. ఎలాగైనా ఇక్కడ టీడీపీ జెండా ఎగరేయాలని టీడీపీ పట్టుదలతో ఉంది. సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డిని బరిలోకి దింపింది.
<<-se>>#ELECTIONS2024<<>>
Sorry, no posts matched your criteria.