News April 25, 2024

ఇంకా ప్లేఆఫ్స్ రేసులో RCB?

image

ఈ సీజన్‌లో ఆర్సీబీ వరుస ఓటములతో చతికిలపడినా ఇంకా ప్లేఆఫ్స్ అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపై అన్ని మ్యాచ్‌ల్లోనూ భారీ తేడాతో గెలిస్తే 14 పాయింట్లు సాధిస్తుంది. అదే సమయంలో టేబుల్ టాప్‌లో ఉన్న RR, KKR, SRH తమపై మినహా అందరిపై గెలవాలి. PBKS, DC, CSK, GT, LSG, MI జట్లు ఎక్కువ మ్యాచ్‌లు గెలవకూడదు. ఇలా జరిగితే RCBకి ప్లేఆఫ్స్ అవకాశాలు ఉండొచ్చు. ఇవన్నీ జరిగినా ఇతర జట్ల ఫలితాలపై ఆధార పడక తప్పదు

News April 25, 2024

ఎన్నికల బరిలో పంజాబ్ వేర్పాటువాది!

image

వేర్పాటువాది, వారిస్ పంజాబ్ దే గ్రూపు అధినేత అమృత్‌పాల్ సింగ్ పార్లమెంట్ ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేయనున్నారు. ఖదూర్ సాహిబ్ నుంచి బరిలో ఉంటారని అతని లాయర్ తెలిపారు. ప్రస్తుతం అమృత్‌పాల్ జైలులో ఉన్నాడు. గతేడాది ఫిబ్రవరిలో తన గ్రూప్‌కి చెందిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయడంతో అంజాలా పోలీస్ స్టేషన్‌పై అతను దాడి చేశాడు. కాగా పంజాబ్‌లోని 13 ఎంపీ స్థానాలకు జూన్ 1న పోలింగ్ జరగనుంది.

News April 25, 2024

చెల్లెలి పుట్టుక పైనా విమర్శలా?: చంద్రబాబు

image

AP: చెల్లెలిని నీచంగా విమర్శించే వ్యక్తి ముఖ్యమంత్రా? అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ‘తోడబుట్టిన చెల్లెలి పుట్టుక పైనా.. మహాలక్ష్మీగా భావించే ఇంటి ఆడబిడ్డ కట్టుకున్న చీరపైనా విమర్శలు చేసేవాడు ఒక ముఖ్యమంత్రా? ఎంత నీచం! ఇది కాదా వికృత మనస్తత్వం?’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. కాగా పులివెందుల సభలో వీళ్లా వైఎస్సార్ వారసులు అంటూ షర్మిల, సునీతలపై సీఎం జగన్ విమర్శలు చేశారు.

News April 25, 2024

సతీశ్‌‌ను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు

image

AP: విజయవాడలో సీఎం జగన్‌పై రాయి దాడి ఘటనలో ప్రధాన నిందితుడు సతీశ్‌ని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. న్యాయవాది సమక్షంలో పోలీసులు అతణ్ని విచారిస్తున్నారు. సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సతీశ్‌ను మూడు రోజుల పాటు ఉదయం 10 నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలీసులు విచారించనున్నారు. కాగా నిన్న సతీశ్‌ను పోలీసు కస్టడీకి ఇస్తూ విజయవాడ ప్రిన్సిపల్, సివిల్, మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు.

News April 25, 2024

రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర: CM రేవంత్

image

రాజ్యాంగంపై బీజేపీ ఆఖరి యుద్ధం ప్రకటించిందని సీఎం రేవంత్ అన్నారు. ‘ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ల రద్దుకు బీజేపీ కుట్ర చేస్తోంది. ఇందుకు సంబంధించిన బిల్లును ఆమోదింపజేసేందుకు 400 సీట్లు కావాలని అడుగుతోంది. RSS అజెండాను ఆ పార్టీ అమలు చేస్తోంది. రాజ్యాంగం కల్పించిన హక్కును కాలరాయాలని చూస్తోంది. రిజర్వేషన్లు వద్దనుకుంటే బీజేపీకి ఓటు వేయాలి. బీజేపీ ఎంతటి దురాగతానికైనా పాల్పడుతుంది’ అని ఫైరయ్యారు.

News April 25, 2024

అయోధ్య ఆలయానికి వెళ్లనున్న రాహుల్, ప్రియాంక?

image

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంకా గాంధీ అయోధ్య బాలరాముడి దర్శనానికి వెళ్లనున్నట్లు ప్రచారం జరుగుతోంది. యూపీలోని అమేథీ నుంచి రాహుల్, రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారని సమాచారం. ఈ రెండు స్థానాలకు నామినేషన్ గడువు మే 3వ తేదీతో ముగియనుండగా, నామినేషన్‌కు రెండు రోజుల ముందు వారిద్దరూ అయోధ్య రామున్ని దర్శించుకోనున్నారట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

News April 25, 2024

SRH ఆటపై పాక్ దిగ్గజం విస్మయం

image

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ ఆటతీరుపై పాక్ క్రికెట్ దిగ్గజం వసీమ్ అక్రమ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. నమ్మశక్యంకాని స్థాయిలో హైదరాబాద్ ఆడుతోందన్నారు. ‘నేను ఈతరంలో క్రికెట్ ఆడనందుకు దేవుడికి థాంక్స్. 20 ఓవర్లలో 270 పరుగులా? వన్డేల్లో ఇది 500తో సమానం. పైగా పలుమార్లు ఇదే రీతిలో బాదేశారు ఆ జట్టు ఆటగాళ్లు. తొలి 5 ఓవర్లలో వంద పరుగులు అన్యాయం. ఫుల్ టాస్ బంతులేసినా ఆ స్కోరు అసాధ్యం’ అని విస్మయం వ్యక్తం చేశారు.

News April 25, 2024

తెగ గీకేశారు.. మార్చిలో గరిష్ఠానికి క్రెడిట్ కార్డుల ఖర్చు

image

దేశంలో క్రెడిట్ కార్డుల వినియోగం రికార్డ్ స్థాయికి చేరింది. మార్చిలో ఈ కార్డుల ద్వారా ఖర్చు చేసిన మొత్తం రూ.1,64,586 కోట్లకు చేరింది. 2023 మార్చితో (రూ.1,37,310కోట్లు) పోలిస్తే 20% ఎక్కువ. ఆన్‌లైన్‌లో రూ.1,04,081 కోట్లు, ఆఫ్‌లైన్‌లో రూ.60,378 కోట్లు ఖర్చు చేశారు. క్రెడిట్ కార్డు ఆన్‌లైన్ చెల్లింపులు నెల వ్యవధిలో 10% పెరిగాయి. ఫిబ్రవరిలో రూ.94,774కోట్లుగా ఉన్న మొత్తం MARకి రూ.లక్షకోట్లు దాటింది.

News April 25, 2024

ఈనెల 28న అత్యధిక ఉష్ణోగ్రతలు: ఐఎండీ

image

తెలుగు రాష్ట్రాల్లో ఈనెల 28న అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. మధ్యాహ్నం ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని, రాత్రి వేడిగాలులు ఉంటాయని తెలిపింది. దక్షిణ తెలంగాణ, యానాం, రాయలసీమల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 డిగ్రీలు అధికంగా (44°C) నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.

News April 25, 2024

ఆంధ్రప్రదేశ్ సిద్ధం: సీఎం జగన్

image

AP: ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర పూర్తి చేసిన సీఎం జగన్ ‘ఆంధ్రప్రదేశ్ సిద్ధం’ అంటూ ట్వీట్ చేశారు. రాష్ట్ర ప్రజలు ఫ్యానుకు ఓటేయాలని తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇక సీఎం జగన్ బస్సు యాత్ర 22 రోజుల పాటు 86 నియోజకవర్గాల మీదుగా 2100 కిలోమీటర్లు సాగింది. త్వరలో మిగిలిన నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించనున్నారు.