News April 25, 2024

IPL: ఢిల్లీ బ్యాటింగ్.. టీమ్స్ ఇవే..

image

ఐపీఎల్-2024లో భాగంగా ఢిల్లీతో జరుగుతున్న మ్యాచులో గుజరాత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఢిల్లీ: పృథ్వీషా, అభిషేక్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ట్రిస్టన్ స్టబ్స్, పంత్ (C & WK), అక్షర్, కుల్దీప్, నోకియా, హోప్, ముకేశ్, ఖలీల్ అహ్మద్.
GT: సాహా, గిల్(C), మిల్లర్, ఒమర్జాయ్, షారుఖ్ ఖాన్, తెవాటియా, రషీద్, సాయి కిషోర్, నూర్ అహ్మద్, సందీప్, మోహిత్.

News April 25, 2024

నీటి వృథా అరికట్టేందుకు..

image

ఎండల తీవ్రత పెరగడంతో నీటి ఎద్దడిని నివారించేందుకు భారత రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. వందే భారత్ రైలు ప్రయాణికులకు ప్రస్తుతం ఉచితంగా ఇస్తున్న లీటర్ వాటర్ బాటిల్ స్థానంలో 500 ML బాటిల్‌ను ఇవ్వాలని నిర్ణయించింది. ఒకవేళ ప్రయాణికులు కోరితే మరో ఎక్స్‌ట్రా బాటిల్ ఇవ్వనున్నట్లు తెలిపింది.

News April 25, 2024

హరీశ్.. రాజీనామా లేఖ రెడీగా పెట్టుకో: సీఎం రేవంత్

image

TG: భూమి బద్దలైనా ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ మరోసారి స్పష్టం చేశారు. రూ.2లక్షల రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానన్న హరీశ్‌రావు తన రాజీనామా లేఖను జేబులో రెడీగా పెట్టుకోవాలని అన్నారు. రామప్ప, సమ్మక్క సాక్షిగా తాము ఇచ్చిన మాట తప్పబోమని పేర్కొన్నారు. దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్ మోసం చేశారని గుర్తుచేశారు.

News April 25, 2024

వైసీపీకి డిపాజిట్లు కూడా రావు: చంద్రబాబు

image

AP: ఎన్డీఏ సభలకు వస్తున్న ఆదరణ చూసి వైసీపీలో గుబులు మొదలైందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. ‘ప్రజలందరినీ జగన్ తన బానిసలుగా చూస్తున్నారు. జగన్ అహంకారి, విధ్వంసకారుడు. ఎన్నికలప్పుడు ఏదో ఒక నాటకం ఆడటం జగన్‌కు అలవాటు. ఇప్పడు గులకరాయి డ్రామా ఆడుతున్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి డిపాజిట్లు కూడా రావు. ప్రజల కలలు చెరిపేసిన దుర్మార్గుడు జగన్’ అని ఆయన విరుచుకుపడ్డారు.

News April 25, 2024

టెన్త్ టాపర్ ముఖంపై ట్రోల్స్.. బుద్ధి చెప్పిన అమ్మాయి

image

తన ముఖంపై నీచంగా ట్రోల్స్ చేస్తున్న వారికి బాలిక ప్రాచీ నిగమ్ బుద్ధి చెప్పారు. ట్రోలింగ్‌పై హుందాగా స్పందించారు. ‘ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఉపాధ్యాయులు ఇలా ఎవరూ నా ముఖంపై కామెంట్స్ చేయలేదు. UPలో 10వ తరగతిలో స్టేట్ ఫస్ట్ వచ్చాక నా ఫొటో చూసి కొందరు ట్రోల్స్ చేస్తున్నారు. వాటన్నింటినీ పట్టించుకోను. అవాంఛిత రోమాల గురించి ఆలోచించట్లేదు. మార్కులే నాకు ముఖ్యం. ఇంజినీర్ కావడమే నా లక్ష్యం’ అని నిగమ్ తెలిపారు.

News April 25, 2024

ALERT: రేపు 54 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు

image

AP: రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. రేపు 54 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 154 మండలాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ తెలిపారు. ఎల్లుండి 36 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 157 వడగాడ్పులు వీస్తాయని పేర్కొన్నారు. ఇవాళ అత్యధికంగా విజయనగరం(D) తుమ్మికపల్లిలో 45 డిగ్రీలు, వైఎస్సార్(D) బలపనూర్‌లో 44.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.

News April 25, 2024

మేం కట్టిన ప్రాజెక్టులు చెక్కు చెదరలేదు: రేవంత్

image

TG: కాంగ్రెస్, BRS కట్టిన ప్రాజెక్టులు ఎలా ఉన్నాయో ప్రజలు చూడాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘మేం కట్టిన ప్రాజెక్టుల్లో లోపాలు లేవు. నాగార్జున సాగర్ చెక్కు చెదరలేదు. రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. మేడిగడ్డ మేడిపండు అయింది. అన్నారం ఆకాశాన్ని అంటింది. సుందిళ్ల సున్నం అయింది. కాళేశ్వరం వెళ్దాం రండి.. కేసీఆర్ కట్టిన అద్భుతమేంటో మేం చూపిస్తాం’ అని సీఎం స్పష్టం చేశారు.

News April 25, 2024

కోహ్లీ రెస్టారెంట్లో RCB క్రికెటర్ల సందడి

image

స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ రెస్టారెంట్‌లో RCB క్రికెటర్లు సందడి చేశారు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ‘వన్8 కమ్యూన్’ రెస్టారెంట్‌ను సందర్శించి అక్కడి ఫుడ్, డ్రింక్స్‌ను వీరు ఆస్వాదించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రేపు ఉప్పల్‌లో SRHతో RCB తలపడనుంది. ఇప్పటివరకు బెంగళూరు 8 మ్యాచ్‌లు ఆడి ఒకే ఒక్కటి గెలిచి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది.

News April 25, 2024

అసెంబ్లీకి రాకుండా టీవీ9 ఆఫీసుకు వెళ్లాడు: CM

image

TG: కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా పారిపోతున్నారని సీఎం రేవంత్ విమర్శించారు. ‘అసెంబ్లీకి రాని దద్దమ్మలు.. బడికి రాని బడి దొంగల్లాంటోళ్లు. మరి అలాంటి బడి దొంగ నిన్న టీవీ9 ఆఫీసులో 4 గంటలు కూర్చున్నాడు. అసెంబ్లీలో మా కళ్లల్లోకి చూసే ధైర్యం లేక, ప్రభుత్వానికి సలహాలు ఇవ్వకుండా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు’ అని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.

News April 25, 2024

వరంగల్‌కు రెండో రాజధాని అయ్యే అర్హతలున్నాయి: సీఎం రేవంత్

image

TG: వరంగల్‌కు రెండో రాజధాని అయ్యే అర్హతలున్నాయని CM రేవంత్ అన్నారు. ‘వరంగల్‌లో ORR, ఎయిర్‌పోర్టు నిర్మిస్తాం. వర్షాలు వస్తే ఈ ప్రాంతం సముద్రంలా మారిపోతోంది. ఈ సమస్య పరిష్కారానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు ఏర్పాటు చేస్తాం. ఆగిపోయిన ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తాం. ప్రతి ఎకరానికి నీళ్లిస్తాం. పరిశ్రమలు, IT ప్రాజెక్టులతో నిరుద్యోగులకు ఉద్యోగాలిస్తాం’ అని హనుమకొండ(D) మడికొండ సభలో ప్రసంగించారు.