News April 24, 2024

మల్కాజ్‌గిరిని నేనెప్పుడూ మర్చిపోను: రేవంత్

image

TG: మల్కాజ్‌గిరి నియోజకవర్గాన్ని తానెప్పుడూ మర్చిపోనని CM రేవంత్ తెలిపారు. శామీర్‌పేట సభలో మాట్లాడిన ఆయన.. ‘కొడంగల్‌లో ఓడితే.. మల్కాజ్‌గిరిలో MPగా గెలిపించారు. MPగా చేసిన పోరాటంతోనే PCC చీఫ్ పదవి వచ్చింది. పడిపోతున్న నన్ను ఇక్కడి ప్రజలే నిలబెట్టారు. పరిశ్రమలు, ఐటీ కంపెనీలు తెచ్చి.. నాకు అండగా నిలిచిన ప్రజల రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. సునీతా మహేందర్‌రెడ్డిని ఎంపీగా గెలిపించాలి’ అని కోరారు.

News April 24, 2024

కేజ్రీవాల్‌కు వ్యక్తిగత వైద్యులు అనవసరం: కోర్టు

image

లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు వ్యక్తిగత వైద్యులు అవసరం లేదని రౌస్ అవెన్యూ కోర్టు పేర్కొంది. వైద్యపరీక్షల కోసం ఎయిమ్స్ వైద్యులతో మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని ఆదేశించింది. దీంతో పాటు కేజ్రీవాల్‌కు ఇన్సులిన్ అందించాలని సూచించింది.

News April 24, 2024

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై

image

RRvsMI మ్యాచ్‌లో ముంబై జట్టు టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకుంది.
>> జట్లు
MI: రోహిత్‌శర్మ, ఇషాన్, సూర్యకుమార్, తిలక్ వర్మ, హార్దిక్(C), టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, కోయెట్జీ, నబీ, పీయూష్ చావ్లా, బుమ్రా.
ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా నువాన్ తుషారాను MI ప్రకటించింది.
RR: జైస్వాల్, శాంసన్(C), పరాగ్, హెట్మెయర్, జురెల్, పావెల్, రవిచంద్రన్ అశ్విన్, బౌల్ట్, అవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్, సందీప్ శర్మ.

News April 24, 2024

కేవీల్లో ప్రవేశాలు.. అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోండిలా

image

కేంద్రీయ విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఒకటో తరగతిలో ప్రవేశాలకు ఈనెల 15 వరకు దరఖాస్తులు స్వీకరించిన సంగతి తెలిసిందే. అధికారులు లాటరీ నిర్వహించి విద్యార్థుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించారు. తాజాగా అప్లికేషన్ స్టేటస్ ఆప్షన్‌ను అందుబాటులో ఉంచారు. లాగిన్ కోడ్‌తో ఎంటర్ అయి లాటరీ నంబర్‌తో పాటు స్కూళ్ల వారీగా వెయిటింగ్ లిస్టును తెలుసుకోవచ్చు. వెబ్‌సైట్: https://kvsonlineadmission.kvs.gov.in/

News April 24, 2024

కిలో మామిడి (2×2)×√225

image

వేసవిలో మామిడి పండ్లకు డిమాండ్ ఎక్కువ. తియ్యని పండ్లు, పచ్చడి కాయలు కొనేందుకు జనాలు ఆసక్తి చూపుతారు. ఈ క్రమంలో ఎక్కడో తెలియదు కానీ ఓ మామిడి కాయల విక్రేత తనలో గణిత నిపుణుడు ఉన్నారని చాటి చెప్పారు. కిలో (2×2)×√225 అంటూ బోర్డు పెట్టారు. అది చూసిన నిరక్షరాస్యులు ధర అర్థంకాక ముక్కున వేలేసుకుంటున్నారు. సింపుల్‌గా కిలో రూ.60 అని చెబితే పోయేదానికి మ్యాథమెటిక్స్ ఎందుకంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

News April 24, 2024

సీఎం జగన్ ఆస్తులు ఎన్నంటే?

image

AP: సీఎం జగన్‌‌, ఆయన సతీమణి వైఎస్ భారతికి రూ.774.88 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. అందులో చరాస్తులు రూ.602.46 కోట్లు కాగా స్థిరాస్తులు 103.71 కోట్లు. ఇక భారతి వద్ద రూ.5 కోట్లు విలువ చేసే నగలు ఉన్నాయి. సీఎం జగన్‌కు రూ.1.10 కోట్లు, భారతికి రూ.7.41 కోట్ల అప్పులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. జగన్‌పై 26 కేసులు ఉన్నాయి. ఐదేళ్లలో కుటుంబ ఆస్తులు రూ.499 కోట్ల నుంచి రూ.774 కోట్లకు పెరిగాయి.

News April 24, 2024

హార్దిక్‌కు స్పెషల్ మ్యాచ్

image

ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యకు ఇవాళ రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్ ప్రత్యేకం కానుంది. MI తరఫున హార్దిక్‌కు ఇది 100వ మ్యాచ్ కావడం విశేషం. ఇప్పటివరకు ముంబై తరఫున 99 మ్యాచులు ఆడిన పాండ్య 1,617 పరుగుల చేశారు. ఓవరాల్‌గా ఐపీఎల్‌లో పాండ్య 130 మ్యాచులు ఆడారు. కాగా MI తరఫున అత్యధిక మ్యాచులు ఆడిన ప్లేయర్‌గా రోహిత్(205) ముందు వరుసలో ఉన్నారు.

News April 24, 2024

సూపర్ స్టార్‌తో పాట్ కమిన్స్

image

సూపర్ స్టార్ మహేశ్ బాబును సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్లు కలిశారు. హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో కెప్టెన్ పాట్ కమిన్స్, బ్యాటర్ మయాంక్ అగర్వాల్.. మహేశ్‌తో ముచ్చటించారు. ‘ది ప్రిన్స్ ఆఫ్ టాలీవుడ్‌తో మేము’ అంటూ అందుకు సంబంధించిన ఫొటోలను మయాంక్ ట్వీట్ చేశారు. ఓ యాడ్ షూట్ కోసమే వారు కలిసినట్లు తెలుస్తోంది. ఇక హైదరాబాద్ తన తదుపరి మ్యాచ్‌ను ఈ నెల 25న ఆర్సీబీతో ఆడనుంది.

News April 24, 2024

భారత మసాలాలపై హాంకాంగ్, సింగపూర్ నిషేధం

image

భారత్‌కు చెందిన ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాను సింగపూర్ నిషేధించిన విషయం తెలిసిందే. తాజాగా ఎవరెస్ట్‌తో పాటు MDH సాంబార్ మసాలాను హాంకాంగ్ నిషేధించింది. వాటిలో క్యాన్సర్‌ కారకాలున్నాయని హాంకాంగ్ ఆరోపించింది. దీంతో ఎవరెస్ట్, MDH కంపెనీలతో పాటు అన్ని కంపెనీల మసాలా ఉత్పత్తుల నుంచి శాంపిల్స్ తీసుకొని పరీక్షించాలని ఫుడ్ కమిషనర్లను కేంద్రం ఆదేశించిందట. 20రోజుల్లో రిపోర్టు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

News April 24, 2024

పవన్ కళ్యాణ్ పర్యటనలు వాయిదా

image

AP: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు వాయిదా పడ్డాయి. పిఠాపురం నుంచి తాడేపల్లిగూడెంకు బయల్దేరేందుకు పవన్ హెలికాఫ్టర్ ఎక్కగా.. టేకాఫ్ సమయంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలను వాయిదా వేస్తున్నట్లు జనసేన పార్టీ ప్రకటించింది. త్వరలోనే ఆ నియోజకవర్గాల్లో పవన్ పర్యటిస్తారని పేర్కొంది.