News March 25, 2024

ఒకప్పుడు ఇంట్లో నుంచి పారిపోయి..

image

కంగనా రనౌత్‌ని BJP MP అభ్యర్థిగా ప్రకటించడంతో ఆమె పొలిటికల్ కెరీర్ మొదలైనట్లయింది. హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన కంగనా.. 15ఏళ్లప్పుడు ఇంటి నుంచి పారిపోయి, డ్రగ్స్‌కి బానిసయ్యారట. 2006లో ‘గ్యాంగ్‌స్టార్’తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లోనూ నటించారు. ఆమెకు 4 నేషనల్, 5 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, 3 ఇంటర్నేషనల్ అవార్డులు, 2021లో పద్మశ్రీ వచ్చాయి.

News March 25, 2024

ఎన్నికల తర్వాత వైద్యారోగ్యశాఖలో పోస్టుల భర్తీ

image

TG: వైద్యారోగ్య శాఖలో పోస్టుల భర్తీకి కసరత్తు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో డీఎంఈ సహా డీపీఏ, డీసీహెచ్, కమిషనర్, టీవీవీపీ పోస్టులను భర్తీ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. రాష్ట్ర ఏర్పాటు నుంచి ఆ పోస్టులను ఇన్‌ఛార్జ్‌లతోనే ప్రభుత్వం భర్తీ చేస్తోంది. తాజాగా ఎన్నికల కోడ్ రావడంతో ఎలక్షన్స్ తర్వాత నియామకాలు చేపట్టనుంది.

News March 25, 2024

గాజాలో తక్షణ కాల్పుల విరమణకు ఆమోదం

image

గాజాలో తక్షణ కాల్పుల విరమణ తీర్మానానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్ వెల్లడించారు. ‘సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న తీర్మానాన్ని భద్రతా మండలి ఆమోదించింది. ఈ తీర్మానాన్ని తప్పకుండా అమలు పరచాలి’ అని పేర్కొన్నారు. ఈ తీర్మానానికి 14 దేశాలు అనుకూలంగా ఓటు వేయగా, అమెరికా ఓటింగ్‌కు దూరంగా ఉంది.

News March 25, 2024

IPL.. చరిత్ర సృష్టించిన కోహ్లీ

image

టీ20 క్రికెట్‌లో విరాట్ కోహ్లీ పలు రికార్డులు సాధించారు. టీ20ల్లో 100సార్లు 50 ప్లస్ రన్స్ చేసిన మొదటి భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టించారు. పంజాబ్‌తో మ్యాచ్‌లో కోహ్లీ హాఫ్ సెంచరీ చేశారు. దీంతో పాటు ఇదే మ్యాచ్‌లో అత్యధిక క్యాచులు(173) పట్టిన భారత ప్లేయర్‌గానూ అవతరించారు. బెయిర్‌స్టో ఇచ్చిన క్యాచ్ అందుకోవడంతో ఈ ఫీట్ సాధించారు. ఆ తర్వాతి స్థానాల్లో రైనా(172), రోహిత్(167) ఉన్నారు.

News March 25, 2024

మైత్రీ చేతిలో బడా సినిమాలు

image

మైత్రీ మూవీ మేకర్స్ ప్రస్తుతం ‘టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ’గా మారింది. ఈ నిర్మాణ సంస్థ చేతిలో బడా హీరోల చిత్రాలు లాక్ అయ్యాయి. అల్లు అర్జున్ పుష్ప-2 చిత్రీకరణ కొనసాగుతోండగా.. చెర్రీ-సుకుమార్, ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్, ప్రభాస్-హను రాఘవపూడి, గుడ్ బ్యాడ్ అగ్లీ(అజిత్), రాబిన్ హుడ్(నితిన్), విజయ్ దేవరకొండ-రాహుల్ సాంకృత్యాయన్ మూవీలతో పాటు పలు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.

News March 25, 2024

ఆర్సీబీ ఓడితే సీఎస్కే జెర్సీ వేసుకుంటా: డివిలియర్స్

image

పంజాబ్, ఆర్సీబీ మ్యాచ్ జరుగుతున్న సమయంలో కామెంటేటర్లు స్కాట్ స్టైరిస్, డివిలియర్స్ ఒకరికొకరు సవాల్ విసురుకున్నారు. ఈ మ్యాచులో ఆర్సీబీ గెలిస్తే ఇకపై RCB మ్యాచ్ ఆడినప్పుడల్లా ఆ జట్టు జెర్సీ ధరిస్తానని స్కాట్ అన్నారు. అదే ఆర్సీబీ ఓడితే తాను రేపు CSK జెర్సీ ధరిస్తానని డివిలియర్స్ పేర్కొన్నారు. వీరిద్దరి సవాల్‌కు సాక్ష్యంగా ఉతప్ప ఉన్నారు. వీరిలో ABD ఆర్సీబీ తరఫున ఆడగా.. స్కాట్ CSK తరఫున ఆడారు.

News March 25, 2024

వాట్సాప్‌లో మరో ప్రైవసీ ఫీచర్

image

వాట్సాప్‌లో మరో ప్రైవసీ ఫీచర్ రానుంది. దీనితో యూజర్లు తమ అవతార్‌ను ఇతరులెవరూ స్టిక్కర్స్‌లో వాడకుండా నియంత్రించవచ్చు. ఎవరెవరు మన అవతార్‌ని వాడుకోవచ్చో నిర్ణయించుకునే వెసులుబాటు యూజర్లకు ఉంటుంది. ఇందులో మై కాంటాక్ట్స్, సెలెక్టెడ్ కాంటాక్ట్స్, Nobody అనే మూడు ఆప్షన్స్ ఉంటాయి. వీటిలో ఏదో ఒకటి మనం ఎంచుకోవచ్చు. ప్రస్తుతం డెవలప్‌మెంట్ దశలో ఉన్న ఈ ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి రానుంది.

News March 25, 2024

ఈ నెల 30 నుంచి జనంలోకి జనసేనాని

image

AP: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 30న పిఠాపురం నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారని.. అక్కడ ఉంటూనే AP వ్యాప్తంగా ప్రచారానికి వెళ్తారని పార్టీ వెల్లడించింది. తొలిరోజు శక్తిపీఠమైన శ్రీ పురుహూతిక అమ్మవారిని, అనంతరం దత్తపీఠాన్ని దర్శించుకోనున్న ఆయన.. ఆ తర్వాత మూడు రోజులు పిఠాపురంలోనే ఉంటారు. ఉగాది వేడుకలను కూడా అక్కడే పవన్ నిర్వహించుకోబోతున్నారు.

News March 25, 2024

వైసీపీకి షాక్?

image

AP:ప్రకాశం జిల్లాలో YCPకి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. వైశ్య సామాజిక వర్గ నేత, మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు TDPలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. దర్శి వైసీపీ టికెట్ దక్కకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఆయన.. ఈ నెల 27న TDP తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది. జిల్లా రాజకీయాలపై పట్టు ఉన్న ఆయనకు దర్శి టికెట్ ఇచ్చేందుకు TDP హైకమాండ్ సానుకూలంగా ఉందట. అటు YCP టికెట్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి దక్కింది.

News March 25, 2024

మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. మంత్రిపై కేసు

image

ప్రధాని మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు తమిళనాడు DMK మంత్రి అనితా రాధాకృష్ణన్‌పై కేసు నమోదైంది. తమిళనాడు పర్యటనలో భాగంగా మాజీ సీఎం కామరాజ్‌ను ప్రశంసించినందుకు ప్రధానిపై ఆయన అసహ్యకరంగా, జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సిద్రంగనాథన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మెగ్ననపురం పోలీసులు కేసు నమోదు చేశారు.