India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

TG: కరీంనగర్ లోక్‌సభ స్థానానికి అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, వెలిచాల రాజేందర్‌రావు, తీన్మార్ మల్లన్న పేర్లను కాంగ్రెస్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈనెల 31న CEC భేటీలో దీనిపై స్పష్టత రానుంది. నియోజకవర్గ నేతల అభిప్రాయాలు, సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకుని.. సర్వే నివేదికల ఆధారంగా అభ్యర్థిని ఖరారు చేస్తారని సమాచారం. మల్లన్న నాన్‌లోకల్ అభ్యర్థి కావడంతో ఆయనకు టికెట్ ఇవ్వొద్దని పలువురు సూచిస్తున్నారట.

TG: ఒకేసారి భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టడం, ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు మిగతా జాబ్స్‌ను వదిలేస్తుండటంతో బ్యాక్‌లాగ్ పోస్టులు పెరిగిపోతున్నాయి. 3 నెలల్లో 33వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరగగా, 4,590 పోస్టులు మిగిలిపోయినట్లు తెలుస్తోంది. కానిస్టేబుల్ 2వేలు, గురుకులాల్లో 1,810, స్టాఫ్ నర్స్, మెడికల్ ఆఫీసర్లలో 780 ఉద్యోగాలు భర్తీ కాలేదు. వీటికోసం మళ్లీ నోటిఫికేషన్లు జారీ చేయాల్సి ఉంది.

వచ్చే వారం విడుదల కానున్న ‘ఫ్యామిలీ స్టార్’ మూవీ టీమ్‌కు హీరోయిన్ రష్మిక విషెస్ తెలిపారు. ‘బెస్ట్ మూవీని అందిస్తోన్న నా డార్లింగ్స్ విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పరశురామ్‌కు శుభాకాంక్షలు. మృణాల్‌కు ఆల్ ది బెస్ట్. ఏప్రిల్ 5 కోసం ఎదురుచూస్తున్నా. మీరు కచ్చితంగా విజయం సాధిస్తారు. పార్టీ కావాలి’ అంటూ లవ్ సింబల్స్‌తో ట్వీట్ చేశారు. దీనికి విజయ్.. క్యూటెస్ట్ అంటూ రిప్లై ఇచ్చారు.

TG: రైతులకు అన్ని రకాల విత్తనాల సబ్సిడీని పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జీలుగ, జనపనార, పిల్లి పెసర మినహా మిగతా విత్తనాలపై సబ్సిడీని గత సర్కారు ఎత్తేసిన విషయం తెలిసిందే. ఖరీఫ్ నుంచి పత్తి, వరి, కంది, పెసర, మొక్కజొన్న, సోయాబీన్, మినుము, వేరుశనగ తదితర విత్తనాలకు 35 నుంచి 65 శాతం సబ్సిడీని వ్యవసాయ శాఖ ఇవ్వనుంది. ఇందుకోసం రూ.170కోట్లు ఖర్చవుతుందని అంచనా.

డిజిటల్ రంగం భారత్‌లో చాలా మార్పులు తీసుకొచ్చిందని ప్రధాని మోదీ అన్నారు. డిజిటల్ విప్లవంపై మోదీ, బిల్ గేట్స్ ప్రత్యేకంగా చర్చించారు. ప్రభుత్వ అవసరమున్న పేదలకు డిజిటల్ టెక్నాలజీ ఉపయోగపడుతుందని అన్నారు. ప్రస్తుతం నేరుగా ప్రభుత్వం నుంచే పేదవాడికి అన్నీ అందుతున్నాయని తెలిపారు. చాట్ జీపీటీని ఉపయోగించడం మంచిదే కానీ ఇది అలసత్వానికి దారితీయకూడదని అభిప్రాయపడ్డారు.

జనసేనకు తాను ప్రచారం చేస్తానని చెప్పినట్లు వస్తున్న వార్తలపై నటి అనసూయ స్పందించారు. ‘నేను ఏం మాట్లాడినా వివాదం చేస్తున్నారు. జనసేన పార్టీకి నా అంతట నేను ప్రచారం చేస్తానని చెప్పలేదు. పవన్ కళ్యాణ్ మంచి నాయకుడనేది నా ఉద్దేశం. ఆయన అడిగితే మద్దతు ఇస్తానని చెప్పా. అంతే కానీ ప్రచారం చేస్తానని చెప్పలేదు. మంచి లీడర్లు ఏ పార్టీలో ఉన్నా నేను సపోర్ట్ చేస్తా’ అంటూ అనసూయ క్లారిటీ ఇచ్చారు.

కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదలైంది. 2024-25 విద్యా సంవత్సరానికి గాను 1వ తరగతిలో ప్రవేశాలకు ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 15 వరకు, 2-10 తరగతులకు ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 10 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కేవీ సంఘటన్ సూచించింది. ఒకటో తరగతిలో అడ్మిషన్ పొందాలనుకునే చిన్నారుల వయసు మార్చి 31, 2024 నాటికి ఆరేళ్లు పూర్తి కావాలని పేర్కొంది. పూర్తి వివరాలకు కేవీ <

TG: రానున్న రోజుల్లో దక్షిణాది రాష్ట్రాల్లో యువ జనాభా(19-29 ఏళ్లు) భారీగా తగ్గనుందని ఇండియా ఎంప్లాయ్‌మెంట్ ఇండెక్స్-2024 వెల్లడించింది. 2021లో తెలంగాణలో 26.4 శాతం ఉన్న యువత సంఖ్య.. 2036 నాటికి 20.2 శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం చదువుకున్న యువత 77.7 శాతం ఉండగా, నిరుద్యోగ రేటు 14.19 శాతం నుంచి 21.71 శాతానికి చేరినట్లు పేర్కొంది.

ఢిల్లీ CM కేజ్రీవాల్ తాజాగా మరో ఆరోపణ ఎదుర్కొంటున్నారు. అంబేడ్కర్ మెడికల్ కాలేజీలో లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రిన్సిపల్ బదిలీకి సంబంధించిన ఫైల్‌ను ఆయన 45 రోజులుగా నిలిపివేశారని గవర్నర్ సక్సేనా ఆరోపించారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని ఆప్ మంత్రి సౌరభ్ తాజాగా ఎల్జీని కోరడంతో ఈ విషయం వెల్లడైంది. కాగా ఈ కేసులో క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని పోలీసులు, CSను గవర్నర్ ఆదేశించారు.

ముంబై ఫ్యాన్స్ దాడిలో చెన్నై అభిమాని తీవ్రంగా గాయపడిన ఘటన MHలోని కొల్హాపూర్‌లో జరిగింది. బుధవారం రాత్రి SRHపై రోహిత్ శర్మ ఔట్ కావడంతో CSK అభిమాని బండోపంత్ టిబిలే(63).. ‘రోహిత్ ఔటైపోయాడు. ఇప్పుడు ముంబై ఎలా గెలుస్తుంది’ అంటూ హేళన చేశాడు. దీంతో రోహిత్ ఫ్యాన్స్ బల్వంత్, సాగర్ పట్టరాని కోపంతో టిబిలే తలపై కర్రతో కొట్టారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది. నిందితులిద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు.
Sorry, no posts matched your criteria.