News March 28, 2024

ఎన్డీఏ నేతల భేటీ

image

AP: టీడీపీ-జనసేన-బీజెపీ ముఖ్య నాయకులు విజయవాడలో నిన్న సమావేశమయ్యారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జనసేన తరఫున పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారం, ఉమ్మడి సభలు, వచ్చే నలభై రోజులు అనుసరించాల్సిన వ్యూహాలు, మేనిఫెస్టో తదితర అంశాలపై వారు చర్చించినట్లు తెలుస్తోంది.

News March 28, 2024

మంచి నిద్ర కోసం ఎంతసేపు వ్యాయామం చేయాలంటే?

image

నేటి ఉరుకుల పరుగుల ప్రపంచంలో చాలామందిని నిద్రలేమి సమస్య వేధిస్తోంది. అలాంటి వారికి వ్యాయామం మంచి పరిష్కారం అని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రోజుకు గంట చొప్పున వారానికి రెండు, మూడు సార్లు వ్యాయామం చేస్తే చక్కటి నిద్ర పడుతుందని ఐరోపా పరిశోధకులు తేల్చారు. 4399 మందిపై ఈ పరిశోధనలు నిర్వహించారు. నిద్ర పట్టని ‘ఇన్సోమ్నియా’ వంటి పరిస్థితి శారీరక శ్రమ ఉన్నవారిలో తక్కువగా ఉంటుందని గుర్తించారు.

News March 28, 2024

చరణ్ అడగ్గానే సాయం చేస్తాడు: మంచు మనోజ్

image

రామ్ చరణ్ చాలా మంచి మనిషని మంచు మనోజ్ కొనియాడారు. చరణ్ పుట్టినరోజు సందర్భంగా నిన్న హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘ఎవరైనా కష్టాల్లో ఉన్నారని తెలిస్తే చరణ్ చలించిపోతాడు. నాకు తెలిసిన ఓ తెలుగు ఫ్యామిలీ దుబాయ్‌లో ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్నారు. అప్పుడు నేను అమెరికాలో ఉన్నా. నాకు కూడా కొంచెం ఇబ్బంది ఉండటంతో చరణ్‌కు చెప్పాను. వెంటనే వారికి డబ్బు పంపించాడు’ అని వెల్లడించారు.

News March 28, 2024

‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ డేట్ ఫిక్స్?

image

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో తెరకెక్కుతోన్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా నుంచి ఓ రూమర్ వినిపిస్తోంది. ఈ సినిమాను అక్టోబర్ 31న రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందించగా.. చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మూవీని దిల్ రాజు నిర్మిస్తున్నారు.

News March 28, 2024

నా దగ్గర డబ్బులేకే పోటీ చేయట్లేదు: నిర్మల

image

ఎన్నికల్లో ఖర్చుపెట్టేందుకు అవసరమైన డబ్బు తన వద్ద లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా పేర్కొన్నారు. అందుకే తాను లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తెలిపారు. ‘ఏపీ లేదా తమిళనాడు నుంచి పోటీ చేసేందుకు పార్టీ నాకు ఛాన్స్ ఇచ్చింది. ఓ పది రోజులు ఆలోచించి, కుదరదని చెప్పా. నావద్ద డబ్బు లేదు. ఏపీ, తమిళనాడులో కులం, మతం వంటివాటినీ పరిగణిస్తారు. అందుకే చేయనని చెప్పేశా’ అని వెల్లడించారు.

News March 28, 2024

నిన్నటి మ్యాచ్‌లో రికార్డులివే!

image

నిన్న రాత్రి జరిగిన SRH-MI మ్యాచ్‌లో కొన్ని రికార్డులు..
☞ ప్రపంచంలోనే అత్యధిక రన్స్(523) నమోదైన టీ20 మ్యాచ్.
☞ ప్రపంచంలోనే అత్యధిక సిక్సులు(38) నమోదైన టీ20 మ్యాచ్.
☞ SRH(277/3): ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు
☞ ఐపీఎల్‌లో ఓ జట్టులో ఇద్దరు ఆటగాళ్లు 20 బంతుల లోపు 50 రన్స్ చేయడం ఇదే తొలిసారి.
☞ తొలి 10 ఓవర్ల స్కోరుల్లో హైదరాబాద్ చేసిన 148 పరుగులే ఐపీఎల్ చరిత్రలో అత్యధికం.

News March 28, 2024

SRH బ్యాటర్లు అదరగొట్టారు: కేటీఆర్

image

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 17వ సీజ‌న్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జట్టు రికార్డు స్కోర్ చేయడంతో మాజీ మంత్రి కేటీఆర్ ప్లేయర్లపై ప్రశంసలు కురిపించారు. ‘SRH బ్యాటర్లు పవర్ హిట్టింగ్‌తో అదరగొట్టారు. ఇదో అద్భుతమైన ప్రదర్శన. బౌల‌ర్ల‌ను ఊచ‌కోత కోస్తూ 20 ఓవర్లలో 277 పరుగులు చేసి ఐపీఎల్‌లో సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. హైదరాబాద్‌ ఫ్యాన్స్‌ను అలరించినందుకు ధన్యవాదాలు’ అని ఆయన ట్వీట్ చేశారు.

News March 28, 2024

మాల్దీవ్స్‌లో తాగునీటి కొరత

image

చుట్టూ సముద్రపు నీరున్నా తాగునీరు లేక మాల్దీవ్స్ అల్లాడుతోంది. నీటి కొరతను అధిగమించేందుకు టిబెట్(రిపబ్లిక్ ఆఫ్ చైనా) నుంచి 1,500 టన్నుల నీటిని తెచ్చుకుంది. ఈ అంశంలో మాల్దీవ్స్‌కు సాయం చేస్తామని టిబెట్ గతేడాదే హామీ ఇచ్చింది. ఇదిలా ఉంటే భారత్‌తో వివాదం పెట్టుకున్నప్పటి నుంచి మాల్దీవ్స్‌ను వరుసగా కష్టాలు వెంటాడుతున్నాయి. ఇటీవల ఆ దేశం ఆర్థికంగానూ తీవ్రంగా నష్టపోయింది.

News March 28, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News March 28, 2024

మార్చి 28: చరిత్రలో ఈరోజు

image

1552: సిక్కు గురువు గురు అంగద్ దేవ్ మరణం
1904: చిత్తూరు నాగయ్య జననం
1914: తెలుగు కవి పుట్టపర్తి నారాయణాచార్యులు జననం
1944: నేపథ్య గాయని బి వసంత జననం
1955: ఏపీలో రాష్ట్రపతి పాలన ముగింపు
1955: ఏపీ రెండో సీఎంగా బెజవాడ గోపాలరెడ్డి ప్రమాణస్వీకారం
1982: నటి సోనియా అగర్వాల్ జననం
1997: నటి అను ఇమ్మానుయేల్ జననం
1959: ఏపీ మాజీ మంత్రి కళా వెంకట్రావు మరణం