India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తేది: మార్చి 27, బుధవారం
ఫజర్: తెల్లవారుజామున గం.5:02
సూర్యోదయం: ఉదయం గం.6:15
జొహర్: మధ్యాహ్నం గం.12:21
అసర్: సాయంత్రం గం.4:45
మఘ్రిబ్: సాయంత్రం గం.6:28
ఇష: రాత్రి గం.07.41
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

తేదీ: మార్చి 27, బుధవారం
బహుళ విదియ: సాయంత్రం 05:06 గంటలకు
చిత్త: మధ్యాహ్నం 04:15 గంటలకు
దుర్ముహూర్తం: ఉదయం 11:48-12:36 గంటల వరకు
వర్జ్యం శేషం: తెల్లవారుఝాము 12:14, రాత్రి 10.25 ల

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

* TS: ఎమ్మెల్సీ కవితకు జుడీషియల్ కస్టడీ
* AP: రెండు రోజులు ఆలస్యంగా పెన్షన్ పంపిణీ
* TS: ఈ కరువు BRS తెచ్చిందే: మంత్రి సీతక్క
* AP: అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ముత్యాలనాయుడు
* TS: సీఎం రేవంత్ BJPలో చేరతారు: కేటీఆర్
* TS: కేంద్రానికి పెట్రోల్ పంప్ డీలర్ల అల్టిమేటం
* IPL: గుజరాత్‌పై చెన్నై విజయం
* FIFA WC క్వాలిఫయర్స్‌లో అఫ్గాన్ చేతిలో ఇండియా ఓటమి

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో CSK 63 రన్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన CSK 20 ఓవర్లలో 206/6 రన్స్ చేసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన GTలో సుదర్శన్(37), మిల్లర్(21), సాహా(21) తప్ప ఎవరూ రాణించకపోవడంతో ఆ జట్టు 20 ఓవర్లలో 143/8 రన్స్ మాత్రమే చేసింది. CSK బౌలర్లలో చాహర్, ముస్తఫిజుర్, దేశ్‌పాండే తలో 2 వికెట్లు తీయగా.. మిచెల్, పతిరాణాలకు చెరో వికెట్ దక్కింది.

AP: రేపటి నుంచి సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభించనున్నారు. తొలుత ఇడుపులపాయలో ప్రార్థనల అనంతరం యాత్ర ప్రారంభం కానుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా జగన్ ప్రజలతో మమేకం కానున్నారు. దాదాపు 21 రోజులు యాత్ర కొనసాగించనున్నారు. వైజాగ్, ఏలూరు, అనంతపురం, బాపట్ల మినహా అన్ని జిల్లాల్లో ఈ యాత్ర జరగనుంది. రోజుకో పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ యాత్ర కొనసాగనుంది.

చైనాకు చెందిన ఝౌ చునా(18) అనే యువతి తన అభిమాన నటి ఎస్తేర్‌లా కనిపించాలని 100కుపైగా ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకున్నారు. ఈ శస్త్ర చికిత్సల కోసం ఏకంగా ₹4 కోట్లు ఖర్చు చేశారు. 13 ఏళ్ల వయస్సు నుంచి ప్రతిసారీ కొత్త వైద్యులను సంప్రదిస్తూ ప్లాస్టిక్ సర్జరీలను చేయించుకున్నారు. ప్రస్తుతం ఎవరూ గుర్తించలేనంతగా ఆమె మొఖం మారడంతో ఆ రూపం తల్లిదండ్రులకీ నచ్చలేదు. దీంతో తాజాగా సర్జరీ ప్రయత్నాలను విరమించుకున్నారు.

భారత ఫుట్‌బాల్ జట్టుకు పసికూన అఫ్గానిస్థాన్ షాకిచ్చింది. 2026 ఫిఫా వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ మ్యాచ్‌లో భారత్ 1-2తేడాతో అఫ్గాన్ చేతిలో ఓడింది. ఇది ఇండియా కెప్టెన్ సునీల్ ఛెత్రీకి 150వ మ్యాచ్ కావడం విశేషం. ఇందులో సునీల్ తన కెరీర్‌లో 94వ గోల్ కూడా కొట్టారు. ఇది భారత ఫుట్‌బాల్ జట్టు చరిత్రలో ఘోరమైన ఓటమిగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ ఇండియాలో 2.25మిలియన్ల వీడియోలను తొలగించింది. 2023లో అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో నిబంధనలు ఉల్లంఘించినట్లు గుర్తించిన వీడియోలను తొలగించినట్లు తెలిపింది. వీడియోలు తొలగించిన దేశాల్లో భారత్ టాప్‌లో నిలిచింది. ఆ తర్వాత సింగపూర్ 12,43,871 వీడియోలతో రెండో స్థానంలో ఉంది. అమెరికా(7,88,354) మూడో స్థానంలో ఉంది.

అస్సాంలోని తేజ్‌పుర్ నియోజకవర్గంలో ఉన్న నేపాలీ పామ్ గ్రామంలో ఒకే కుటుంబంలో 1,200 మంది ఓటర్లు ఉన్నారు. రాన్ బహదూర్ థాపా అనే గోర్ఖాకు ఐదుగురు భార్యలు, 12 మంది కొడుకులు, 10 మంది కూతుళ్లు. వీరి కుటుంబం విస్తరించి ఇప్పుడు 2,500 మంది సభ్యులు ఉండగా.. వారిలో దాదాపు 1,200 మంది ఓటర్లు ఉన్నారు. వీరంతా 300 ఇళ్లలో నివసిస్తున్నారు. కాగా వీరంతా కుటుంబ పెద్ద టిల్ బహదూర్ థాపా ఎంచుకున్న అభ్యర్థికే ఓటు వేస్తారు.
Sorry, no posts matched your criteria.