India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జేఈఈ మెయిన్స్-2024 పేపర్ 1(బీఈ/బీటెక్) అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. ఏప్రిల్ 4, 5, 6 తేదీల్లో ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు హాల్ టికెట్లను http://jeemain.nta.ac.in వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి

తేది: ఏప్రిల్ 01, సోమవారం
బహుళ సప్తమి: రాత్రి 09:10 గంటలకు
మూల: రాత్రి 11:12 గంటలకు
దుర్ముహూర్తం: 1)మధ్యాహ్నం 12:35- 01:24 గంటల వరకు
2)మధ్యాహ్నం 03:01 నుంచి 3:50 గంటల వరకు
వర్జ్యం: రాత్రి 9:35-11.12 గంటల వరకు

✒ TG: ఏప్రిల్ 6 నుంచి బీఆర్ఎస్ నేతల దీక్షలు: కేసీఆర్
✒ కాంగ్రెస్ పార్టీలో చేరిన కడియం శ్రీహరి, కావ్య
✒ పార్లమెంటు స్థానాలకు ఇన్‌ఛార్జ్‌లను ప్రకటించిన కాంగ్రెస్
✒ AP: రాష్ట్ర ప్రజల కోసమే తగ్గాను: పవన్ కళ్యాణ్
✒ ప్రజలంతా ప్రభుత్వ బాధితులే: పురందీశ్వరి
✒ కూటమికి ఓటమి తప్పదు: పేర్ని నాని
✒ బీజేపీకి ఓటమి భయం పట్టుకుంది: షర్మిల
✒ అద్వానీకి భారత రత్న ప్రదానం చేసిన రాష్ట్రపతి

చెన్నై సూపర్ కింగ్స్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ షాకిచ్చింది. వైజాగ్ వేదికగా జరిగిన మ్యాచులో 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ.. వార్నర్, పంత్ అర్ధ సెంచరీలు చేయడంతో 192 పరుగులు చేసింది. ఛేదనలో సీఎస్కే 171 పరుగులకే పరిమితమైంది. ఆఖర్లో ధోనీ(16 బంతుల్లో 37*) మెరుపులు మెరిపించినా ప్రయోజనం లేకపోయింది. ఈ సీజన్‌లో చెన్నైకి ఇది తొలి ఓటమి కాగా ఢిల్లీకి మొదటి విజయం.

యంగ్‌టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కాంబోలో రానున్న ‘వార్2’ మూవీ గురించి ఓ వార్త వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో నటుడు జగపతిబాబు నటిస్తున్నట్లు తెలుస్తోంది. తారక్‌కు తండ్రి పాత్రలో ఆయన నటిస్తున్నట్లు టాక్. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించనున్నట్లు తెలుస్తోంది. జాన్ అబ్రహం విలన్‌గా కనిపించనున్నట్లు టాక్.

పదేళ్ల బీజేపీ పాలన ట్రైలర్ మాత్రమేనని ప్రధాని మోదీ అన్నారు. అసలు అభివృద్ధి ముందుందని చెప్పారు. యూపీలో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. దేశాన్ని మరింత ప్రగతి పథంలో నడిపించే రోడ్ మ్యాప్ సిద్ధంగా ఉందన్నారు. బీజేపీ మూడో సారి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. లోక్‌సభ ఎన్నికలు ‘వికసిత్ భారత్’ నిర్మాణం కోసం జరుగుతున్నవని చెప్పారు.

CSK మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అరుదైన రికార్డు నెలకొల్పారు. టీ20ల్లో 300 క్యాచులు అందుకున్న తొలి వికెట్ కీపర్‌గా నిలిచారు. ఇవాళ ఢిల్లీతో మ్యాచులో పృథ్వీషా క్యాచ్‌తో ఈ ఘనత అందుకున్నారు. ఆ తర్వాతి స్థానాల్లో కమ్రాన్ అక్మల్(274), దినేశ్ కార్తీక్(274), డికాక్(270), జోస్ బట్లర్(209) ఉన్నారు.

TG: పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు ఏప్రిల్ నెలాఖరులో విడుదలయ్యే అవకాశాలున్నాయి. ప్రధాన పరీక్షలు ముగిసిన నెల రోజుల్లో ఫలితాలను ప్రకటించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ప్రధాన పరీక్షలు నిన్నటితో ముగియగా, కొన్ని మైనర్ సబ్జెక్టుల పరీక్షలు మంగళవారం వరకు జరగనున్నాయి. టెన్త్ పరీక్షలకు సుమారు 5.08 లక్షల మంది హాజరయ్యారు.
Sorry, no posts matched your criteria.