India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

భారీ స్కామ్‌లో మరణశిక్ష పడిన వియత్నాం సంపన్న <<13034140>>మహిళ<<>> ట్రూంగ్ మై లాన్ తెలివితేటలు ఆర్థిక నిపుణులనే ఆశ్చర్యపరుస్తున్నాయి. వందలకొద్దీ షెల్ కంపెనీలు, డజన్లకొద్దీ బినామీలతో ఆమె SCB బ్యాంకులో తప్పుడు పత్రాలు సమర్పించి 12.5బిలియన్ డాలర్లను విత్‌డ్రా చేశారు. అధికారులకు ఇష్టమొచ్చినట్లు లంచాలు ఇచ్చారు. విత్‌డ్రా చేసిన ఆ రెండు టన్నుల బరువున్న నగదును ఇంటి బేస్‌మెంట్‌లో భద్రపరచడం ప్రపంచాన్ని నివ్వెరపరుస్తోంది.

మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ ఇటీవల తన భార్య సాగరికాతో కలిసి హిందూ పండుగ ‘గుడీ పడ్వా’ను సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ ఫొటోలను ఇన్‌స్టాలో పోస్టు చేయగా, ఇస్లామిస్టులు దుర్భాషలాడారు. ‘జహీర్ మూర్ఖుడు. అతనికి ఇస్లాంపై విశ్వాసం బలహీనంగా ఉంది. తన భార్యను ఈ మతంలోకి మార్చలేకపోయాడు’ అని కొందరు కామెంట్ చేశారు. అన్ని మతాలను గౌరవించే దేశంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.

‘హలో.. రేటెంత?’, ‘అమ్మాయి కావాలి’ అని కాల్స్ వస్తుండటంతో బెంగళూరులోని యశ్వంతపురలో ఓ వివాహిత పోలీసులను ఆశ్రయించింది. పోలీసుల దర్యాప్తులో నివ్వెరపోయే విషయాలు వెలుగుచూశాయి. వేధింపుల వల్ల విడాకులకు అప్లై చేసినందుకు ఆమెపై భర్తే కక్షగట్టినట్లు తేలింది. FBలో అకౌంట్ క్రియేట్ చేసి ఆమె ఫోన్ నంబర్ అందులో పెట్టాడు. ‘కాల్ గర్ల్స్ కావాలా?’ అని ప్రకటించాడు. ప్రస్తుతం అతడు విదేశాల్లో ఉన్నాడు.

IPL-2024లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. 168 పరుగుల లక్ష్యాన్ని 18.1 ఓవర్లలో ఛేదించింది. DC బ్యాటర్లలో మెక్‌గర్క్ 55, పంత్ 41, పృథ్వీ షా 32 రన్స్‌తో రాణించారు. ఈ సీజన్‌లో ఢిల్లీకి ఇది రెండో విజయం కాగా లక్నోకు రెండో ఓటమి.

AP: సీఎం జగన్‌ను జైలుకు పంపడం ఖాయమని, ఎన్నికలకు ముందా? తర్వాతా? అనేదే ప్రశ్న అని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. తాను విజయవాడ ఎయిర్‌పోర్టులో వేచి చూస్తుండగా ఓ న్యూస్ పేపర్‌లో ‘మోదీ గ్యారంటీ.. అవినీతిపరులంతా జైలుకే’ అనే హెడ్డింగ్ ఆకట్టుకుందని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని గద్దె దించి, ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని రాసుకొచ్చారు.

అయోధ్యలో మరో అద్భుతం ఆవిష్కృతం కానుంది. బాలరాముడు కొలువుదీరిన తర్వాత తొలిసారి ఈ నెల 17న శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ఆ రోజున మధ్యాహ్నం 12 గంటలకు రాముడి నుదుటిపై 75MM వ్యాసార్థంతో సూర్య కిరణాలు ప్రసరించనున్నాయి. దాదాపు 6 నిమిషాలపాటు ఈ అపురూప దృశ్యం భక్తులకు కనువిందు చేయనుంది. ఏటా నవమి రోజున ఇలా జరిగేలా ఆలయాన్ని నిర్మించారు.

జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా సీక్వెల్‌లో రామ్ చరణ్, జాన్వీ కపూర్ కలిసి నటిస్తే చూడాలని ఉందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. త్వరలోనే ఆ కల నెరవేరాలని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘చరణ్‌తో కలిసి జాన్వీ ఓ సినిమా చేస్తోంది. ఇటీవల ఆమెతో మాట్లాడుతుంటే శ్రీదేవి గుర్తుకొచ్చి భావోద్వేగానికి గురయ్యా. ఇండస్ట్రీ ఓ మంచి నటిని కోల్పోయింది’ అని పేర్కొన్నారు.

ఆయుష్ బదోని(LSG) లోయర్ ఆర్డర్‌లో అదరగొడుతున్నారు. ఆ జట్టు తరఫున 6 లేదా దిగువన బ్యాటింగ్‌కు దిగి అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన 5 సందర్భాల్లోనూ ఇతనే పార్ట్‌నర్. 2023లో పూరన్‌తో కలిసి 84, 74, 59 రన్స్, ఇవాళ అర్షద్‌తో కలిసి 73*, 2022లో KLతో కలిసి 47 రన్స్ చేశారు. అలాగే IPL హిస్టరీలో 8 లేదా దిగువ స్థానాల్లో రెండో అత్యధిక భాగస్వామ్యం(73*) నెలకొల్పిన జంటగా బదోని-అర్షద్ ఘనత సాధించారు.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు HRAను సవరించే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి ఉత్తర్వులు రానున్నట్లు సమాచారం. డీఏ 50శాతానికి చేరిన నేపథ్యంలో X కేటగిరీ నగరాల ఉద్యోగులకు 30శాతం, Y కేటగిరీల ఉద్యోగులకు 20శాతం, Z కేటగిరీ ఉద్యోగులకు 10% రేట్లు సవరించాలని 7వ వేతన సవరణ కమిషన్ గతంలో వెల్లడించింది. దీంతో HRAలో ఎంత పెంపు ఉంటుందా? అని ఉద్యోగులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

AP: రేపు 14వ రోజు సీఎం జగన్ బస్సు యాత్ర షెడ్యూల్‌ను వైసీపీ విడుదల చేసింది. నంబూరు బైపాస్ నుంచి ఉదయం 9 గంటలకు ప్రారంభమై.. కాజా, మంగళగిరి మీదుగా ఉ.11 గంటలకు CK కన్వెన్షన్ వద్ద చేనేత కార్మికులతో మాట్లాడుతారు. అనంతరం కుంచనపల్లి, తాడేపల్లి, వారధి, శిఖామణి సెంటర్, చుట్టుగుంట, భగత్ సింగ్ రోడ్, పైపుల రోడ్, కండ్రిక, రామవరప్పాడు, నిడమానూరు మీదుగా కేసరపల్లికి చేరుకుని రాత్రి బస శిబిరంలో నిద్రిస్తారు.
Sorry, no posts matched your criteria.