News March 31, 2024

శుభ ముహూర్తం

image

తేది: మార్చి 31, ఆదివారం
బహుళ షష్ఠి: రాత్రి 09:31 గంటలకు
జ్యేష్ఠ: రాత్రి 10:56 గంటలకు
దుర్ముహూర్తం: మధ్యాహ్నం 04:39- 05:27 గంటల వరకు
వర్జ్యం: తెల్లవారుజామున 03:52- 5:31 గంటల వరకు

News March 31, 2024

TODAY HEADLINES

image

*TG: కరెంట్ కోతలు, తాగునీటి సమస్యలు ఉండొద్దు: రేవంత్
*TG: KTRపై క్రిమినల్ కేసు నమోదు
*AP: మంచి పాలన అందించడానికి తోడుగా ఉండండి: జగన్
*AP: కమల్ హాసన్‌ను మించిన నటుడు జగన్: చంద్రబాబు
*AP: నన్ను ఒక్కసారి అసెంబ్లీకి పంపించండి: పవన్
*AP: వాలంటీర్ల విధులపై ఈసీ ఆంక్షలు
*AP: ప్రతి మహిళకు నెలకు రూ.8,500: షర్మిల
*IPL: పంజాబ్‌పై లక్నో విజయం

News March 30, 2024

ఇంట్లోనే అడ్వాణీకి భారతరత్న ప్రదానం

image

ఈరోజు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీలో నలుగురికి భారతరత్న పురస్కారాలు అందజేశారు. మాజీ పీఎం పీవీ నరసింహరావు, వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్‌, మాజీ PM చరణ్ సింగ్, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్‌ తరఫున వారి కుటుంబ సభ్యులు అవార్డు అందుకున్నారు. అయితే అడ్వాణీ ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆయన ఈ కార్యక్రమానికి రాలేకపోయారు. దీంతో రాష్ట్రపతి, ప్రధాని రేపు ఆయన ఇంటికి వెళ్లి అవార్డు ప్రదానం చేయనున్నారు.

News March 30, 2024

మయాంక్ దెబ్బ.. పంజాబ్ ఓటమి

image

లక్నో సూపర్ జెయింట్స్ పేస్ సెన్సేషన్ మయాంక్ యాదవ్ దెబ్బకు పంజాబ్ కింగ్స్ కుదేలైంది. 200 రన్స్ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన పంజాబ్‌కు మంచి ఆరంభం లభించింది. ఓపెనర్లు శిఖర్(70), బెయిర్‌స్ట్రో(42) రాణించారు. అయితే మయాంక్ నిప్పులు చెరిగే బంతులతో 3 వికెట్లు తీసి మ్యాచ్‌ను పంజాబ్ నుంచి లాగేశారు. ఆఖర్లో పంజాబ్ బ్యాటర్లు విఫలమవడంతో 20 ఓవర్లలో 178/5 రన్స్ మాత్రమే చేసింది. 21 రన్స్ తేడాతో ఓడింది.

News March 30, 2024

‘సచిన్, సీమా హైదర్ పెళ్లి చెల్లదు’

image

పబ్జీ లవర్స్ సచిన్, సీమా హైదర్ పెళ్లి చెల్లదని సీమా మొదటి భర్త గులామ్ హైదర్ లక్నో కోర్టులో కేసు వేశాడు. విచారణ సందర్భంగా గులామ్ తరఫు భారత న్యాయవాది మోమిన్ మాలిక్ వాదనలు వినిపించారు. సీమా మొదటి భర్త నుంచి విడాకులు పొందలేదని, భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించినప్పుడు తన భర్త పేరు గులామ్‌గా పేర్కొందని తెలిపారు. కాగా భారత్‌లో కేసు నమోదు చేయడానికి పాక్ పౌరులకు అనుమతి లేదని సీమా తరఫు లాయర్ వాదించారు.

News March 30, 2024

లోకేశ్‌కు Z కేటగిరీ భద్రత

image

టీడీపీ నేత నారా లోకేశ్‌కు జెడ్ కేటగిరీ భద్రత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ ప్రేరేపిత దాడులు, నక్సలైట్ల హెచ్చరికలు, ఇంటెలిజెన్స్ రిపోర్టుల ఆధారంగా ఆయనకు ఈ భద్రత కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా లోకేశ్‌కు CRPF బలగాలతో భద్రత కల్పించనున్నారు.

News March 30, 2024

సీఎం, 10మంది MLAలు ఏకగ్రీవం

image

అరుణాచల్ ప్రదేశ్‌లో ఏప్రిల్ 19న ఎన్నికలు జరగనున్నాయి. కాగా.. సీఎం పెమా ఖండూ సహా 10మంది BJP ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డిప్యూటీ సీఎంగా చౌనా మెయిన్ ఉండనున్నారు. నామినేషన్ ఉపసంహరణ గడువు ముగియడంతో ఖండూతో పాటు మరో 9మంది ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రధాన ఎన్నికల అధికారి పవన్ కుమార్ సైన్ ప్రకటించారు. ఆ రాష్ట్రంలో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలున్నాయి.

News March 30, 2024

బయట ఛార్జింగ్ పెట్టేవారికి వార్నింగ్

image

బహిరంగ ప్రదేశాల్లోని USB ఛార్జింగ్ స్టేషన్ల వద్ద ఫోన్లు ఛార్జింగ్ పెట్టేవారికి కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఎయిర్‌పోర్టులు, కేఫ్స్, హోటల్స్, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లలో USB ఛార్జర్ స్కాం జరుగుతోందని తెలిపింది. బహిరంగ ప్రదేశాల్లోని ఛార్జర్ల ద్వారా సైబర్ నేరస్థులు ప్రమాదకర మాల్వేర్‌ను ఫోన్లలోకి పంపుతున్నారని పేర్కొంది. దీనివల్ల యూజర్ల వ్యక్తిగత సమాచారం చోరీకి గురవుతున్నట్లు వెల్లడించింది.

News March 30, 2024

వారి పిల్లల స్కూల్ ఫీజు రూ.20.4లక్షలు

image

ఇటీవల ముంబైలో ధీరూబాయ్ అంబానీ స్కూల్ యాన్యువల్ ఫంక్షన్ గ్రాండ్‌గా జరిగింది. అందులో టాప్ సెలబ్రిటీల పిల్లలు సందడి చేశారు. దీంతో ఈ స్కూల్‌లో ఫీజులు ఎంత ఉంటాయో అనే ఆసక్తి చాలామందిలో నెలకొంది. LKG-7వ తరగతి వరకూ ఫీజు నెలకు రూ.1.70లక్షలు ఉంటుందట. అంటే ఇందులో చదివే రోహిత్‌శర్మ, షారుఖ్‌, అభిషేక్ బచ్చన్ వంటి వారి పిల్లల ఏడాది ఫీజు రూ.20లక్షలు అన్నమాట. అంటే చాలామంది ఉద్యోగుల ఏడాది జీతం కంటే ఎక్కువే.

News March 30, 2024

సన్నీ డియోల్‌కు బీజేపీ షాక్

image

ప్రముఖ నటుడు, ఎంపీ సన్నీ డియోల్‌కు బీజేపీ షాక్ ఇచ్చింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తాజాగా 8వ జాబితా విడుదల చేసిన ఆ పార్టీ.. సన్నీకి టికెట్‌‌ను నిరాకరించింది. ప్రస్తుతం ఆయన గుర్దాస్‌పుర్ ఎంపీగా ఉన్నారు. అక్కడ ఆయనను కాదని దినేశ్ సింగ్ బబ్బూకు టికెట్ ఇచ్చింది. మరోవైపు మాజీ దౌత్యవేత్త తరంజిత్ సంధూను అమృత్‌సర్ నుంచి బీజేపీ బరిలో నిలిపింది.