India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

1865: పాశ్యాత్య వైద్యంలో పట్టాపొందిన తొలి భారత మహిళా వైద్యురాలు ఆనందీబాయి జోషి జననం
1987: చదరంగ క్రీడాకారిణి కోనేరు హంపి జననం
1984: నటి రక్షిత జననం
1939: నటుడు, నాటక రచయిత సయ్యద్ హుసేన్ బాషా జననం
1727: ప్రముఖ శాస్త్రవేత్త ఐజాక్ న్యూటన్ మరణం
అంతర్జాతీయ లింగమార్పిడి దినోత్సవం

తేది: మార్చి 31, ఆదివారం
ఫజర్: తెల్లవారుజామున గం.04:59
సూర్యోదయం: ఉదయం గం.6:11
జొహర్: మధ్యాహ్నం గం.12:20
అసర్: సాయంత్రం గం.4:44
మఘ్రిబ్: సాయంత్రం గం.6:29
ష: రాత్రి గం.07.42
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

పెరూ దేశ అధ్యక్షురాలు డైనా బులురెటే ఇంట్లో ACB అధికారుల సోదాలు నిర్వహించడం సంచలనంగా మారింది. ఆమె రోలెక్స్ వాచీనే ఇందుకు కారణం. ప్రజా రికార్డుల్లో చూపించని ఖరీదైన వాచీని ఆమె పెట్టుకున్నారంటూ పత్రికల్లో వార్తలు ప్రచురితమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆమె అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతికి పాల్పడ్డారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే నేరం రుజువైనా పదవీకాలం పూర్తయ్యే వరకు ఆమెపై చర్యలు తీసుకోలేరు.

తనకు ప్రేమలో పడాలని అనిపిస్తోందని స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ అన్నారు. ‘నేను ఇప్పటివరకూ ఏ రిలేషన్‌షిప్‌లోనూ లేను. షూటింగ్స్ వల్ల పర్సనల్ లైఫ్ మిస్సవుతున్నా. నాకూ సాధారణ జీవితం గడపాలని ఉంది. 20 ఏళ్లకే పెళ్లి చేసుకుని, ఇద్దరు పిల్లల్ని కనాలని అనుకున్నా. కానీ ఇండస్ట్రీలోకి రావడంతో అది కుదరలేదు. నాకు మరణం అంటే భయం. నేను చనిపోతే నా కుటుంబం ఏమవుతుందో భయంగా ఉంటుంది’ అని ఆమె చెప్పారు.

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

తేది: మార్చి 31, ఆదివారం
బహుళ షష్ఠి: రాత్రి 09:31 గంటలకు
జ్యేష్ఠ: రాత్రి 10:56 గంటలకు
దుర్ముహూర్తం: మధ్యాహ్నం 04:39- 05:27 గంటల వరకు
వర్జ్యం: తెల్లవారుజామున 03:52- 5:31 గంటల వరకు

*TG: కరెంట్ కోతలు, తాగునీటి సమస్యలు ఉండొద్దు: రేవంత్
*TG: KTRపై క్రిమినల్ కేసు నమోదు
*AP: మంచి పాలన అందించడానికి తోడుగా ఉండండి: జగన్
*AP: కమల్ హాసన్‌ను మించిన నటుడు జగన్: చంద్రబాబు
*AP: నన్ను ఒక్కసారి అసెంబ్లీకి పంపించండి: పవన్
*AP: వాలంటీర్ల విధులపై ఈసీ ఆంక్షలు
*AP: ప్రతి మహిళకు నెలకు రూ.8,500: షర్మిల
*IPL: పంజాబ్‌పై లక్నో విజయం

ఈరోజు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీలో నలుగురికి భారతరత్న పురస్కారాలు అందజేశారు. మాజీ పీఎం పీవీ నరసింహరావు, వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్, మాజీ PM చరణ్ సింగ్, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్ తరఫున వారి కుటుంబ సభ్యులు అవార్డు అందుకున్నారు. అయితే అడ్వాణీ ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆయన ఈ కార్యక్రమానికి రాలేకపోయారు. దీంతో రాష్ట్రపతి, ప్రధాని రేపు ఆయన ఇంటికి వెళ్లి అవార్డు ప్రదానం చేయనున్నారు.

లక్నో సూపర్ జెయింట్స్ పేస్ సెన్సేషన్ మయాంక్ యాదవ్ దెబ్బకు పంజాబ్ కింగ్స్ కుదేలైంది. 200 రన్స్ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన పంజాబ్‌కు మంచి ఆరంభం లభించింది. ఓపెనర్లు శిఖర్(70), బెయిర్‌స్ట్రో(42) రాణించారు. అయితే మయాంక్ నిప్పులు చెరిగే బంతులతో 3 వికెట్లు తీసి మ్యాచ్‌ను పంజాబ్ నుంచి లాగేశారు. ఆఖర్లో పంజాబ్ బ్యాటర్లు విఫలమవడంతో 20 ఓవర్లలో 178/5 రన్స్ మాత్రమే చేసింది. 21 రన్స్ తేడాతో ఓడింది.
Sorry, no posts matched your criteria.