India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తెలంగాణ ఏర్పాటుపై బీఆర్ఎస్ సీనియర్ నేత కె.కేశవరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఏర్పాటు పాటలు పాడినందుకో, డాన్సులు చేస్తేనో, ధర్నాలు, పబ్లిక్ మీటింగ్స్ వల్లో రాలేదని అన్నారు. బిల్లు పాస్ చేయడం ద్వారా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందని పేర్కొన్నారు. అయితే ఉద్యమ స్ఫూర్తినిచ్చాయని అన్నారు. పార్లమెంటులో కొట్లాడింది మాత్రం కాంగ్రెస్ ఎంపీలేనని ఆయన చెప్పుకొచ్చారు.

కోల్‌కతా నైట్ రైడర్స్ సోషల్ మీడియా హ్యాండిల్లో ఆసక్తికరమైన ఫొటోలు షేర్ చేసింది. ఆ జట్టు మెంటార్ గౌతం గంభీర్, ఆర్సీబీ ఆటగాడు కోహ్లీ ఉన్న ఫొటోను పంచుకుంది. ఒకదాంట్లో కోహ్లీని, మరో దాంట్లో గౌతీని హైలైట్ చేసింది. అయితే.. ఐపీఎల్‌లో వీరిద్దరి మధ్య పలుమార్లు మాటల యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. ఈరోజు RCBతో KKR మ్యాచ్ ఆడనుంది. ఈ నేపథ్యంలోనే ఆ జట్టు ఈ ఫొటో షేర్ చేసింది.

AP: పల్నాడు జిల్లా చిలకలూరిపేట వైసీపీ నేత మల్లెల రాజేశ్ నాయుడు టీడీపీలో చేరారు. నారా లోకేశ్ సమక్షంలో ఆయనతో పాటు 10 మంది కౌన్సిలర్లు, ఒక జడ్పీటీసీ, ఇద్దరు సర్పంచులు టీడీపీ కండువా కప్పుకున్నారు. చిలకలూరిపేట సమన్వయకర్త పదవి నుంచి వైసీపీ తొలగించినప్పటి నుంచి రాజేశ్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. టికెట్ కోసం మంత్రి రజనీ తన వద్ద రూ.6కోట్లు తీసుకున్నారంటూ ఆయన చేసిన <<12839437>>ఆరోపణలు <<>>దుమారం రేపిన సంగతి తెలిసిందే.

AP: మొదటి నుంచి భీమిలి సీటు కోసం పట్టుబడుతున్న గంటా శ్రీనివాసరావు తన పంతం నెగ్గించుకున్నారు. ఆయనను చీపురుపల్లిలో మంత్రి బొత్స సత్యనారాయణపై పోటీకి దింపాలని TDP భావించగా గంటా ససేమీరా అన్నారు. అధినేత చంద్రబాబుతో పలుమార్లు భేటీ అయి చర్చించిన ఆయన.. చివరకు భీమిలి సీటును కన్ఫార్మ్ చేసుకున్నారు. విశాఖ జిల్లాలో ఓటమెరుగని నేతగా ఉన్న శ్రీనివాసరావు ఈసారి భీమిలిలో పసుపు జెండా రెపరెపలాడిస్తారో? లేదో చూడాలి.

TG: వరంగల్‌లో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. బీఆర్ఎస్ పార్టీని వీడుతున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ప్రకటించారు. ఈరోజు ఆయన కేటీఆర్‌తో భేటీ కానున్నారు. ఇటీవల అసెంబ్లీ టికెట్ రాకపోవడంతో రాజయ్య బీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. ఇప్పుడు అవకాశం వస్తే రాజీనామాను ఉపసంహరించుకునేందుకు సిద్ధమయ్యారట.

ప్రియుడు మథియస్‌తో పెళ్లి ప్రచారం నేపథ్యంలో హీరోయిన్ తాప్సీ ఆసక్తికర పోస్ట్ చేశారు. చీరపై కోటు ధరించి ఉన్న ఫొటోలను షేర్ చేస్తూ ‘ఈ చీరతో రొమాన్స్ ఎప్పటికీ ముగియదని నమ్ముతున్నా’ అని పేర్కొన్నారు. దీంతో నిజంగా చీర గురించే మాట్లాడుతున్నావా? లేదా మథియస్‌తో బంధం శాశ్వతంగా నిలిచిపోవాలని పరోక్షంగా చెబుతున్నావా? తాప్సీ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘పుష్ప’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా రాబోతున్న ‘పుష్ప-2’ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శరత్ బిగ్ అప్‌డేట్ ఇచ్చారు. సోషల్ మీడియాలో పుష్ప-2 అప్‌డేట్ ఇవ్వండన్న ఫ్యాన్స్ ప్రశ్నకు ‘బన్ని బర్త్‌డే(APR-8)కి టీజర్ ఉంటుంది’ అని రిప్లై ఇచ్చారు.

బ్రెజిల్ పరిశోధకులు కొకైన్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నారు. డ్రగ్స్‌కు బానిస కాకుండా యువతకు ఇది ఉపయోగపడుతుందంటున్నారు. అయితే, దీన్ని చికిత్సతో పాటు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాక్సిన్ కొకైన్‌ను బ్రెయిన్‌కు చేరకుండా ఆపుతుందట. ఇది సక్సెస్ అయితే.. ప్రపంచంలోనే మొదటి కొకైన్ వ్యాక్సిన్‌గా నిలుస్తుంది. మరోవైపు 2021లో 22మిలియన్ల మంది డ్రగ్స్ తీసుకున్నట్లు UN అంచనా.

సన్‌రైజర్స్ ప్లేయర్ అభిషేక్ శర్మను అభినందిస్తూనే సున్నితంగా హెచ్చరించాడు మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్. ముంబైతో మ్యాచ్‌లో సూపర్ ఇన్నింగ్స్ ఆడినందుకు అభిషేక్‌ను ప్రశంసించారు. అయితే చెత్త షాట్‌కు ఔట్ కావడం మంచిది కాదని సూచించారు. మరోసారి ఇలా చేస్తే దెబ్బలు పడతాయంటూ పోస్ట్ చేశారు. కాగా మొన్న ముంబై, సన్‌రైజర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే.

ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఆ మ్యాచ్‌ను చూసేందుకు వచ్చిన SRH ప్లేయర్ అభిషేక్ శర్మ తల్లిదండ్రులను టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ కలుసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటో వైరలవుతోంది. అభిషేక్ సిక్సులు, ఫోర్లతో అదరగొడుతుంటే అతని తల్లిదండ్రులు సంతోషంలో మునిగితేలారు. శర్మ 7 సిక్సులు, 3 ఫోర్లతో 63 రన్స్ చేశారు.
Sorry, no posts matched your criteria.