News April 6, 2024

రేపు 64 మండలాల్లో తీవ్ర వడగాలులు

image

AP: రాష్ట్రంలో ఎండలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రేపు 64 మండలాల్లో తీవ్ర వడగాలులు, 222 మండలాలలో వడగాలులు వీచే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. సగటున 40-44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం బయటకు రావొద్దని సూచించింది. వడగాలులు వీచే మండలాల జాబితా కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

Similar News

News October 9, 2024

నేడు విజయవాడ దుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం

image

నేడు విజయవాడ దుర్గమ్మకు AP సీఎం చంద్రబాబు సతీసమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఇవాళ మూల నక్షత్రం కావడంతో అమ్మవారు సరస్వతీ మాతగా దర్శనమివ్వనున్నారు. ఈ క్రమంలో దుర్గమ్మను వీక్షించేందుకు ఇంద్రకీలాద్రికి 2 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. క్యూలైన్లలో నీరు, మజ్జిగ, పాలు పంపిణీ చేస్తామని మంత్రి ఆనం నారాయణ రెడ్డి తెలిపారు.

News October 9, 2024

నిలవాలంటే గెలవాల్సిందే..

image

మహిళల టీ20 వరల్డ్ కప్‌లో భారత జట్టు ఇవాళ శ్రీలంకతో తలపడనుంది. ఆడిన రెండు మ్యాచుల్లో ఒకే విజయం సాధించిన టీమ్ ఇండియా ఈ మ్యాచ్‌లో తప్పక గెలవాల్సి ఉంది. విజయం సాధిస్తే సెమీస్ ఆశలు పదిలం కానున్నాయి. నిన్న ఆస్ట్రేలియాపై భారీ తేడాతో న్యూజిలాండ్ ఓటమి భారత్‌కు కాస్త ప్లస్‌గా మారింది. కాగా మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రసారం కానుంది.

News October 9, 2024

విదేశీ విద్య: ఏ ఇన్‌టేక్ మంచిది..?

image

విదేశీ విద్యకు వెళ్లాలంటే ఫాల్, సమ్మర్‌ అనే రెండు సీజన్లుంటాయి. ఫాల్ ఇన్‌టేక్ ఏటా ఆగస్టు చివరిలో లేదా సెప్టెంబరులో స్టార్ట్ అవుతుంది. వర్సిటీలు విస్తృత కోర్సులు ఆఫర్ చేస్తాయి. ఎక్కువశాతం మంది ఎంచుకునే ఆప్షన్ ఇది. పార్ట్ టైమ్‌ అవకాశాలు బాగుంటాయి. ఇక సమ్మర్ ఇన్‌టేక్ అంటే ఏటా మే నుంచి ఆగస్టు వరకు ఉంటుంది. చదువు త్వరగా పూర్తి చేయాలనుకునేవారు ఈ ఇన్‌టేక్‌ గురించి ఆలోచించొచ్చని నిపుణులు చెబుతున్నారు.