News April 25, 2024

ఏంటీ ‘లుక్ బిట్వీన్’ ట్రెండ్?

image

ట్విటర్ ట్రెండింగ్‌లో ఉన్న ‘లుక్ బిట్వీన్ యువర్ <<13113500>>కీ<<>> బోర్డ్’ ట్రెండ్ కొత్తదేం కాదు. 2021లో K-ON అనే యానిమేటెడ్‌ సిరీస్‌లో పాత్రను పరిచయం చేయడానికి 4Chan అనే వెబ్‌సైట్‌ ఈ ట్రెండ్‌ను మొదలుపెట్టింది. లుక్ బిట్వీన్ T అండ్‌ O అంటూ ‘YUI’ అనే పాత్రను పరిచయం చేశారు. మూడేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఆ ట్రెండ్‌ను నెటిజన్లు అందిపుచ్చుకున్నారు. ఎన్నికల వేళ ఈ ట్రెండ్‌ బాగా వైరల్ అవుతోంది.

News April 25, 2024

మా సరిహద్దుల్లో నాటో డ్రిల్స్.. మంచిది కాదు: రష్యా

image

తమ దేశ సరిహద్దుల్లో నాటో కూటమి సైనిక డ్రిల్స్ చేపట్టడం మంచి విషయం కాదని రష్యా తాజాగా హెచ్చరించింది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం నుంచి రష్యా-ఫిన్లాండ్ సరిహద్దుల వద్ద నాటో బలగాలు సైనిక విన్యాసాలు ప్రారంభించనున్నాయి. ఆ పరిణామాల్ని నిశితంగా పరిశీలిస్తున్నామని రష్యా స్పష్టం చేసింది. తమ భద్రతకు ఏమాత్రం ముప్పు వాటిల్లినా, అందుకు తగినట్లుగా రాజకీయ, సైనిక చర్యల్ని తీసుకుంటామని తేల్చిచెప్పింది.

News April 25, 2024

సికింద్రాబాద్‌లో గెలిచిన పార్టీదే కేంద్రంలో అధికారం: CM రేవంత్

image

TG: సికింద్రాబాద్‌లో ఏ పార్టీ గెలుస్తుందో ఆ పార్టీయే కేంద్రంలో అధికారంలోకి వస్తుందని CM రేవంత్ అన్నారు. ‘దత్తాత్రేయను అంజన్ కుమార్ ఓడించినప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. 20 ఏళ్ల తర్వాత ఆనాటి రోజులు పునరావృతం కాబోతున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచి కేంద్రంలో అధికారంలోకి రానుంది. దానం నాగేందర్ కేంద్రంలో కీలక బాధ్యతలు నిర్వహిస్తారు’ అని సికింద్రాబాద్ మీటింగ్‌లో వ్యాఖ్యానించారు.

News April 25, 2024

అప్పులు తెచ్చి బటన్లు నొక్కడం గొప్పా?: బాబు

image

AP: అప్పులు తెచ్చి బటన్లు నొక్కడం పెద్ద గొప్పా? అని టీడీపీ చీఫ్ చంద్రబాబు ప్రశ్నించారు. ‘ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అసమర్థ ప్రభుత్వంలో అన్ని వర్గాలకూ ఇబ్బందులే. ఉత్తరాంధ్ర ద్రోహి జగన్. ఏమీ చేయకుండా ప్రజలకు కథలు చెప్పడానికి ఇక్కడికి వస్తున్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి దిమ్మతిరిగే తీర్పు ఇవ్వాలి. ఆ పార్టీని బంగాళాఖాతంలో కలిపేయండి’ అని ఆయన పిలుపునిచ్చారు.

News April 25, 2024

రికార్డ్ సృష్టించిన IPL-2024

image

క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగిస్తున్న IPL సగం సీజన్ పూర్తయింది. మొత్తం 74 మ్యాచుల్లో నిన్న CSK, LSG మధ్య గేమ్‌తో 37 మ్యాచులయ్యాయి. ఎన్నడూ లేనంతగా ఈసారి రికార్డులు బద్దలవుతున్నాయి. ఇప్పటికే 8.99 రన్‌రేట్‌తో IPLలో మోస్ట్ హైస్కోరింగ్ సీజన్‌గా ఇది రికార్డ్ సృష్టించింది. ఇప్పటివరకు ఈ సీజన్‌లో 7 సెంచరీలు, 668 సిక్సర్లు నమోదయ్యాయి. టోర్నీ చరిత్రలో అత్యధిక స్కోర్ (SRH-287) రికార్డు కూడా బద్దలైంది.

News April 25, 2024

మిర్యాలగూడకు బయల్దేరిన కేసీఆర్

image

TG: లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి మాజీ సీఎం కేసీఆర్ తెరలేపారు. తెలంగాణ తల్లికి పూలమాల వేసి బస్సులో మిర్యాలగూడకు బయల్దేరారు. ఇవాళ సాయంత్రం 5.30 గంటలకు మిర్యాలగూడ నుంచి సూర్యపేటకు బస్సుయాత్రను ప్రారంభిస్తారు.

News April 25, 2024

సమ్మర్‌లో ఎలక్షన్స్ ఏంటని విమర్శ.. జైశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

image

వడగాలులు వీచే సమయంలో భారత్ ఎన్నికలు నిర్వహించడం ఏంటని ఓ వెస్ట్రన్ మీడియా ప్రచురించిన కథనానికి విదేశాంగ మంత్రి జైశంకర్ దీటుగా జవాబు ఇచ్చారు. ‘వెస్ట్ మీడియా నుంచి తరచూ ఇలాంటి విమర్శలు వస్తాయి. అవగాహన లేక కాదు, మన ఎన్నికల్లో వాళ్లు రాజకీయంగా కీలక పాత్ర పోషిస్తారని భావించి విమర్శిస్తుంటారు. మా దగ్గర కనిష్ఠ పోలింగ్ శాతం మీ ఆల్ టైమ్ హై కంటే ఎక్కువ. రాజకీయంలో భాగంగానే ఈ విమర్శలు’ అని మండిపడ్డారు.

News April 25, 2024

భార్య చనిపోయిందని భర్త ఆత్మహత్య

image

యూపీలోని హర్దోయ్ ప్రాంతానికి చెందిన యోగేశ్(36), మణికర్ణిక(28)కు ఆర్నెల్ల క్రితం వివాహమైంది. అన్యోన్యంగా జీవిస్తున్న వారి దాంపత్యంపై విధి పగబట్టింది. మణికర్ణిక ఓ రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. ప్రాణంగా చూసుకుంటున్న భార్య మరణాన్ని తట్టుకోలేకపోయిన యోగేశ్, తాను కూడా ఆత్మహత్య చేసుకుని తనువు చాలించారు. ‘కలిసి బతికాం, కలిసే చనిపోతాం’ అంటూ ఆయన రాసిన సూసైడ్ లెటర్ స్థానికంగా విషాదాన్ని నింపింది.

News April 25, 2024

ఎన్నికల వేళ మణిపుర్‌లో పేలుళ్లు.. బ్రిడ్జి ధ్వంసం

image

మణిపుర్‌లో మరో రెండు రోజుల్లో రెండో దశ ఎన్నికలు జరగనుండగా మరోసారి హింస చెలరేగింది. కంగ్‌పోక్పి జిల్లా సపోర్‌మెయినా ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు పేలుళ్లకు పాల్పడి బ్రిడ్జిని ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం నమోదు కాలేదు. అయితే ఈ బ్రిడ్జి నాగాలాండ్‌కు కనెక్ట్ అయ్యే రహదారిలో భాగం కావడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈనెల 26న రెండో విడత పోలింగ్ జరగనుంది.

News April 25, 2024

OTTలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ మూవీ

image

మలయాళ బ్లాక్‌బస్టర్ మూవీ మంజుమ్మల్ బాయ్స్ OTT స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. మే 3 నుంచి ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. మలయాళంలో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ఈ సినిమా తెలుగులోనూ మంచి వసూళ్లు రాబడుతోంది. ఓ గుహలో చిక్కుకున్న ఫ్రెండ్‌ను కాపాడేందుకు తోటి మిత్రులు చేసే పోరాటం నేపథ్యంలో డైరెక్టర్ చిదంబరం ఈ సినిమాను తెరకెక్కించారు.