News April 25, 2024

OTTలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ మూవీ

image

మలయాళ బ్లాక్‌బస్టర్ మూవీ మంజుమ్మల్ బాయ్స్ OTT స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. మే 3 నుంచి ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళం భాషల్లో డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. మలయాళంలో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ఈ సినిమా తెలుగులోనూ మంచి వసూళ్లు రాబడుతోంది. ఓ గుహలో చిక్కుకున్న ఫ్రెండ్‌ను కాపాడేందుకు తోటి మిత్రులు చేసే పోరాటం నేపథ్యంలో డైరెక్టర్ చిదంబరం ఈ సినిమాను తెరకెక్కించారు.

News April 25, 2024

వైసీపీ పాలనలో మహిళలు నష్టపోయారు: ఎంపీ

image

AP: దేశంలో మహిళలపై ఎక్కువగా అత్యాచారాలు జరుగుతున్న రాష్ట్రం ఏపీనే అని TDP ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. మహిళలకు మళ్లీ రక్షణ రావాలంటే కూటమి అధికారంలోకి రావాలని చెప్పారు. నాలుగు దశాబ్దాలుగా TDP ఎన్నో మంచి పనులు చేసిందని.. డ్వాక్రా సంఘాలను విస్తృతపరిచింది చంద్రబాబేనని గుర్తు చేశారు. YCP పాలనలో మహిళలు నష్టపోయారని విమర్శించారు. త్వరలో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయబోతున్నామని చెప్పారు.

News April 25, 2024

గన్ మిస్ ఫైర్.. డీఎస్పీ మృతి

image

TG: భద్రాద్రి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గన్ మిస్ ఫైర్ కావడంతో సీఆర్పీఎఫ్ డీఎస్పీ శేషగిరిరావు ఛాతీలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. తీవ్రంగా గాయపడిన ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించారు. చల్ల మండలం పూసుగుప్ప 81వ బెటాలియన్‌లో ఈ ఘటన జరిగింది.

News April 25, 2024

6వేల మంది ఉద్యోగులపై టెస్లా వేటు!

image

అమెరికాలోని టెక్సాస్, కాలిఫోర్నియా రాష్ట్రాలకు చెందిన 6,020 మంది ఉద్యోగులపై టెస్లా వేటు వేయనుంది. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు అందించిన నోటీసుల్లో సంస్థ ఈ మేరకు పేర్కొంది. US లేబర్ లా ప్రకారం 100కుపైగా ఉద్యోగులు ఉన్న సంస్థలు లేఆఫ్స్‌కు ప్లాన్ చేస్తే ప్రభుత్వానికి 60రోజుల ముందు చెప్పాలి. డిమాండ్ తగ్గుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా 10%కుపైగా సిబ్బందిని తొలగించనున్నట్లు ఇటీవల టెస్లా ప్రకటించింది.

News April 25, 2024

నార్త్ ఈస్ట్ ఢిల్లీలో ఉత్కంఠ పోరు

image

నార్త్ ఈస్ట్ ఢిల్లీ లోక్‌సభ స్థానంలో ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది. గతంలో వార్తల్లో సంచలనంగా నిలిచిన ఢిల్లీ JNUSU మాజీ ప్రెసిడెంట్‌ కన్హయ్య కుమార్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. ఈయన 2019లో బిహార్‌లోని బెగూసరాయ్ నుంచి CPI తరఫున పోటీ చేసి ఓడారు. 2021లో కాంగ్రెస్‌లో చేరారు. ఇటు BJP నుంచి సీనియర్ నేత మనోజ్ తివారీ బరిలో నిలిచారు. దీంతో సీనియర్, జూనియర్ లీడర్ల మధ్య పోరు ఉత్కంఠగా మారింది.

News April 25, 2024

T20WC కోసం పఠాన్ టీమ్ ఇదే.. మీరేమంటారు?

image

రానున్న T20WC కోసం ఇర్ఫాన్ పఠాన్ తన అంచనాతో భారత జట్టును ఎంపిక చేశారు. IPLలో ఫామ్‌లో అదరగొడుతున్న ప్లేయర్లను దృష్టిలో పెట్టుకుని.. రోహిత్ శర్మ కెప్టెన్‌గా, జైస్వాల్ , కోహ్లీ, సూర్యకుమార్, పంత్, దూబే, హార్దిక్, రింకూ సింగ్, జడేజా, కుల్దీప్ యాదవ్, బుమ్రా, అర్షదీప్ సింగ్, సిరాజ్, బిష్ణోయ్/చాహల్, శుభ్‌మన్ గిల్/సంజూ శాంసన్‌లను ఎంపిక చేశారు. పఠాన్ టీమ్‌పై మీరేమంటారు?

News April 25, 2024

ఇంటర్ ఫలితాలు.. 470కి 468 మార్కులు

image

TG: ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో కామారెడ్డి జిల్లా అంతంపల్లికి చెందిన వలకొండ చర్విత సత్తా చాటింది. ఎంపీసీలో ఆమెకు 470 మార్కులకు 468 వచ్చాయి. ఇంగ్లిష్‌లో 99(థియరీ 79, ప్రాక్టికల్స్ 20), సంస్కృతంలో 99, మ్యాథ్స్ 1Aలో 75, మ్యాథ్స్ 1Bలో 75, ఫిజిక్స్‌లో 60, కెమిస్ట్రీలో 60 మార్కులు సాధించింది. దీంతో చర్వితపై ప్రశంసలు కురుస్తున్నాయి.

News April 25, 2024

జగన్‌పై దాడి కేసు.. సతీశ్‌కు పోలీస్ కస్టడీ

image

AP: సీఎం జగన్‌పై రాయితో దాడి చేసిన కేసులో నిందితుడు సతీశ్‌ను పోలీస్ కస్టడీకి ఇస్తూ విజయవాడ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ కేసులో A1గా ఉన్న ఆయన్ను 3 రోజుల కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ నెల 27 వరకు పోలీసులు సతీశ్‌ను విచారించనున్నారు. లాయర్ సమక్షంలో అతడిని ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే విచారించాలని.. థర్డ్ డిగ్రీ ప్రయోగించవద్దని న్యాయస్థానం పోలీసులను ఆదేశించింది.

News April 25, 2024

BREAKING: పెరిగిన బంగారం ధరలు

image

నిన్న భారీగా తగ్గిన బంగారం ధరలు ఇవాళ మళ్లీ పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.490 పెరిగి రూ.72,650కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ.450 పెరిగి రూ.66,600గా ఉంది. ఇక వెండి ధర కేజీకి రూ.100 తగ్గి రూ.82,900గా నమోదైంది.

News April 25, 2024

ఈసీ పరిధిలో ఉన్నామని పోలీసులు గుర్తించాలి: బొండా ఉమ

image

AP: కొందరు పోలీసులు వైసీపీకి కొమ్ము కాస్తున్నారని టీడీపీ నేత బొండా ఉమ ఆరోపించారు. ‘తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాలతో నన్ను అక్రమ కేసులో ఇరికించే ప్రయత్నం చేసిన CPపై EC తీసుకున్న చర్యలు చూసైనా ఇతర అధికారుల్లో మార్పు రావాలి. తాము ఈసీ పరిధిలో ఉన్నామని గుర్తించాలి. విజయవాడ సెంట్రల్‌లో ఏసీపీ, సీఐలు వెల్లంపల్లి కనుసన్నల్లో నడుస్తున్నారు. వీరిపైనా చర్యలు తీసుకోవాలని ఈసీని కోరుతాం’ అని ఆయన వెల్లడించారు.