India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశంలో షరియా చట్టాన్ని తీసుకొస్తుందని అన్నారు. మోదీ పాలనలోనే దేశంలోని టెర్రరిజం అంతమైందని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు కలిసి దేశానికి తీవ్ర ద్రోహం చేశాయని ఆరోపించారు.
చెన్నై సూపర్ కింగ్స్ అరుదైన రికార్డును సమం చేసింది. టీ20ల్లో అత్యధిక సార్లు 200+ పరుగులు చేసిన జట్టుగా సోమర్‌సెట్(34) సరసన నిలిచింది. సీఎస్కే 34 సార్లు ఈ ఘనత అందుకుంది. ఆ తర్వాతి స్థానంలో టీమ్ ఇండియా(32), ఆర్సీబీ(29), యార్క్‌షైర్(29) ఉన్నాయి.
☛ A person who is mentally ill::- Lunatic
☛ A person who dislikes humankind and avoids human society::- Misanthrope
☛ A person who is primarily concerned with making money at the expense of ethics::- Mercenary
☛ Someone in love with himself::- Narcissist
☛ One who collect coins as hobby::- Numismatist
☛ A lover of mankind::- Philanthropist
ఊహించిన దానికంటే ఎక్కువ మార్కులు వస్తే ఎగిరి గంతులు వేయడం కామన్. అయితే.. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఓ స్టూడెంట్‌కి మాత్రం వింత అనుభవం ఎదురైంది. ఇటీవల UP SSC బోర్డు విడుదల చేసిన ఫలితాల్లో టెన్త్ విద్యార్థి అన్షుల్ కుమార్(16)కు 93.5% మార్కులు వచ్చాయి. అయితే తనకు ఊహించినదానికంటే ఎక్కువ మార్కులు రావడంతో అతడు మూర్ఛపోయాడు. దీంతో అతడిని ICUలో చేర్చాల్సి వచ్చింది.
కానివానితోడ గలసి మెలగుచున్న
గానివానిగానె కాంతు రవని
దాటి క్రిందబాలు త్రాగిన చందమౌ
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: తాటి చెట్టు కింద కూర్చొని ఓ వ్యక్తి పాలు తాగుతున్నప్పటికీ అతడు కల్లు సేవిస్తున్నారని అందరూ భావిస్తారు. అలాగే సమాజంలో గౌరవం లేని వ్యక్తులతో కలిసి తిరిగినవారిని కూడా అందరూ అలానే భావిస్తారు.
అక్రమ వలసదారులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బ్రిటన్.. వివాదాస్పద ‘సేఫ్టీ ఆఫ్ రువాండా బిల్’కు ఆమోదం తెలిపింది. బ్రిటన్ రాజు చార్లెస్-3 ఆమోదం తర్వాత ఇది చట్టరూపం దాల్చనుంది. ఇకపై అక్రమంగా ప్రవేశించేవారు దేశంలో ఉండేందుకు వీలుండదు. వారిని ఆఫ్రికాలోని రువాండాకు తరలిస్తారు. వలసదారులను దోపిడీ చేసే క్రిమినల్స్ ఆగడాలకు అడ్డుకట్ట పడుతుందని ఆ దేశ PM రిషి సునాక్ తెలిపారు. ఇదో గొప్ప మైలురాయని పేర్కొన్నారు.
బ్రిటన్‌లోకి ఏటా వేలాది మంది అక్రమ వలసదారులు ప్రవేశిస్తున్నారు. సముద్రాల్లో ప్రమాదకర రీతిలో ప్రయాణిస్తూ వందల మంది చనిపోతున్నారు. వలసలకు, మరణాలకు చెక్ పెట్టడానికి రువాండా ప్రణాళికను బ్రిటన్ సిద్ధం చేసింది. అయితే వలసదారులను తరలించగల సురక్షిత దేశంగా రువాండాను పరిగణించలేమని అక్కడి సుప్రీం 2023లో తీర్పు ఇచ్చింది. దీంతో మరింత పటిష్ఠంగా రూపొందించిన సేఫ్టీ ఆఫ్ రువాండా బిల్‌కు పార్లమెంట్ ఆమోదం తెలిపింది.
రువాండా బిల్లు ప్రకారం వలసదారులను 6,400 కి.మీ దూరంలోని రువాండాకు విమానాల్లో తరలిస్తారు. ఆ దేశ రాజధాని కిగాలిలోని శరణార్థి శిబిరాల్లో ఉంచుతారు. వారికి మౌలిక సదుపాయాలు కల్పించడానికి బ్రిటన్ ఆ దేశంతో ఒప్పందం చేసుకుంది. ఇప్పటి వరకు 290 మిలియన్ పౌండ్లను చెల్లించింది. త్వరలో 50M పౌండ్లను అందించనుంది. అంతర్జాతీయంగా న్యాయపరమైన ఇబ్బందులు పరిష్కరించడానికి 25 కోర్టు రూమ్‌లను ఏర్పాటు చేస్తుంది.
1929: ప్రముఖ నటుడు రాజ్‌కుమార్ జననం
1934: సినీ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు జననం
1969: ప్రఖ్యాత జ్యోతిష శాస్త్ర పండితుడు శంకరమంచి రామకృష్ణ శాస్త్రి జననం
1973: లెజెండరీ క్రికెటర్ సచిన్ జననం
1993: 73వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత దేశంలో పంచాయతీ వ్యవస్థ అమలులోకి వచ్చింది
2011: ఆధ్యాత్మిక గురువు సత్యసాయి బాబా మరణం
రష్యా నుంచి అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థ S-400లు ఈ ఏడాదే రావాల్సి ఉండగా జాప్యం జరుగుతోంది. ఇప్పటికి 3 చేరుకోగా, మరో రెండింటి డెలివరీపై అధికార వర్గాలు స్పందించాయి. వచ్చే ఏడాది అవి దేశానికి రానున్నాయని వెల్లడించాయి. ఈ డీల్ విలువ 5.5 బిలియన్ డాలర్లు. కాగా రష్యా నిర్మిస్తోన్న ‘తుషీల్’ యుద్ధ నౌక ఈ ఏడాది సెప్టెంబర్‌లో, ‘తమల్’ వార్ షిప్ జనవరిలో భారత్‌కు చేరుకుంటుందని రక్షణ శాఖ అధికారులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.