India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
డాక్టర్‌ను సంప్రదించేందుకు అనుమతి కోరుతూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఆయనకు అనుమతి ఇచ్చేందుకు నిరాకరించింది. మధుమేహం, రక్తంలో చక్కెర స్థాయి హెచ్చుతగ్గులకు సంబంధించి ప్రతిరోజూ 15 నిమిషాల పాటు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతివ్వాలని ఆయన కోర్టును ఆశ్రయించారు. తనకు ఇన్సులిన్ ఇచ్చేలా జైలు అధికారులను ఆదేశించాలని కోరారు.
ఎన్నికల్లో ఈవీఎంలు 2004 నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. వీటిని ECIL, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ తయారు చేస్తున్నాయి. ప్రస్తుతం ఈవీఎంలలో రెండు వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి M2, మరొకటి M3 ఈవీఎం. 2006-10 మధ్య కాలంలో తయారైన వాటిని M2గా పిలుస్తారు. వీటిని తయారు చేసేందుకు రూ.8,670 ఖర్చవుతోంది. M3 ఈవీఎంలకు మాత్రం రూ.17 వేల వరకు ఖర్చవుతోంది. <<-se>>#ELECTIONS2024<<>>
2010లో లాంఛ్ అయిన ఇన్‌స్టాగ్రామ్‌ను 2012లో మార్క్ జుకర్‌బర్గ్ కొనుగోలు చేశారు. అలా ఎందుకు కొన్నారు? తాజాగా లీకైన ఆయన ఈమెయిల్స్‌లో ఆ ప్రశ్నకు జవాబు ఉందని సీఎన్‌బీసీ నివేదిక చెప్పింది. మున్ముందు ఇన్‌స్టా తమకు పోటీదారు అవుతుందని బర్గ్ భావించారట. మొబైల్ యాప్‌లలో ఇన్‌స్టా రాణిస్తుందని అంచనా వేసి కొన్నారట. బిలియన్ డాలర్లకు ఆయన దాన్ని కొనగా.. ఇప్పుడు ఇన్‌స్టా విలువ 500 బిలియన్ డాలర్లకు పైమాటే!
తెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు కీలక ప్రకటన చేసింది. ఈ నెల 24వ తేదీన ఉదయం 11 గంటలకు HYDలో ఫలితాలను విద్యాశాఖ సెక్రటరీ విడుదల చేయనున్నారు. ఈ ఏడాది దాదాపు 9.80 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు. అందరి కంటే ముందే ఇంటర్ ఫలితాలను WAY2NEWS యాప్‌లో సులభంగా, వేగంగా పొందవచ్చు.
రింకూ సింగ్.. కోహ్లీని వదలట్లేదు. తనకు మరో బ్యాట్ ఇవ్వండంటూ అతడి వెంట పడుతున్నారు. మొన్న ప్రాక్టీస్ సెషన్‌లో కోహ్లీని కలిసిన రింకూ ‘మీరిచ్చిన బ్యాట్ విరిగింది. మరో బ్యాట్ ఇవ్వండి’ అంటూ బతిమిలాడిన వీడియో వైరలయింది. నిన్న మ్యాచ్ అనంతరం అతడు మళ్లీ కోహ్లీ వెంటే కనిపించారు. అతడితో పాటు ఆర్సీబీ డగౌట్‌లోనూ కూర్చున్నారు. ‘కోహ్లీ బ్యాట్ రింకూకు అచ్చొచ్చినట్లు ఉంది’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
TG: రూ.2లక్షల రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఎన్నికల కోడ్ ముగియగానే రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఆగష్టు 15లోపు రైతులకు రుణమాఫీ చేసి తీరుతాం. ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే ఐదు గ్యారంటీలు అమలు చేశాం. ఆరో గ్యారంటీ రుణమాఫీ చేపట్టేలోపే ఎన్నికల కోడ్ వచ్చింది’ అని నిజామాబాద్ సభలో వెల్లడించారు.
ఇరాన్, పాలస్తీనాతో యుద్ధం కొనసాగుతున్న వేళ ఇజ్రాయెల్ ఆర్మీ ఇంటెలిజెన్స్ చీఫ్ అహరోన్ హలీవా కీలక నిర్ణయం తీసుకున్నారు. గత ఏడాది అక్టోబర్ 7న తమ దేశంపై హమాస్ చేసిన ఆకస్మిక దాడికి బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేశారు. తమకు అప్పగించిన పనిని ఆరోజు సమర్థవంతంగా చేయలేకపోయామని, యుద్ధం వల్ల కలిగిన బాధ తనను నిరంతరం వెంటాడుతోందని ఆయన పేర్కొన్నారు. అక్టోబర్ 7 తన దృష్టిలో బ్లాక్ డే అని చెప్పారు.
TG: మూతపడ్డ బోధన్ షుగర్ ఫ్యాక్టరీని సెప్టెంబర్ 17లోపు తిరిగి తెరిచేందుకు ప్రయత్నిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్‌లో కాంగ్రెస్ జన జాతర సభలో ఆయన మాట్లాడారు. మాయమాటలతో ప్రజలను కవిత, అర్వింద్ మోసం చేశారని దుయ్యబట్టారు. ప్రధాని మోదీ మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. విపత్కర పరిస్థితుల్లో ఉన్న దేశాన్ని కాపాడాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు.
ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో కస్టమర్స్‌కు షాక్ ఇచ్చింది. ఈ నెల 20 నుంచి ప్లాట్‌ఫామ్ ఫీజుగా ప్రతి ఆర్డర్‌పై రూ.5 అదనంగా వసూలు చేయడం ప్రారంభించింది. దేశంలోని ప్రధాన మార్కెట్లలో ఇది మొదలైంది. మరో డెలివరీ యాప్ స్విగ్గీ కూడా ఇప్పటికే ప్లాట్‌ఫామ్ ఫీజు పేరిట రూ.5 విధిస్తోంది. ఇక నగరాల మధ్య చేపట్టే ‘ఇంటర్‌సీటీ’ ఫుడ్ డెలివరీని ఆపేస్తున్నట్లు జొమాటో ప్రకటించింది. న్యాయపరమైన సమస్యలే దీనికి కారణమని తెలిపింది.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధరంగంగా పేరొందిన సియాచిన్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ఈరోజు పర్యటించారు. సైన్యం యుద్ధ సన్నద్ధతను ఆయన సమీక్షించారని, సైనికులతో ముచ్చటించారని అధికారులు తెలిపారు. రాజ్‌నాథ్ వెంట ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే ఉన్నారు. సియాచిన్‌లో భారత సైన్యం ఉనికి మొదలై ఈ ఏడాదికి 40ఏళ్లు గడిచాయి. 1984లో ‘ఆపరేషన్ మేఘ్‌దూత్’తో ఆ ప్రాంతాన్ని భారత్ స్వాధీనం చేసుకుంది.
Sorry, no posts matched your criteria.