News April 12, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News April 12, 2024

ఏప్రిల్ 12: చరిత్రలో ఈరోజు

image

1917: భారత మాజీ క్రికెటర్ వినూమన్కడ్ జననం
1961 : రష్యా అంతరిక్ష శాస్త్రవేత్త యూరీ గగారిన్ అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి మానవునిగా నిలిచాడు
1962: ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య మరణం
1981 : ప్రపంచపు మొట్టమొదట స్పేస్ షటిల్ ‘కొలంబియా’ను అమెరికా విజయవంతంగా ప్రయోగించింది
2006: కన్నడ నటుడు రాజ్‌కుమార్ మరణం
* ప్రపంచ రోదసీ దినోత్సవం

News April 12, 2024

ఇస్రోలో చేరేందుకు సువర్ణావకాశం!

image

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోలో చేరాలనుకుంటున్నారా? అయితే అందుకు ఇస్రో అవకాశం కల్పిస్తోంది. అర్హులైన వారి నుంచి అసిస్టెంట్, జూనియర్ పర్సనల్ అసిస్టెంట్స్ కొలువులకు దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. గ్రాడ్యుయేషన్‌లో కనీసం 60శాతం ఉత్తీర్ణత లేదా 10 పాయింట్ల స్కేల్‌లో కనీసం 6.32 సీజీపీఏ ఉన్నవారు ఈ నెల 15లోపుగా ఇస్రో వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవచ్చు.

News April 12, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News April 12, 2024

శుభ ముహూర్తం

image

తేది: ఏప్రిల్ 12, శుక్రవారం
చైత్రము
శు.చవితి: మధ్యాహ్నం: 1:12గంటలకు
రోహిణి: అర్ధరాత్రి 12:51 గంటలకు
దుర్ముహూర్తం: ఉదయం 8:25 నుంచి ఉదయం 9:15 గంటల వరకు
తిరిగి మధ్యాహ్నం 12:32 నుంచి మధ్యాహ్నం 1:22 వరకు
వర్జ్యం: సాయంత్రం 5:06 నుంచి సాయంత్రం 6:39 వరకు

News April 12, 2024

యుద్ధానికి సిద్ధంగా ఉండండి: కిమ్

image

మునుపెన్నడూ లేని విధంగా యుద్ధానికి సిద్ధంగా ఉండాలని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ తమ సైన్యానికి పిలుపునిచ్చారు. దేశంలోని సైనిక వర్సిటీని సందర్శించిన సందర్భంగా ఈమేరకు స్పష్టం చేశారు. ‘శత్రువులు మనల్ని రెచ్చగొడితే చావు దెబ్బ తీయాలి. కేవలం సిద్ధంగా ఉండటమే కాదు. విజయాన్ని సాధించాలి. అందుకోసం అన్ని వనరుల్ని వినియోగించుకుందాం’ అని సూచించారు.

News April 12, 2024

TODAY HEADLINES

image

➥CM జగన్‌ను జైలుకు పంపుతాం: పవన్ కళ్యాణ్
➥ముగ్గురం మళ్లీ జతకట్టాం.. జగన్ నిలబడగలడా?: CBN
➥ఏపీలో రూ.100కోట్ల విలువైన సొత్తు జప్తు: EC
➥జగన్ సంస్కరణలతో పేదరికం తగ్గింది: బొత్స
➥లిక్కర్ స్కామ్ కేసులో కవితను అరెస్ట్ చేసిన CBI
➥BRS ఒక్క ఎంపీ సీటు కూడా గెలవదు: కోమటిరెడ్డి
➥కాంగ్రెస్ వచ్చింది.. కరవు మొదలైంది: హరీశ్
➥కడియం కావ్య కాదు.. మహమ్మద్ కావ్య నజరుద్దీన్: ఆరూరి
➥IPL: ఆర్సీబీపై ముంబై విజయం

News April 11, 2024

రాజ్యాలను శాసించారు.. ఇప్పుడు రాష్ట్రం కావాలంటున్నారు! – 1/3

image

బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో ఈనెల 19న లోక్‌సభ తొలివిడత ఎన్నికలు జరగనున్న వేళ రాజ్‌బంశీయులు మరోసారి హైలెట్ అయ్యారు. ఎక్కువగా ఉత్తర బెంగాల్, దక్షిణ అస్సాంలో నివసించే వీరు దశాబ్దాలుగా ప్రత్యేక రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఒకప్పుడు తాము అనేక రాజ్యాలను జయించి వాటిని శాసించామని అంటున్నారు మహారాజ అనంత్ రాయ్. ఇంతకీ వీరి చరిత్రేంటి? ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ ఎందుకు వచ్చింది? <<-se>>#Elections2024<<>>

News April 11, 2024

రాజ్యాలను శాసించారు.. ఇప్పుడు రాష్ట్రం కావాలంటున్నారు! – 2/3

image

సత్యయుగంలో ఇంద్రాపూర్ (ప్రస్తుతం అస్సాంలోని ధుబ్రీ) తమ రాజ్య రాజధాని అని ఈ వర్గానికి చెందిన మహారాజ అనంత్ రాయ్ చెప్పుకొచ్చారు. త్రేతాయుగంలో బిహార్‌లోని మిథిలాపురిని, కలియుగంలో కామ్తా రాజ్యాన్ని పాలించామని తెలిపారు. ఈ కామ్తానే ఇప్పటి బెంగాల్‌లోని కూచ్ బెహార్. స్వాతంత్ర్యం అనంతరం వీరి ప్రాంతాన్ని ఓ జిల్లాగా మార్చి బెంగాల్‌లో కలిపేశారు. ఇది అక్రమం, రాజ్యాంగ విరుధ్ధం అనేది వీరి వాదన. <<-se>>#Elections2024<<>>

News April 11, 2024

రాజ్యాలను శాసించారు.. ఇప్పుడు రాష్ట్రం కావాలంటున్నారు! – 3/3

image

బెంగాల్‌లో SCలుగా గుర్తింపు పొందిన వీరి జనాభా సుమారు 50లక్షలు. అందుకే వీరిని ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు శ్రమిస్తున్నాయి. బీజేపీ గతఏడాది అనంతరాయ్‌ను రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక చేసింది. మరోవైపు TMC వీరికి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి, వీరు ఆరాధించే పంచానన్ బర్మా జయంతిని సెలవుగా ప్రకటించింది. అస్సాంలోనూ ఓబీసీలుగా చెలామణి అవుతున్న వీరి ఓట్లు కీలకంగా మారాయి. <<-se>>#Elections2024<<>>