News April 2, 2024

వివేకం సినిమా ప్రదర్శన నిలిపివేయాలని పిటిషన్

image

AP: వివేకం సినిమా ప్రదర్శనను యూట్యూబ్, ఓటీటీలలో నిలిపివేయాలని కోరుతూ వివేకా హత్య కేసు నిందితుడు దస్తగిరి వేసిన పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న తనను అపకీర్తి పాల్జేసేలా చిత్రంలో చూపించారని పేర్కొన్నారు. సీబీఐకి, పులివెందుల కోర్టులో తానిచ్చిన వాంగ్మూలం ఆధారంగా సినిమా తీశారన్నారు. ఏపీలో ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు చిత్ర ప్రదర్శన నిలిపివేయాలని కోరారు.

News April 2, 2024

యాసంగి ధాన్యం కొనుగోలుకు 7149 కేంద్రాలు

image

TG: ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామని సీఎస్ శాంతి తెలిపారు. యాసంగి ధాన్యం కొనుగోలుకు 7149 కేంద్రాలను ఏర్పాటు చేశామని.. నాలుగైదు రోజుల్లో అవి ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఇప్పటికే ప్రారంభమైన కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోళ్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయని చెప్పారు. మద్దతు ధర కంటే తక్కువకు కొనుగోలు చేసే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

News April 2, 2024

‘ఒక వాహనం.. ఒక ఫాస్టాగ్’ రూల్ అమల్లోకి

image

‘ఒక వాహనం.. ఒక ఫాస్టాగ్’ విధానం దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చింది. దీంతో ఒక ఫాస్టాగ్‌ను పలు వాహనాలకు వాడటం లేదా ఒక వాహనానికి పలు ఫాస్టాగ్‌లు వాడటాన్ని కుదరదు. పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై ఆంక్షల నేపథ్యంలో వినయోగదారుల సమస్యల్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిబంధనల అమలు గడువుని మార్చి 31 వరకు NAHI పొడిగించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 8 కోట్ల మంది ఫాస్టాగ్ వినియోగదారులున్నారు.

News April 2, 2024

రూ.4వేల కోట్ల రుణం తీసుకున్న ప్రభుత్వం

image

ఏపీ ప్రభుత్వం మార్చి 28న బహిరంగ మార్కెట్‌లో అప్పు తీసుకుంది. ఆర్‌బీఐ వద్ద సెక్యూరిటీలను వేలం వేసి రూ.4వేల కోట్ల రుణం తీసుకుంది. ఏప్రిల్ 2వ తేదీన ఈ నగదు రాష్ట్ర ప్రభుత్వ ఖాజానాకు జమ కానుంది. కాగా మే నెల వరకు మరో రూ.9వేల కోట్ల మేర రుణం తీసుకునేందుకు ఆర్బీఐకి ప్రభుత్వం ప్రతిపాదనలు సమర్పించింది.

News April 2, 2024

‘విశ్వంభర’ షూటింగ్ కొత్త షెడ్యూల్ ప్రారంభం

image

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘విశ్వంభర’ సినిమా షూటింగ్ కొత్త షెడ్యూల్ ప్రారంభమైంది. ప్రస్తుతం లింగంపల్లిలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో షూటింగ్ జరుగుతున్నట్లు సినీవర్గాలు వెల్లడించాయి. ఏప్రిల్ 19 వరకు ఈ షెడ్యూల్ కొనసాగనుందట. వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో త్రిష హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 10న థియేటర్లలోకి రానుంది.

News April 2, 2024

ఇరాన్ ఎంబసీపై ఇజ్రాయెల్ దాడి

image

హమాస్ ఉగ్రవాదులకు సహకరిస్తున్న వారిపైనా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. తాజాగా సిరియా రాజధాని డమాస్కస్‌లో ఉన్న ఇరాన్ ఎంబసీపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఈ ఘటనలో ఇరాన్‌కు చెందిన సీనియర్ మిలిటరీ సలహాదారు అలీ రెజా సహా ఏడుగురు మృతి చెందారు. కాగా అలీ రెజా 2016 వరకు లెబనాన్, సిరియా దేశాల్లో ఖుడ్స్ బలగాలకు నేతృత్వం వహించారు. కాగా ఇజ్రాయెల్ ప్రతిదాడి ఎదుర్కోక తప్పదని ఇరాన్ హెచ్చరించింది.

News April 2, 2024

విమాన సర్వీసులు తగ్గించిన విస్తారా

image

పైలట్లు, సిబ్బంది కొరత సహా ఇతర కారణాలతో విమాన సర్వీసులు తగ్గిస్తున్నట్లు సింగపూర్ ఎయిర్‌లైన్స్ విస్తారా ప్రకటించింది. కొన్ని రోజులుగా విమానాల ఆలస్యానికి కారణం ఇదేనని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు. కాగా టాటాకు చెందిన ఎయిర్ ఇండియాలో విస్తారా త్వరలో విలీనం కానుంది. ఇప్పటికే విస్తారాలో టాటా సన్స్‌కి 51% వాటా ఉంది. విలీనం పూర్తైతే ఈ సంస్థలు టాటా గ్రూప్‌లోని ఎయిర్ ఇండియా ఆధ్వర్యంలోనే పని చేస్తాయి.

News April 2, 2024

₹2,000 నోట్లు 97.69% తిరిగివచ్చాయి: ఆర్బీఐ

image

రద్దు చేసిన ₹2వేల నోట్లలో ఇప్పటివరకు 97.69% బ్యాంకులకు తిరిగి వచ్చాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఇంకా ₹8,202 కోట్లు తిరిగి రావాల్సి ఉందని తెలిపింది. గత ఏడాది మే 19న ₹2వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. అప్పుడు 3.56 లక్షల కోట్ల విలువైన ₹2వేల నోట్లు చలామణిలో ఉండేవి. ప్రస్తుతం దేశంలోని 19 ఆర్బీఐ కేంద్రాల్లో వీటిని మార్చుకునేందుకు అవకాశం కల్పించారు.

News April 2, 2024

ఏప్రిల్2: చరిత్రలో ఈరోజు

image

1915: తెలుగు సినిమా నటుడు కొచ్చర్లకోట సత్యనారాయణ జననం
1969: నటుడు అజయ్ దేవగన్ జననం
1981: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైఖేల్ క్లార్క్ జననం
1872: టెలిగ్రాఫ్ వ్యవస్థ ఆవిష్కర్త సామ్యూల్ F.B మోర్స్ మరణం
1933: భారత మాజీ క్రికెటర్ రంజిత్ సిన్హ్‌జీ మరణం
అంతర్జాతీయ బాలల పుస్తక దినోత్సవం
ప్రపంచ ఆటిజం అవగాహన దినోత్సవం.

News April 2, 2024

ఈ రోజు నమాజ్ వేళలు

image

తేది: ఏప్రిల్ 2, మంగళవారం
ఫజర్: తెల్లవారుజామున గం.4:58 సూర్యోదయం: ఉదయం గం.6:10
జొహర్: మధ్యాహ్నం గం.12:20
అసర్: సాయంత్రం గం.4:44
మఘ్రిబ్: సాయంత్రం గం.6:30
ఇష: రాత్రి గం.07.42
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.