News March 30, 2024

ఫేక్ ప్రచారాలను ఇలా అడ్డుకుందాం

image

Way2News పేరుతో కొందరు అసత్య ప్రచారాలు వైరల్ చేస్తున్నారు. మా లోగోతో వచ్చే వార్తలు నిజంగా మా నుంచి పబ్లిష్ అయ్యాయా? లేదా సులువుగా వెరిఫై చేయొచ్చు. మా ప్రతి ఆర్టికల్‌కు ప్రత్యేక కోడ్ ఉంటుంది. మీకు వచ్చిన స్క్రీన్‌షాట్‌పై కోడ్‌ను యాప్‌లో లేదా fc.way2news.comలో ఎంటర్ చేస్తే ఆ ఆర్టికల్ చూపించాలి. వేరే ఆర్టికల్ వచ్చినా, ఏ వార్త రాకపోయినా ఆ ఫార్వర్డ్ మాది కాదు. వీటిని grievance@way2news.comకు పంపవచ్చు.

News March 30, 2024

ఇన్‌స్టా రీల్స్: ఇలా తయారయ్యారేంటి?

image

ఈమధ్య ఇన్‌స్టా ఇన్‌ప్లూయెన్సర్లు రీల్స్ చేసేందుకు ఏ ప్రదేశమూ అనర్హం కాదన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. కొంతకాలం క్రితం మెట్రో రైళ్లలో మొదలైన ఈ ట్రెండ్ ఈ మధ్య రోడ్లపై నడిచే బైకులపై, ఇప్పుడు ఎయిర్‌పోర్టులకు వ్యాపించింది. కొందరు తమ ఆఫీసు‌లలో రీల్స్ చేస్తుంటే.. మరికొందరు ఓ అడుగు ముందుకేసి ఏకంగా ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్లలో చేస్తున్నారు. ఈ ట్రెండ్ ఎక్కడి వరకు పాకుతుందో చూడాలి. దీనిపై మీ కామెంట్.

News March 30, 2024

రష్యాలో భారతీయులకు నరకం! – 1/2

image

ఉక్రెయిన్‌పై యుద్ధం కోసం రష్యన్ ఏజెంట్లు విదేశీయులను ట్రాప్ చేస్తున్నారు. హరియాణా యువకులు ముకేశ్ (21), సన్నీ (24) సైతం ఇలాగే మోసపోయి నరకం అనుభవించారు. జర్మనీలోని ఓ హోటల్‌లో ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి బ్యాంకాక్ తీసుకెళ్లి అక్కడి నుంచి వీరిని బెలారస్-రష్యా బోర్డర్‌కు తరలించారట. అడవుల్లోని క్యాంపుల్లో బంధించి చిత్రహింసలు పెట్టారట. ఇలా దక్షిణాసియాకు చెందిన దాదాపు 200 మంది చిక్కుకున్నారట.

News March 30, 2024

రష్యాలో భారతీయులకు నరకం! – 2/2

image

సైన్యంలో చేరితే రష్యా వర్క్ పర్మిట్లు, రష్యన్ యువతితో వివాహం, రష్యన్ పాస్‌పోర్టు ఇస్తామని ఈ ఏజెంట్లు మొదట ఆఫర్ చేస్తారట. ఇందుకు అంగీకరించనందుకు జైల్లో టార్చర్ పెట్టారని బాధితులు వాపోయారు. రూ.6లక్షలు ఖర్చు చేసి ఓ లాయర్ సాయంతో బయటపడి స్వదేశానికి తిరిగొచ్చామన్నారు. గతంలోనూ పలువురు భారతీయులు రష్యాలో చిక్కుకుని నరకం అనుభవించారు. అస్ఫన్ అనే హైదరాబాదీ సైతం ఇలాగే మోసపోయి యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు.

News March 30, 2024

ఆ కోరిక తీరకుండానే మరణించిన ప్రముఖ నటుడు

image

గుండెపోటుతో మరణించిన నటుడు డేనియల్‌ బాలాజీకి డైరెక్షన్ అంటే చాలా ఇష్టం. ఆ కోరికతోనే ఇండస్ట్రీకి వచ్చిన ఆయన తర్వాత నటుడయ్యారు. డైరెక్షన్ కోసం స్క్రిప్ట్ కూడా రెడీ చేసుకున్నట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ మూవీకి తన స్నేహితుడు ఎమ్ఆర్ గణేశ్ నిర్మాతగా వ్యవహరిస్తాడని కూడా ప్రకటించారు. కానీ తర్వాత ఆ సినిమా పట్టాలెక్కలేదు. డైరెక్టర్ అవ్వాలన్న డేనియల్ చివరి కోరిక తీరలేదు.

News March 30, 2024

పవన్‌ కళ్యాణ్‌కు వర్మ తల్లి ఆశీర్వాదం

image

AP: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం చేరుకున్నారు. దొంతమూరులోని టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ ఇంట్లో ఆయన భోజన సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం వర్మ తల్లి అలివేలు మంగ పద్మావతి ఆశీస్సులు తీసుకున్నారు. టీడీపీ కార్యకర్తలు, నాయకులతో భేటీ అయ్యారు. తనకు సంపూర్ణ మద్దతు పలకాలని ఆయన కోరారు. సుమారు గంటసేపు వర్మతో ముచ్చటించారు.

News March 30, 2024

కెప్టెన్సీకి అఫ్రిదీ గుడ్ బై?

image

పాకిస్థాన్ T20 కెప్టెన్ షాహీన్ షా అఫ్రిదీ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. తన కెప్టెన్సీలో పాక్ ఘోర ప్రదర్శనకు బాధ్యత వహిస్తూ ఆయన వైదొలుగుతున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయన PCB ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీకి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా పాక్ కెప్టెన్‌గా మళ్లీ బాబర్ ఆజమ్ పగ్గాలు చేపట్టనున్నట్లు సమాచారం. న్యూజిలాండ్‌తో జరగబోయే టీ20 సిరీస్‌కు ఆయనకు బాధ్యతలు అప్పజెప్పనున్నట్లు టాక్.

News March 30, 2024

దమ్ముంటే టచ్ చేసి చూడండి: పొన్నం

image

TG: రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. తమతో కాంగ్రెస్ మంత్రులు టచ్‌లో ఉన్నారన్న బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి <<12955060>>కామెంట్స్‌కు<<>> మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. ‘దమ్ముంటే ప్రభుత్వాన్ని టచ్ చేసి చూడండి. దేనినైనా ఎదుర్కొనే శక్తి మాకుంది’ అని సవాలు విసిరారు.

News March 30, 2024

కడియంపై చర్యలకు సిద్ధమవుతున్న BRS

image

TG: పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరుతున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై BRS అధిష్ఠానం సీరియస్‌గా ఉంది. ఈమేరకు ఆయనపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. పార్టీ ఫిరాయిస్తున్న ఎమ్మెల్యే కడియంపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు పిటిషన్ ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటికే పలువురు నేతలు స్పీకర్‌ను కలిసేందుకు అసెంబ్లీకి వెళ్లారు. కడియం శ్రీహరి తన కూతురు కావ్యతో పాటు ఈరోజు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది.

News March 30, 2024

ఫోన్ ట్యాప్ చేయకుండా ఉండాలంటే?

image

మీ ఫోన్‌ను ఇతరులు ఆపరేట్ చేస్తున్నారని తెలిసినప్పుడు వెంటనే ఫ్లైట్ మోడ్ ఆన్ చేయడం బెటర్. వెంటనే ఫ్యాక్టరీ రీసెట్ చేసి స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌ను ఫోన్ లాక్ & యాప్స్‌కు క్రియేట్ చేయండి. అనుమానాస్పదంగా కనిపించే యాప్స్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయండి. మీ OSను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయండి. సెక్యూర్డ్ WIFIలో మాత్రమే కనెక్ట్ అవ్వండి. అవసరం లేనప్పుడు బ్లూటూత్ & WIFIని ఆఫ్ చేసి ఉంచండి.