India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: మచిలీపట్నం జనసేన ఎంపీ అభ్యర్థిగా వల్లభనేని బాలశౌరి పేరును పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈయన వైసీపీకి రాజీనామా చేసి ఫిబ్రవరిలో జనసేన పార్టీలో చేరారు. పొత్తులో భాగంగా జనసేనకు కాకినాడ, మచిలీపట్నం ఎంపీ సీట్లు దక్కాయి. కాకినాడ నుంచి ఉదయ్ శ్రీనివాస్ పేరును ఇదివరకే ప్రకటించారు. అటు 21 అసెంబ్లీ సీట్లలో జనసేన పోటీ చేస్తుండగా.. పాలకొండ, అవనిగడ్డ సీట్లకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
జేఈఈ మెయిన్-2024 సెషన్-2 అడ్మిట్ కార్డులను ఏప్రిల్ 1న విడుదల చేయనున్నట్లు NTA ప్రకటించింది. https://jeemain.nta.ac.in/ వెబ్‌సైట్‌లో వీటిని అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా 319 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. పేపర్ 1 (BE/BTECH) పరీక్షలు ఏప్రిల్ 4, 5, 6, 8, 9 తేదీల్లో జరగనుండగా, పేపర్-2 పరీక్షలు ఏప్రిల్ 12న నిర్వహించనున్నారు. ఏప్రిల్ 25న ఫలితాలు రానున్నాయి.
కర్ణాటకలో దావణగెరె బీజేపీ ఎంపీ అభ్యర్థి గాయత్రీ సిద్దేశ్వర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే శివశంకరప్ప వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమెకు వంట చేయడం మాత్రమే తెలుసని, ఇక్కడ సమస్యలపై అవగాహన లేదని విమర్శించారు. దీనికి ఆమె స్పందిస్తూ.. ‘మహిళలు అన్ని రంగాల్లో సత్తా చాటుతున్నారనే విషయం ఆ ముసలాడికి తెలియదు’ అని కౌంటర్ ఇచ్చారు. కాగా ఈ స్థానంలో ఎమ్మెల్యే కోడలు ప్రభా మల్లికార్జున్ పోటీ చేస్తున్నారు.
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన ప్రమోద్ కుమార్ అనే విద్యార్థి బ్యాంక్ అకౌంట్ నుంచి ఏకంగా రూ.46 కోట్ల లావాదేవీలు జరిగాయి. దీంతో ఆ మొత్తానికి పన్ను చెల్లించాలంటూ IT శాఖ నోటీసులు పంపడంతో యువకుడు కంగుతిన్నాడు. తన పాన్‌కార్డుతో ఓ కంపెనీ రిజిస్టర్ అయ్యిందని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 2021 నుంచి ముంబై, ఢిల్లీలో ఆ కంపెనీ వ్యాపారాలు చేసిందట. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
మంచు విష్ణు లీడ్ రోల్‌లో ‘కన్నప్ప’ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో స్టార్ హీరో ప్రభాస్ శివుడి పాత్రలో నటిస్తున్నట్లు చిత్రవర్గాలు పేర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా షూట్ కోసం ప్రభాస్ డేట్స్ ఇచ్చినట్లు సినీ వర్గాలు తెలిపాయి. వచ్చే నెల 12 నుంచి ఐదు రోజుల పాటు రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగే షూటింగ్‌లో పాల్గొంటారని పేర్కొన్నాయి.
సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ భారత బ్యాడ్మింటన్ చరిత్రలో మరో రికార్డు నెలకొల్పారు. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ వరల్డ్ ర్యాంకింగ్స్‌లో అత్యధిక కాలం (10 వారాలు) అగ్రస్థానంలో కొనసాగిన జోడీగా రికార్డు సృష్టించారు. ఇదివరకు ఈ రికార్డు సైనా నెహ్వాల్ (9 వారాలు) పేరిట ఉండేది. ఆమె ఆగస్టు 18, 2015 నుంచి అక్టోబర్ 21, 2015 వరకు నంబర్ 1గా కొనసాగారు.
TG: గ్రేటర్ హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్‌లో చేరారు. సీఎం రేవంత్ తన నివాసంలో ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కొన్ని రోజుల క్రితమే పార్టీ మారుతున్నట్లు ఆమె ప్రకటించిన సంగతి తెలిసిందే. విజయలక్ష్మి తండ్రి కేశవరావు కూడా త్వరలోనే కాంగ్రెస్‌లో చేరనున్నారు.
TG: ఇటీవల బీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. GHMC మేయర్ విజయలక్ష్మి నేడు సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమాచారం. మరోవైపు మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్ హస్తం గూటికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఉన్న ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా మహిళలు, పిల్లలు ఈ టీమ్‌ను ఆరాధిస్తారు. తాజాగా RCBvsKKR మ్యాచ్‌లో ఈ జట్టుకు చెందిన ఓ చిన్నారి ఫ్యాన్ ఇంట్రెస్టింగ్ ప్లకార్డుతో కనిపించింది. ‘RCB కప్ కొట్టే వరకూ స్కూల్‌కి వెళ్లను’ అనే ప్లకార్డుపై రాసి ఉంది. దీనిపై కొందరు సెటైర్లు వేస్తున్నారు. స్కూలుకు వెళ్లొద్దని గట్టి ప్లాన్ వేసిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
గత ఏడాది చిన్న సినిమాగా విడుదలై సూపర్ హిట్‌గా నిలిచిన చిత్రం ‘మ్యాడ్’. కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సీక్వెల్ రానుంది. తాజాగా సీక్వెల్ టైటిల్‌ను దర్శకుడు అనౌన్స్ చేశారు. ‘మ్యాడ్ మ్యాక్స్’ పేరుతో ఈ మూవీని తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. ఏప్రిల్ 12న షూటింగ్ ప్రారంభం కానుందని చెప్పారు.
Sorry, no posts matched your criteria.