News March 30, 2024

మేం తలచుకుంటే 60మంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి: ఈటల

image

తాము తలచుకుంటే ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి 60మంది ఎమ్మెల్యేలను చేర్చుకోగలమని మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ‘కాంగ్రెస్‌తో మా ఎమ్మెల్యేలు 8మంది టచ్‌లో ఉంటే, మాకు 60మంది కాంగ్రెస్ వాళ్లను తీసుకోవడం పెద్ద విషయం కాదు. కేసీఆర్‌ తరహాలోనే రేవంత్ సర్కారు కూడా నేతల్ని కొంటోంది. వారు వచ్చి 100 రోజులు దాటింది. హామీల్ని ఎందుకు నెరవేర్చడం లేదు?’ అని ప్రశ్నించారు.

News March 30, 2024

భారీగా పెరిగిన నిమ్మకాయల ధరలు

image

TG: రోజురోజుకు ఎండలు పెరుగుతుండటంతో నిమ్మకాయల ధరలకు రెక్కలొచ్చాయి. కొద్ది రోజుల క్రితం వరకు రూ.20కి అరడజను పెద్దసైజు నిమ్మకాయలు ఇచ్చేవారు. ఇప్పుడు రూ.40-రూ.50కి అమ్ముతున్నారు. విడిగా అయితే పెద్దసైజు నిమ్మకాయ రూ.10, చిన్న సైజుదైతే రూ.5 చొప్పున విక్రయిస్తున్నారు. నిమ్మకాయల ఉత్పత్తి తగ్గడం, డిమాండ్ పెరగడమే ఇందుకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు.

News March 30, 2024

కేజ్రీవాల్‌ కోసం రేపు ఢిల్లీలో ‘ఇండియా’ సభ

image

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ అరెస్టును నిరసిస్తూ ఇండియా కూటమి రేపు ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. 13పార్టీల నేతలు దీనిలో పాల్గొననున్నారు. తాన్‌షాహీ హఠావో-లోక్‌తంత్ర బచావో అన్న నినాదంతో ఈ సభను నిర్వహిస్తామని కూటమి నేతలు తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్, తృణమూల్ ఎంపీ ఒబ్రెయిన్ సహా పలువురు ప్రముఖులు సభకు హాజరుకానున్నారు.

News March 30, 2024

మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు గడువు పొడిగింపు

image

AP: రాష్ట్రంలోని 164 మోడల్ స్కూళ్లలో 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తు గడువును వచ్చే నెల 6 వరకు పొడిగించినట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 21న ఉ.10 నుంచి మ.12 గంటల వరకు నిర్వహిస్తామంది. ఐదో తరగతి స్థాయిలో తెలుగు/ఇంగ్లిష్ మీడియంలో పరీక్ష ఉంటుందని పేర్కొంది. ఎంపికైన వారికి విద్యాభ్యాసం ఇంగ్లిష్‌లోనే ఉంటుందని వెల్లడించింది.
వెబ్‌సైట్: <>https://apms.apcfss.in/<<>>

News March 30, 2024

ఫసల్ బీమా స్కీమ్.. రాష్ట్ర వాటా రూ.1500 కోట్లు!

image

TG: రాష్ట్రంలో PM ఫసల్ బీమా యోజన పథకాన్ని వచ్చే వానాకాలం సీజన్ నుంచి అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. గతంతో పోలిస్తే ప్రీమియంలు పెరగడంతో రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ప్రతి సీజన్‌కు ₹1500 కోట్లు అవసరమని వ్యవసాయశాఖ అంచనా వేసింది. అలాగే రాష్ట్రమంతటా ఒకే బీమా విధానం కాకుండా ప్రాంతం, పంటల ఆధారంగా వేర్వేరు ప్రీమియంలు ఉండాలని ప్రభుత్వానికి వ్యవసాయశాఖ నివేదిక ఇచ్చింది.

News March 30, 2024

జూన్ 1 వరకు ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం: ఈసీ

image

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్‌పై EC ఆంక్షలు విధించింది. తొలి దశ పోలింగ్ జరిగే ఏప్రిల్ 19 నుంచి చివరి దశ పోలింగ్ రోజైన జూన్ 1 వరకు ఎగ్జిట్ పోల్స్‌కు అనుమతి లేదని తెలిపింది. ఎగ్జిట్ పోల్స్ నిర్వహణ, ప్రసారం, ప్రచురణ చేపట్టకూడదని పేర్కొంటూ నోటిఫికేషన్ జారీ చేసింది. పోలింగ్ ముగియడానికి 48 గంటల ముందు నుంచి ఎలక్ట్రానిక్ మీడియాలో ఫలితాల అంచనాలు, సర్వేలు ప్రసారం చేయొద్దని ఆదేశించింది.

News March 30, 2024

బీజేపీ ఎమ్మెల్యేలూ టచ్‌లో ఉన్నారు: కోమటిరెడ్డి

image

బీజేపీ ఎమ్మెల్యేలు కూడా తమతో టచ్‌లో ఉన్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. విపక్షాల నేతలు వారి వారి పార్టీలతో విసుగెత్తిపోయారని అభిప్రాయపడ్డారు. ‘ఈ వరద ఇప్పట్లో ఆగదు. ప్రతిపక్ష పార్టీలు ఖాళీ అవుతున్నాయి. మేం గేట్లు తెరవలేదు. నేతలే గేట్లను బద్దలుగొట్టి మరీ పార్టీలో చేరుతున్నారు. 12మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, 8మంది బీజేపీ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు’ అని స్పష్టం చేశారు.

News March 30, 2024

డీఎస్సీ వాయిదా

image

AP: రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ) వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ అధికారికంగా ప్రకటించింది. నేటి నుంచి పరీక్షలు జరగాల్సి ఉండగా, ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడ్డట్లు తెలిపింది. ఎలక్షన్ కమిషన్ నుంచి క్లియరెన్స్ వచ్చాక రివైజ్డ్ షెడ్యూల్ ప్రకటిస్తామని పేర్కొంది. ఫిబ్రవరి 7న 6,100 టీచర్ పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వడం, ఈలోపు ఎన్నికల షెడ్యూల్ రావడంతో DSC నిలిచిపోయింది.

News March 30, 2024

నేను గొర్రెను కాను: RSP

image

TG: ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా తాను BRS పార్టీని వీడనని RS ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. ‘కడియం, కేకే వంటి సీనియర్ నేతలు పార్టీని వీడటంతో నేను కూడా వారి బాటలోనే నడవాలని పలువురు కాల్ చేసి చెబుతున్నారు. దయచేసి ఎవరూ టెన్షన్ పడకండి. నేను గొర్రెను కాను. కాలేను. ఇంకెక్కడికో పోవాలన్న ఆలోచన కూడా లేదు. బహుజనవాదం, తెలంగాణవాదం కలిసేందుకే నేను KCRతో కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నా’ అని తెలిపారు.

News March 30, 2024

నేటి నుంచి పవన్ ప్రచారం

image

AP: జనసేనాని పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. తొలి విడతలో భాగంగా నేటి నుంచి ఏప్రిల్ 2 వరకు తాను పోటీ చేస్తున్న పిఠాపురంలో పర్యటిస్తారు. ఏప్రిల్ 3న తెనాలి, 4న నెల్లిమర్ల, 5న అనకాపల్లి, 6న ఎలమంచిలి, 7న పెందుర్తి, 8న కాకినాడ రూరల్, 9న పిఠాపురం, 10న రాజోలు, 11న పి.గన్నవరం, 12న రాజానగరం నియోజకవర్గాల్లో ‘వారాహి విజయభేరి యాత్ర’ పేరిట ప్రచారం చేయనున్నారు.