News March 28, 2024

నేను బీఆర్ఎస్‌లోనే ఉంటా: కేకే కుమారుడు

image

TG: సీనియర్ నేత కె.కేశవరావు బీఆర్ఎస్‌ను వీడనుండటంపై ఆయన కుమారుడు విప్లవ్ స్పందించారు. ‘కేకే, విజయలక్ష్మి నిర్ణయంతో నాకు సంబంధం లేదు. నేను పార్టీ మారే ప్రసక్తి లేదు. బీఆర్ఎస్‌లోనే ఉంటా. కేసీఆర్ నాయకత్వంపై నమ్మకం ఉంది’ అని ప్రకటించారు. కాగా కేకే పార్టీ మార్పుపై మాజీ సీఎం కేసీఆర్ సైతం అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

News March 28, 2024

అందుకే బాలీవుడ్ సినిమాలు చేయలేదు: త్రిష

image

బాలీవుడ్‌ సినిమాల్లో నటించకపోవడానికి గల కారణాలను హీరోయిన్ త్రిష వెల్లడించారు. ‘నా కుటుంబాన్ని ముంబైకి మార్చడం నాకు ఇష్టం లేదు. ముఖ్యంగా బాలీవుడ్‌కి వెళితే దక్షిణాది చిత్రాలను వదులుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నాకున్న క్రేజ్ దృష్ట్యా హిందీ సినిమాలు వద్దనుకున్నా. అంతేకానీ నా తొలి హిందీ చిత్రం ‘కట్టామిఠా’ ఫెయిల్యూర్ వల్లే బాలీవుడ్‌లో అవకాశాలు రాలేదన్న ప్రచారం అవాస్తవం’ అని చెప్పుకొచ్చారు.

News March 28, 2024

ఉద్యోగ నియామక పరీక్ష వాయిదా

image

AP: రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పరీక్ష వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 13న ఈ పరీక్ష జరగాల్సి ఉండగా.. మే 25కు వాయిదా వేస్తున్నట్లు APPSC సభ్యుడు పరిగె సుధీర్ తెలిపారు.

News March 28, 2024

ఒక్కరితో అలా చెప్పించినా ఎన్నికల్లో పోటీ చేయను: కొడాలి

image

అర్హత ఉండి తమకు ఇంటి స్థలం రాలేదని ఒక్కరితో చెప్పించినా ఎన్నికల్లో పోటీ చేయనని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. ‘టీడీపీ హయాంలో గుడివాడలో సెంటు స్థలం కూడా పేదలకు ఇవ్వలేదు. మా పాలనలో అర్హులందరికీ ఇంటి స్థలాలు ఇచ్చాం. చంద్రబాబు పేదలకు పట్టా రిజిస్ట్రేషన్ చేశారని నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా. సీఎం జగన్ పాలన దేశ చరిత్రలోనే ఒక రికార్డు. మళ్లీ ఆయనే సీఎంగా రావాలి’ అని ఆయన పేర్కొన్నారు.

News March 28, 2024

బాబు చరిత్ర చూస్తే ఏమున్నది గర్వకారణం: జగన్

image

AP: చంద్రబాబు పేరు చెబితే గుర్తొచ్చే పథకం ఒక్కటీ లేదని సీఎం జగన్ అన్నారు. ‘బాబు చరిత్ర చూస్తే ఏముంది గర్వకారణం. బాబు పార్టీ కార్యకర్తలు చెప్పుకునేందుకు ఏమున్నది గర్వకారణం. బాబు కూటమి చరిత్ర చూస్తే ఏమున్నది గర్వకారణం. అందరూ ఆలోచన చేయాలి. వీరు ఈ రాష్ట్రానికి ఏం మంచి చేశారని మళ్లీ మన ముందుకు వస్తున్నారు? బాబు పేరు చెబితే బషీర్‌బాగ్ కాల్పులు, కరవు కాటకాలు గుర్తొస్తాయి’ అని విమర్శించారు.

News March 28, 2024

ఎంపీ, పంజాబ్‌లో ఫిరాయింపుల పర్వం – 1/2

image

400 సీట్లు టార్గెట్‌గా పెట్టుకున్న BJP ప్రతిపక్షమైన కాంగ్రెస్‌కు చెక్ పెట్టేలా పావులు కదుపుతోంది. మధ్యప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో కాషాయ కండువా కప్పుకునేందుకు కాంగ్రెస్ నేతలు క్యూ కడుతున్నారు. మధ్యప్రదేశ్‌లో ఈనెల 21 నుంచి ఇప్పటివరకు వివిధ హోదాల్లోని 16,111 మంది కాంగ్రెస్ నేతలు చేరినట్లు బీజేపీ వెల్లడించింది. వీరిలో ఓ కేంద్ర మాజీ మంత్రి, ఏడుగురు మాజీ MLAలు ఉన్నట్లు పేర్కొంది.
<<-se>>#Elections2024<<>>

News March 28, 2024

ఎంపీ, పంజాబ్‌లో ఫిరాయింపుల పర్వం – 2/2

image

పంజాబ్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ‘పంజాబ్‌లో ఇప్పటి BJP ఒకప్పటి కాంగ్రెస్’ అని బీజేపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. 2021లో మాజీ CM కెప్టెన్ అమరీందర్ సింగ్ కాంగ్రెస్‌ను వీడినప్పటి నుంచి చేరికలు మొదలయ్యాయి. 2022లో నాటి కాంగ్రెస్ చీఫ్ సునీల్ జాఖర్ BJPలో చేరి అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక ఫిరాయింపులు జోరందుకున్నాయి. త్వరలో అకాలీ దళ్, AAP నుంచి కూడా చేరికలు ఉంటాయంటోంది బీజేపీ.
<<-se>>#Elections2024<<>>

News March 28, 2024

BREAKING: ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటన

image

మార్చి 31 నుంచి ఇంటర్ విద్యార్థులకు సెలవులు ఇస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రకటించింది. 2024 మార్చి 31 నుంచి 2024 మే 31 వరకు వేసవి సెలవులు ఉంటాయని ప్రకటన విడుదల చేసింది. మళ్లీ బోర్డు నుంచి ప్రకటన వచ్చిన తర్వాతే అడ్మిషన్లు తీసుకోవాలని ఇంటర్ కాలేజీలను ఆదేశించింది.

News March 28, 2024

తలైవా171.. మాస్ లుక్‌లో రజనీకాంత్

image

సూపర్ స్టార్ రజనీకాంత్.. స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కాంబోలో వస్తున్న క్రేజీ మూవీ ‘తలైవా171’. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను ఏప్రిల్ 22న రివీల్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా స్పెషల్ పోస్టర్‌‌ను విడుదల చేశారు. చేతి వాచ్‌లను చైన్‌లా పట్టుకుని ఉన్న రజనీకాంత్ మాస్ లుక్ ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించనుండగా.. శివకార్తికేయన్ కీలక పాత్రలో నటించనున్నారు.

News March 28, 2024

లంచాలు, వివక్ష లేని పాలన అందించాం: జగన్

image

AP: గడిచిన 58నెలల్లో ప్రతి ఇంటి తలుపు తట్టి సంక్షేమం అందించామని CM జగన్ తెలిపారు. ‘లంచాలు, వివక్ష లేని పాలన అందించాం. గతంలో పిల్లల చదువు కోసం ఎవరూ పట్టించుకోలేదు. నాడు-నేడుతో ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చాం. విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియం బోధన ప్రవేశపెట్టాం. ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా రూ.25లక్షల వరకు ఉచితంగా వైద్యం అందిస్తున్నాం. ఎక్కడ చూసినా విలేజ్ హెల్త్ క్లినిక్స్ కనిపిస్తున్నాయి’ అని వివరించారు.