India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
TG: బీఆర్ఎస్ నుంచి గెలిచి ఇతర పార్టీల్లోకి వెళ్లేవారిని ప్రజలే చెప్పులతో కొడతారని ఆ పార్టీ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు. అక్రమాలకు పాల్పడేందుకే కొందరు పార్టీ మారుతున్నారని ఆరోపించారు. వారి అక్రమాలను బీఆర్ఎస్ బయట పెడుతుందన్నారు. ఇక అకాల వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతిందని.. సీఎం, మంత్రులు కనీసం రైతులను పరామర్శించలేదని పల్లా మండిపడ్డారు.
తమ జీవితాల్ని మార్చిన సినిమా ‘ఈ రోజుల్లో’ అని దర్శకుడు మారుతి అన్నారు. అప్పట్లో పరిమిత వ్యయంతో సరదాగా చేసిన ఈ సినిమా.. సాంకేతికంగా పరిశ్రమలో స్ఫూర్తి నింపిందని అన్నారు. పన్నెండేళ్ల తర్వాత మళ్లీ ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం సంతోషంగా ఉందన్నారు. దర్శకుడిగా తన జీవితాన్ని మలుపు తిప్పిన ఈ చిత్రం ఓ మధుర జ్ఞాపకమని చెప్పుకొచ్చారు. కాగా ఇవాళ ఈ సినిమా రీరిలీజ్ కానుంది.
TG: రైతుబంధు(రైతుభరోసా) ఆర్థిక సాయం పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సీజన్‌కు ముందు కాకుండా మధ్యలో లేదా చివర్లో డబ్బులు జమ చేయాలని యోచిస్తోంది. అప్పుడే ఎవరెవరు సాగు చేశారో తెలుస్తుందనేది సర్కార్ ఆలోచన. అది కూడా ఐదెకరాలలోపు రైతులకే అందించనున్నట్లు సమాచారం. అధికారులు ఇప్పటికే శాటిలైట్ రిమోట్ సెన్సింగ్ ద్వారా లెక్కలు తీస్తున్నట్లు తెలుస్తోంది.
AP: ఓటర్ల జాబితాలో మార్పుల కోసం సమర్పించిన ఫాం-7, ఫాం-8 దరఖాస్తులను ఈ నెల 26లోపు పరిష్కరించాలని అధికారులను సీఈవో ముకేశ్ కుమార్ మీనా ఆదేశించారు. ఫాం-6లను పూర్తిగా పరిశీలించిన తర్వాతే కొత్త ఓటర్లుగా నమోదు చేయాలని స్పష్టం చేశారు. జిల్లాల పరిధిలోనే కాకుండా రాష్ట్రాల సరిహద్దుల్లోనూ నిఘా కట్టుదిట్టం చేయాలని సూచించారు. ప్రతి తనిఖీ కేంద్రం వద్ద ఒక కెమెరాతో స్టాటిక్ సర్వెలెన్స్ బృందాన్ని ఉంచాలన్నారు.
దేశవ్యాప్తంగా నీటి కొరత తారస్థాయికి చేరింది. 150 ప్రధాన రిజర్వాయర్లలో నీటి నిల్వలు 38 శాతానికి పడిపోయాయి. దక్షిణాదిలోని తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడు, కేరళలో నిల్వలు అత్యల్పంగా 23 శాతానికి చేరాయి. 150 జలాశయాల నిల్వ సామర్థ్యం 178.784 బిలియన్ క్యూబిక్ మీటర్లు(BCM) కాగా ప్రస్తుతం 67.591 BCM నీరు మాత్రమే ఉంది. వేసవి ముగిసే సమయానికి పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
AP: విశాఖలో అమానుష ఘటన జరిగింది. భార్యపై అనుమానంతో ఆమెకు శిరోముండనం చేశాడో భర్త. అనకాపల్లి PSలో శంకర్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. అతనికి తెలియకుండా భార్య మహాలక్ష్మి రూ.2.5లక్షల అప్పు చేసింది. డబ్బిచ్చిన వారు తిరిగి ఇమ్మని ఇంటికొచ్చి గొడవ చేశారు. దీంతో ఆ డబ్బు ఏ ప్రియుడికి ఇచ్చావంటూ శంకర్ ఆమెపై దాడి చేశాడు. గుండు గీసి.. హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆమె తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది.
సీఎస్కే మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్‌లో రికార్డు నమోదు చేశారు. అత్యధిక రనౌట్లు చేసిన వికెట్ కీపర్‌గా ఆయన చరిత్ర సృష్టించారు. బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో అనుజ్ రావత్‌ను రనౌట్ చేశారు. దీంతో ఆయన ఇప్పటివరకు 42 మందిని రనౌట్ చేశారు. అలాగే 138 క్యాచ్‌లు పట్టారు. ఓవరాల్‌గా 180 మందిని ఔట్ చేశారు. ధోనీ తర్వాత దినేశ్ కార్తీక్ (169), సాహా (106), రాబిన్ ఉతప్ప (90), పార్థివ్ పటేల్ (81) ఉన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు, ఎలక్టోరల్ బాండ్లకు ఆసక్తికర సంబంధం ఉందని ప్రముఖ జర్నలిస్టు రాజ్‌దీప్ సర్దేశాయ్ ట్వీట్ చేశారు. ‘ఈ కేసులో శరత్ చంద్రారెడ్డి NOV 11, 2022న అరెస్టయ్యారు. 4 రోజుల తర్వాత అరబిందో ఫార్మా నుంచి ఎలక్టోరల్ బాండ్ల ద్వారా ₹5 కోట్లు BJPకి వెళ్లాయి. గత ఏడాది మేలో శరత్ బెయిల్ పిటిషన్‌కు ED అభ్యంతరం చెప్పలేదు. జూన్ 2న ఆయన రిలీజయ్యారు. NOVలో ₹25 కోట్లు BJPకి చేరాయి’ అని పేర్కొన్నారు.
AP: పల్నాడు జిల్లా రెంటచింతలలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. శుక్రవారం గరిష్ఠంగా 40.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రోజురోజుకు పెరుగుతున్న ఎండలతో ఇక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. ఏటా వేసవిలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రాంతాల్లో రెంటచింతల ఒకటి.
AP: ఖరీఫ్‌లో 4.97 లక్షల మంది రైతుల నుంచి 29.91 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు 4.36 లక్షల మంది రైతులకు రూ.5,700 కోట్లు చెల్లించామంది. మిగిలిన 61 వేల మంది రైతుల ఖాతాల్లో రూ.838 కోట్లను వారం రోజుల్లో జమ చేస్తామని తెలిపింది. ఏప్రిల్ మొదటి వారం నుంచి రబీ కొనుగోళ్లు ప్రారంభిస్తామని, 25 లక్షల టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేస్తున్నట్లు పేర్కొంది.
Sorry, no posts matched your criteria.