India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
AP: YCP నుంచి TDPలో చేరి సస్పెన్షన్‌కు గురైన ఇద్దరు నేతల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. గుంటూరు(D) తాడికొండ Ex MLA శ్రీదేవి, నెల్లూరు(D) ఉదయగిరి Ex MLA చంద్రశేఖర్ రెడ్డికి TDP మూడో జాబితాలోనూ చుక్కెదురైంది. ఆ జిల్లాల్లో అభ్యర్థుల ఎంపిక పూర్తి కావడంతో.. ఇక వీరు ఈ ఎన్నికల బరిలో లేనట్లేనని తెలుస్తోంది. మరో ఇద్దరు నేతలు కోటంరెడ్డి(నెల్లూరుR), రామనారాయణ రెడ్డి(ఆత్మకూరు)కి TDP సీట్లు కేటాయించింది.
ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అనేది నిజమే. ఇందుకు ఈ రమేశ్ ఉత్తమ ఉదాహరణ. తనకు వచ్చిన ఓ ఆలోచనను ఆచరణలో పెడితే వచ్చిన ఫలితం రూ.1200 కోట్లు. ఇంతకీ ఆయనకు వచ్చిన ఆ ఆలోచన ఏంటి, ఏం చేశారు? కటింగ్ షాపు నుంచి సీన్ కట్ చేస్తే ఇంత సంపద ఎలా వచ్చింది..? అనే విషయాల కోసం ఇక్కడ <
కన్నడ బిగ్‌బాస్ ఫేమ్ సోను శ్రీనివాస గౌడను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎనిమిదేళ్ల బాలికను ఆమె అక్రమంగా దత్తత తీసుకోవడంతో బైదరహళ్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాను బాలికను దత్తత తీసుకున్నానంటూ ఇటీవల సోను సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. దీంతో చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు ఆమెపై ఫిర్యాదు చేశారు. సమాజంలో సానుభూతి, పేరు ప్రఖ్యాతల కోసమే ఆమె చిన్నారిని దత్తత తీసుకున్నట్లు పేర్కొన్నారు.
ప్రస్తుత రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో మనిషి శరీర భాగాల్లో వణుకు మొదలవుతుంది. కాగా ఈ వ్యాధికి పెస్టిసైడ్స్ ఓ కారణమని పరిశోధకులు తేల్చారు. అట్రాజైన్, లిండేన్, సిమేజైన్ వంటి 14 రకాల క్రిమిసంహారక మందుల ద్వారా ఈ వ్యాధి ప్రబలుతోందని తెలిపారు. వ్యవసాయ క్షేత్రాల్లో పని చేసేవారు, ఆయా పరిసర ప్రాంతాల్లో ఉండేవారు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడే ప్రమాదం ఉందట.
యూజర్ల కోసం మరో అద్భుతమైన ఫీచర్‌ను వాట్సాప్ తీసుకొచ్చింది. ఇప్పటి వరకు ఏదైనా ఒక ముఖ్యమైన మెసేజ్‌ను టాప్‌లో పిన్ చేసుకునేందుకు అవకాశం ఉండగా, ఇకపై గరిష్ఠంగా 3 మెసేజ్‌లను పిన్ చేసుకునే వీలు కల్పించింది. పర్సనల్ చాట్‌లతోపాటు గ్రూప్స్, పోల్స్, ఫొటోలు, ఎమోజీలను కూడా పిన్ చేసుకోవచ్చు. ఇవి డిఫాల్ట్‌గా ఏడు రోజులు టాప్‌లో ఉంటాయి. కావాలనుకుంటే ఒక రోజు, 30 రోజులకు సెట్ చేసుకోవచ్చు.
మరికొద్ది సేపట్లో IPL 2024 టోర్నీ ప్రారంభం కానుంది. ఈక్రమంలో స్టార్ స్పోర్ట్స్ కీలక ప్రకటన చేసింది. IPL చరిత్రలో తొలిసారి చెవుడు, దృష్టి లోపం ఉన్న క్రికెట్ అభిమానుల కోసం ప్రత్యేక సదుపాయాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపింది. వారికోసం సైన్ లాంగ్వేజ్‌లో కామెంటరీ చేయనున్నట్లు వెల్లడించింది. స్టార్ స్పోర్ట్స్ తీసుకున్న ఈ నిర్ణయంపై నెట్టింట అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
AP: విశాఖలో భారీగా డ్రగ్స్ పట్టుబడటంపై TDP ట్వీట్ చేసింది. ‘ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే లోపు పోలీసులతో డ్రగ్స్ దింపేసి, బ్రెజిల్ మాఫియా దగ్గర డబ్బులు కొట్టేద్దామని ప్లాన్ వేశాడు. షిప్ వారం లేటుగా వచ్చింది. ఈలోపు ఇంటర్‌పోల్, CBI రంగంలోకి దిగి పట్టేశాయి. జగన్ రెడ్డి పోలీసులని, అధికారులను పంపించి CBI విచారణను అడ్డుకున్నారు. కానీ CBI నట్లు బిగించి సరుకు పట్టేసింది’ అని ఆరోపించింది.
IPLలో CSK కెప్టెన్‌గా తప్పుకున్న ధోనీపై మాజీ క్రికెటర్ వసీం జాఫర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘ధోనీ ఆటగాడిగా కూడా రిటైర్ అయితే బాగుండేది. MSD ప్లేయర్‌గా ఉన్న జట్టును కెప్టెన్‌గా ముందుకు నడిపించడం రుతురాజ్‌కు సాధ్యం కాదు. కొత్త కెప్టెన్ ఏదైనా నిర్ణయం తీసుకుంటే.. ధోనీ అంగీకరించవచ్చు. వద్దని చెప్పవచ్చు. ధోనీ గ్రౌండ్‌లో ఉంటే రుతురాజ్ సొంత నిర్ణయం తీసుకోవడానికి ఇబ్బంది పడతాడు’ అని చెప్పుకొచ్చారు.
కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. 2014-17 మధ్య తమ పార్టీ ఖాతాల్లోకి వచ్చిన డబ్బుపై పన్ను రికవరీ కోసం ఐటీ శాఖ తీసుకుంటోన్న చర్యలను నిలుపుదల చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు కొట్టి వేసింది. ఇప్పటికే పార్టీ అకౌంట్‌లోని రూ.105 కోట్లను ఐటీ శాఖ ఫ్రీజ్ చేసిన విషయం తెలిసిందే. కాగా డబ్బు వాడుకునే అవకాశం లేకపోవడంతో పార్టీ తీవ్ర ఇబ్బందులు పడుతోందని కాంగ్రెస్ అగ్రనేతలు నిన్న వెల్లడించారు.
స్పెయిన్‌లోని కానరీ దీవుల సమూహంలోని లాంజరోట్, ఫ్యూర్టెవెంచురాలను సందర్శించే పర్యాటకులకు అధికారులు భారీ ఫైన్‌లు విధిస్తున్నారు. ఎందుకంటే చాలా మంది అక్కడి ఇసుక, రాళ్లను తీసుకెళ్తున్నారట. ఇది ద్వీపాల పర్యావరణ వ్యవస్థపై హానికర ప్రభావాన్ని చూపుతోంది. దీంతో సందర్శకులకు రూ.2లక్షల వరకు ఫైన్ విధించేస్తున్నారు. పర్యాటకుల తాకిడి భారీగా పెరగడంతో తీవ్ర నీటి కొరత ఏర్పడి ఇటీవల ఎమర్జెన్సీ కూడా ప్రకటించారు.
Sorry, no posts matched your criteria.