News March 19, 2024

ఇండియా కూటమి ప్రచార జోరు తగినంత లేదా?

image

సార్వత్రిక ఎన్నికలకు కౌంట్‌డౌన్ మొదలైన నేపథ్యంలో రాజకీయ పార్టీలు.. ముఖ్యంగా ఇండియా కూటమి ప్రచారం చర్చనీయాంశమైంది. భారత్ జోడో న్యాయ్ యాత్ర పేరుతో మణిపుర్-ముంబై రాహుల్ యాత్ర చేసినా అది రాజకీయంగా ఆశించినంత ఫలితాన్ని ఇవ్వలేదనేది విశ్లేషకుల మాట. ఇండియా కూటమి బీజేపీపై విమర్శలకు పరిమితం కాకుండా తమ ఎజెండా ఎంటో వివరించి, ప్రచారాన్ని విస్తృతం చేయాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.

News March 19, 2024

19 మంది వాలంటీర్లపై వేటు

image

AP: ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్లకు అధికారులు షాక్ ఇచ్చారు. ‘సిద్ధం’ సభలో పాల్గొనడంతో అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 16 మంది వాలంటీర్లపై వేటు పడింది. అంబాజీపేట మండలం మొసలపల్లి, వాకలగరువు, ఇరుసుమండకు చెందిన వాలంటీర్లను సస్పెండ్ చేశారు. ఇటు అనకాపల్లి(D)లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఇద్దరిని విధుల నుంచి తొలగించారు. పల్నాడు(D) పెదకూరపాడులో పార్టీ మీటింగ్‌లో పాల్గొన్న ఓ వాలంటీర్‌పై వేటు వేశారు.

News March 19, 2024

అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్‌లో భాగమే!

image

అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగంలోనిదేనని ఇటీవల చైనా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను భారత విదేశాంగ శాఖ తోసిపుచ్చింది. ఆ ఈశాన్య రాష్ట్రం గతంలో, ఇప్పుడు, భవిష్యత్తులోనూ భారత్‌లో భాగంగానే ఉంటుందని స్పష్టం చేసింది. పదేపదే నిరాధార వాదనలు చేసినంత మాత్రాన అవి నిజమైపోవని పేర్కొంది. దేశం నుంచి ఆ రాష్ట్రాన్ని విడదీయలేమంది. అభివృద్ధి కార్యక్రమాలతో అరుణాచల్ ప్రజలు భవిష్యత్తులోనూ లబ్ధి పొందుతారని తెలిపింది.

News March 19, 2024

జగన్‌కు ఓటేస్తే మన గొంతు మనం కోసుకున్నట్లే: దస్తగిరి

image

AP: జగన్ పరిపాలన రాక్షస పాలనను తలపిస్తోందని పులివెందుల జై భీమ్ రావు భారత్ పార్టీ MLA అభ్యర్థి దస్తగిరి మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వంలో దళితులపై దాడులు పెరిగాయని ఆరోపించారు. రాష్ట్రంలో రాజారెడ్డి, జగన్ రాజ్యాంగం నడుస్తోందని మండిపడ్డారు. ఈసారి జగన్‌కు ఓటేస్తే మన గొంతు మనం కోసుకున్నట్లే అని అన్నారు. వివేకా హత్య కేసులో తాను అప్రూవర్‌గా మారకపోయి ఉంటే తనకు కూడా ఓటు అడిగే హక్కు లేదని అన్నారు.

News March 19, 2024

ఈ ఆలయం విడాకులకు ప్రసిద్ధి

image

జపాన్‌లోని ఓ ఆలయం విడాకులకు ప్రసిద్ధి చెందింది. భాగస్వామితో విడిపోవాలని అనుకుంటున్నప్పుడు క్యోటో నగరంలోని ‘యాసుయ్ కొంపిరగు’ అనే దేవాలయంలో మొక్కితే మన కోరిక నెరవేరుతుందట. డివోర్స్ వరకే కాదండోయ్.. వ్యాపార బంధాలు ముగించాలన్నా, ఉన్న ఉద్యోగంలో నుంచి సామరస్యంగా బయటకి పోవాలన్నా, మనకున్న శత్రుత్వ బంధాలకు స్నేహపూర్వకంగా పులిస్టాప్ పడాలన్నా ఆ దేవాలయంలో ప్రార్థనలు చేస్తే చాలని అక్కడి భక్తులు నమ్ముతున్నారు.

News March 19, 2024

BREAKING: ఫలితాలు విడుదల

image

SBIలో ప్రొబేషనరీ ఆఫీసర్(PO) పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షల తుది ఫలితాలు విడుదలయ్యాయి. 2వేల PO పోస్టులకు 2023 SEPలో దరఖాస్తులు స్వీకరించిన సంగతి తెలిసిందే. ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వారిని షార్ట్ లిస్ట్ చేసి జనవరిలో సైకోమెట్రిక్, గ్రూప్ ఎక్సర్సైజ్, పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహించారు. తాజాగా ఎంపికైన వారి రోల్ నెంబర్లతో తుది ఫలితాలను విడుదల చేశారు. ఫలితాల కోసం <>క్లిక్<<>> చేయండి.

News March 19, 2024

ఫోన్ టాపింగ్ కేసులో ఇద్దరు సీఐలు

image

TS: మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కేసు కీలక మలుపు తిరిగింది. ఫోన్ టాపింగ్ కేసులో ఇద్దరు సీఐలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వరంగల్‌లో పని చేస్తున్న ఆ ఇద్దరిని పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు టాపింగ్ డివైజ్ మొత్తాన్ని ప్రణీత్ ధ్వంసం చేసినట్లు గుర్తించారు. వికారాబాద్ అడవుల్లో పడేసిన హార్డ్ డిస్క్ కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రణీత్ వెనుక ఓ మీడియా యజమాని ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

News March 19, 2024

మైక్ సరిచేసుకోలేని వారు రాష్ట్రాన్ని నడుపుతారా?: అంబటి

image

AP: మూడు పార్టీల సభ అట్టర్ ప్లాప్ అయిందని, ముగ్గురు కలిసి పోటీ చేసినా జగన్‌ను ఓడించలేరని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. ‘ప్రధాని పాల్గొన్న సభనే విజయవంతం చేయలేకపోయారు. చంద్రబాబు జీవితమంతా అభద్రతాభావమే. మైక్ సరిచేసుకోలేని వారు రాష్ట్రాన్ని నడుపుతారా? బాబు అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు ఉండవు. జనాలు ఆయనను నమ్మే పరిస్థితిలో లేరు’ అని అంబటి అన్నారు.

News March 19, 2024

ALERT: చేతులు సరిగా కడుక్కోవడం లేదా?

image

చేతులు శుభ్రంగా కడుక్కోకపోవడం మెదడులో టేప్‌వార్మ్స్(బద్దె పురుగులు) పెరగడానికి ఓ కారణమని అమెరికన్ జర్నల్ ఆఫ్ కేస్ రిపోర్ట్స్‌ వెల్లడించాయి. ఈ బద్దె పురుగు కణజాలాల్లోకి చొచ్చుకెళ్లి, అక్కడి నుంచి మెదడులోకి వెళుతుందట. ఉడకని పంది మాంసం తినేవారిలోనూ ఈ టేప్‌వార్మ్స్ గుర్తించినట్లు ఆ రిపోర్టు వెల్లడించింది. ఈ సమస్య ఉన్న వారి మలమూత్రాల ద్వారా కుటుంబ సభ్యులకూ వ్యాధి వ్యాపించే ప్రమాదం ఉందని తెలిపింది.

News March 19, 2024

హోం ఓటింగ్‌కు నోటిఫికేషన్ విడుదల

image

AP: మే 13న జరగనున్న ఎన్నికల్లో 85 ఏళ్లు పైబడిన వారు, శారీరక వైకల్యం ఉన్న ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ జారీకి ఈసీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఒకసారి పోస్టల్ బ్యాలెట్ కోసం ఫాం-12 సమర్పించాక పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేయలేరు. శారీరక వైకల్యం నిర్ధారించిన మేరకు ఉంటేనే పోస్టల్ బ్యాలెట్‌కు అనుమతిస్తారు. పోలింగ్ తేదీకి 10 రోజుల ముందే ఇంటి నుంచి వారు ఓటు వేయవచ్చు. ఆ ఓటును 2 కవర్లలో పోలింగ్ బాక్సుల్లో ఉంచుతారు.