News April 12, 2025

ICICI నుంచి లోన్లు తీసుకోలేదు: మంత్రి శ్రీధర్ బాబు

image

TG: ICICI బ్యాంకు నుంచి తాము ఎలాంటి లోన్లు తీసుకోలేదని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ ‘కంచ గచ్చిబౌలి భూములు ప్రభుత్వానివేనని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అయినా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. AI వీడియోలు పోస్ట్ చేసి HYDకు పెట్టుబడులు, ఉద్యోగాలు రావొద్దని కుట్ర చేస్తున్నారు. స్టూడెంట్స్‌ను ప్రభావితం చేసి సర్కార్ పనుల్ని అడ్డుకోవాలని చూస్తున్నారు’ అని మండిపడ్డారు.

News April 12, 2025

15 నుంచి రాష్ట్రంలో చేపల వేట నిషేధం

image

AP: ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు రాష్ట్రంలో చేపల వేట నిషేధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మత్స్య సంపద వృద్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మరబోట్లు, మెకనైజ్డ్, మోటార్ బోట్లతో మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి.రాజశేఖర్ జీవో నం.129 విడుదల చేశారు.

News April 12, 2025

సోనియా, రాహుల్ ఆస్తుల జప్తునకు రంగం సిద్ధం

image

‘నేషనల్ హెరాల్డ్’ కేసులో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్‌కు చెందిన ఆస్తులను ఈడీ జప్తు చేయనుంది. ఢిల్లీ, లక్నో, ముంబైలోని రూ.661 కోట్ల ఆస్తులపై అక్కడి రిజిస్ట్రార్స్‌కు నోటీసులు పంపింది. అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌కు చెందిన ₹2000 కోట్ల ప్రాపర్టీస్‌ను సోనియా, రాహుల్‌కు చెందిన యంగ్ ఇండియా లిమిటెడ్ కంపెనీ కేవలం రూ.50 లక్షలకు అక్రమంగా దక్కించుకుందన్న ఆరోపణలపై ఈడీ 2021 నుంచి దర్యాప్తు చేస్తోంది.

News April 12, 2025

బెంగాల్‌లో అల్లర్లు.. సీఎం సంచలన వ్యాఖ్యలు

image

వక్ఫ్ చట్టం సవరించిన నేపథ్యంలో బెంగాల్‌లో కొద్ది రోజులుగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. దీనిపై ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ స్పందిస్తూ ‘చట్టాన్ని సవరించింది కేంద్ర ప్రభుత్వం. మేం కాదు. మీరు కేంద్రంతోనే తేల్చుకోండి. సవరించిన వక్ఫ్ చట్టాన్ని అమలు చేయబోమని ఇప్పటికే చెప్పాం. కాబట్టి అన్ని మతాల ప్రజలు శాంతించండి’ అని వ్యాఖ్యానించారు. కాగా ఈ అల్లర్లలో ఇప్పటివరకు ముగ్గురు చనిపోయారు.

News April 12, 2025

CSK మరో చెత్త రికార్డు

image

ఐపీఎల్-2025లో ఇప్పటివరకు అత్యధిక డాట్ బాల్స్ (245) ఆడిన జట్టుగా CSK నిలిచింది. నిన్న KKRతో ఆడిన మ్యాచులోనే 61 డాట్ బాల్స్ ఆడటం గమనార్హం. ఈ లిస్టులో CSK తర్వాత వరుసగా KKR (245), RR (206), RCB (202), MI (198), SRH (191), LSG (186), GT (167), PBKS (145), DC (123) ఉన్నాయి. ఐపీఎల్‌లో ఒక్కో డాట్ బాల్‌కు బీసీసీఐ 500 మొక్కలను నాటుతున్న సంగతి తెలిసిందే.

News April 12, 2025

గోశాలలో ఆవుల మరణంపై YCP దుష్ప్రచారం: నారాయణ

image

AP: టీటీడీ గోశాలలో వందలాది ఆవులు మరణించడం అవాస్తవమని మంత్రి నారాయణ తెలిపారు. దీనిపై వైసీపీ దుష్ప్రచారం చేస్తోందని ఆయన మండిపడ్డారు. ‘మత విద్వేషాలను రెచ్చగొట్టి ప్రజల్లో అలజడి సృష్టించేందుకు వైసీపీ కుట్ర పన్నింది. తప్పుడు ప్రచారంతో టీటీడీ ప్రతిష్ఠను దిగజార్చాలని చూసింది. ఇలాంటి కుట్రలు చేస్తుంది కాబట్టే ఆ పార్టీ పతనమైంది’ అని ఆయన ఫైర్ అయ్యారు.

News April 12, 2025

EVMలను ట్యాంపర్ చేయడం అసాధ్యం: CEC

image

EVMలను హ్యాక్ చేయవచ్చన్న US జాతీయ నిఘా విభాగం డైరెక్టర్ తులసి గబ్బార్డ్ చేసిన వ్యాఖ్యలను CEC జ్ఞానేష్ కుమార్ ఖండించారు. ఇండియాలో వాడే EVMలు వంద శాతం సేఫ్, ట్యాంపర్ ప్రూఫ్ అని స్పష్టం చేశారు. వాటిని ఎలాంటి బ్లూటూత్ పరికరాలతో కనెక్ట్ చేయలేరని, అందుకే ట్యాంపర్ చేయడం అసాధ్యమని తేల్చి చెప్పారు. 5 కోట్ల VVPAT స్లిప్పులు లెక్కించినా.. ఎక్కడా తప్పులు దొర్లలేదని తెలిపారు.

News April 12, 2025

‘వనజీవి’ రామయ్య స్ఫూర్తిని కొనసాగిస్తాం: పవన్

image

AP: వనజీవి రామయ్య పర్యావరణ పరిరక్షణ కోసం ఆరు దశాబ్దాలుగా అలుపెరుగని కృషి చేసి, సుమారు కోటి మొక్కలు నాటారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని తెలిపారు. పచ్చదనం పెంచడానికి రామయ్య, ఆయన సతీమణి చేసిన వన యజ్ఞం ఎన్నో తరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందిస్తుందన్నారు. రామయ్య స్ఫూర్తిని కొనసాగిస్తూ, పచ్చదనం పెంపునకు కృషి చేస్తామన్నారు.

News April 12, 2025

UPI పేమెంట్స్ ఫెయిల్.. ‘క్యాష్ ఈజ్ కింగ్’

image

దేశవ్యాప్తంగా యూపీఐ పేమెంట్లు ఫెయిల్ కావడంతో జేబులో డబ్బు ఉండటం ఎంత ముఖ్యమో మరోసారి తెలిసి వచ్చిందని నెటిజన్లు అంటున్నారు. క్యాష్ ఈజ్ కింగ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అత్యవసర సమయాల్లో యూపీఐ సేవలను నమ్ముకోలేమని, లిక్విడ్ క్యాష్ దగ్గర ఉంచుకోవాలని చెబుతున్నారు. కష్టకాలంలో ఇది మిమ్మల్ని ఆదుకుంటుందని అంటున్నారు. కాగా ఇవాళ ఉదయం నుంచి యూపీఐ సేవలు నిలిచి కస్టమర్లు ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే.

News April 12, 2025

9,970 ఉద్యోగాలకు దరఖాస్తులు ప్రారంభం

image

రైల్వేలో 9,970 అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. మే 11 చివరి తేదీ. టెన్త్‌తోపాటు ITI, ఇంజినీరింగ్‌లో డిగ్రీ/డిప్లమా పూర్తిచేసి 18-30 ఏళ్ల వయసున్న వారు అర్హులు. రిజర్వేషన్‌ను బట్టి సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు జనరల్/OBCలకు రూ.500, మిగతావారికి రూ.250గా ఉంది. రాత పరీక్ష, ఫిజికల్ టెస్టుల ఆధారంగా ఎంపిక చేస్తారు. పూర్తి వివరాల కోసం <>ఇక్కడ క్లిక్<<>> చేయండి.