India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రజలకు అవసరమైన డ్రగ్స్, సర్జికల్స్ కచ్చితంగా అందుబాటులో ఉంచాలని కలెక్టర్ వినోద్ కుమార్. ఆదేశించారు. గురువారం అనంతపురంలోని శారద నగర్‌లో ఉన్న ఏపీఎంఎస్ఐడీసీ సెంట్రల్ డ్రగ్స్ స్టోర్‌ను ఆయన తనిఖీ చేశారు. అనంతరం సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రులకు అవసరమైన మందుల సరఫరాలో ఎలాంటి లోటూ ఉండరాదన్నారు.

ఉరవకొండ మండలం వై.రాంపురం గ్రామానికి చెందిన బోయ నింబగంటి వేణు (22) అనే యువకుడు బ్రెయిన్ స్ట్రోక్‌తో బుధవారం రాత్రి మృతి చెందాడు. మంగళవారం సాయంత్రం ఉన్నఫళంగా కళ్లు తిరిగి పడిపోవడంతో కుటుంబ సభ్యులు అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు కర్నూలు తీసుకెళ్లమని సూచించారు. ఈ క్రమంలోని కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

అనంతపురం జిల్లాలో శివరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. నిన్న రాత్రి శింగనమల మండల కేంద్రంలోని భవానిశంకర్ ఆలయంలో శివపార్వతుల కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే బండారు శ్రావణి కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. శివపార్వతుల విగ్రహాలు, పట్టువస్త్రాలు, బంగారు మంగళ సూత్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. కళ్యాణోత్సవాన్ని తిలకించారు.

గుంతకల్లుకు చెందిన బ్లడ్ డోనర్ రెడ్ డ్రాప్ రెహ్మాన్‌కు అరుదైన గౌరవం లభించింది. కర్ణాటక తొర్నగల్ జిందాల్ ఫ్యాక్టరీలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి ఆయనను ప్రత్యేకంగా ఆహ్వానించారు. రెహ్మాన్‌ను జేఎస్‌డబ్ల్యూ ఫౌండేషన్ మేనేజర్ పెద్దన్న, ముఖ్య అతిథులు సీనియర్ అడ్మినిస్ట్రేషన్ సునీల్ రాల్ఫా చేతుల మీదుగా జ్ఞాపికతో సత్కరించారు. 133 సార్లు రక్తదానం చేసినందుకు రెహ్మాన్‌కు సన్మానం చేశారు.

రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి మండలంలో విషాద ఘటన జరిగింది. శివారెడ్డి భార్య పవిత్ర (32) ఏడు రోజుల బాలింత లివర్ ఇన్ఫెక్షన్‌తో మృతి చెందారు. ఆమె వారం రోజుల క్రితం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో మగ బిడ్డకు జన్మనిచ్చారు. అనంతరం దద్దుర్లు, ఇన్ఫెక్షన్‌తో ఆమె బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు వైద్యుల సూచనలు మేరకు బెంగళూరుకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

తాడిపత్రిలో పోలీసుల తీరు దుర్మార్గంగా ఉందని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మండిపడ్డారు. తాను తాడిపత్రికి వెళ్తే శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని చెప్పడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. నియోజకవర్గంలో తమ నేతలు, కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని, కొన్ని చోట్ల వారి ఇళ్లను కూడా కూలుస్తున్నారని వాపోయారు. ప్రభుత్వాలు శాశ్వతం కాదని, అధికారులు చట్టానికి లోబడి పనిచేయాలని హితవు పలికారు.

నాటుసారా రహిత అనంత జిల్లాను తయారు చేయాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్లో నవోదయం 2.0పై ఎస్పీ జగదీశ్, జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మతో కలిసి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. కర్ణాటక సరిహద్దులో ఎన్‌ఫోర్స్‌మెంట్ సిబ్బంది చురుకుగా పనిచేయాలన్నారు. అందరూ సమష్ఠిగా కృషి చేసి, లక్ష్యం చేరుకోవాలని సూచించారు.

అనంతపురం జిల్లాలో ఇవాళ (బుధవారం) శివరాత్రి ఉత్సవాలు జరగనున్న ప్రధాన శివాలయాల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ జగదీశ్ తెలిపారు. ప్రజలందరు శివరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని కోరారు. ఆలయాల వద్ద పోలీసుల సూచనలు పాటిస్తే ఏ ఇబ్బందీ లేకుండా కార్యక్రమాలు సజావుగా సాగుతాయని వెల్లడించారు.

ప్రజలు సైబర్ మోసాలతో ఎంతో మంది ఇబ్బంది పడ్డారని ఎస్పీ జగదీశ్ పేర్కొన్నారు. బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని గురుకుల పాఠశాలలో సైబర్ మోసాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ముఖ్యంగా విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ మోసాలపై వివరించాలన్నారు. అనుమానితుల నుంచి ఫోన్ కాల్స్ వస్తే పోలీసులను సంప్రదించాలన్నారు.

గ్రామాల్లో సచివాలయ మహిళా పోలీసులు ఇంటింటికీ వెళ్లి సైబర్ నేరాల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలకు వివరించాలని ఎస్పీ జగదీశ్ ఆదేశించారు. అనంతపురం జేఎన్టీయూ ఆడిటోరియంలో మహిళా పోలీసులకు వర్క్‌షాప్ నిర్వహించారు. అందరూ గ్రామాల్లో తప్పనిసరిగా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ముఖ్యంగా మహిళలకు సెల్ ఫోన్, మొబైల్ యాప్స్ ద్వారా జరిగే నష్టాలను వివరించాలన్నారు.
Sorry, no posts matched your criteria.